Punjabi Dress
-
పంజాబీ డ్రెస్ వేసుకోవద్దని గొడవ.. భార్యను చంపిన భర్త
చైతన్యపురి: భార్యా భర్తల మధ్య చోటుచేసుకున్న గొడవ హత్యకు దారితీసింది. ఆవేశానికి లోనైన భర్త కత్తితో పొడిచి భార్యను చంపిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపిన వివరాలు...ప్రకాశం జిల్లాకు చెందిన గంజి వెంకటే‹Ù, గంజి సోను (32) దంపతులు ఇద్దరు పిల్లలతో నగరానికి వచ్చి గడ్డిఅన్నారం సరస్వతీనగర్ కాలనీలో నివసిస్తున్నారు. వెంకటేష్ కూలిపని చేస్తుండగా సోను ఇళ్లలో పనిచేస్తుంది. వీరికి గోవిందరాజు (14), మురళీ కృష్ణ (11) ఇద్దరు కుమారులున్నారు. గత మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం సోను పంజాబీ డ్రస్ వేసుకోగా వెంకష్ కు నచ్చలేదు. వద్దని వారించినా వినకపోవటంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ దశలో వెంకటేశ్ ఆవేశంగా కూరగాయలు కోసే చాకు తీసుకుని భార్యను కడుపులో, వీపుపై పొడిచాడు. దీంతో సోను రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. భార్యపై దాడి చేసే సమయంలో వెంకటేష్ చేతికి స్వల్పగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
కొత్త లుక్‌తో... దిల్ ఖుష్!
ఎర్రటి పంజాబీ డ్రెస్‌లో, చందమామ లాంటి మోముతో తళతళలాడుతున్న అందాల తార ఐశ్వర్యారాయ్ ‘సరబ్జిత్’ సిన్మా లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ఐష్‌ది మెయిన్ రోల్ కాకపోయినా ఆమే ఈ చిత్రానికి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అని వేరే చెప్పాల్సిన పని లేదు. అందుకే చిత్ర బృందం ఐష్ స్టిల్స్‌ను ఎక్కువగా విడుదల చే సి, సినిమాకు మరింత ప్రచారం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. భారత గూఢచారి అనే అభియోగంతో జీవితాంతం జైల్లోనే మగ్గిపోయిన ‘సరబ్జిత్’ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. తమ్ముడికి జరిగిన అన్యాయం గురించి పోరాడిన సోదరి దల్బీర్ కౌర్ పాత్రలో ఐష్ కనిపించనున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే సహజత్వానికి దగ్గరగా లుక్స్ విషయంతో చిత్ర దర్శకుడు ఒమంగ్ కుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరబ్జిత్గా రణదీప్హుడా, ఆయన భార్యగా రిచా చద్దా కనిపించనున్నారు. ఆ మధ్య ‘జజ్బా’ చిత్రం అనుకున్న ఫలితమివ్వకపోవడంతో, ఈ సినిమాతోనైనా హిట్ సాధించాలని ఐశ్వర్య శ్రమిస్తున్నారు.