పంజాబీ డ్రెస్‌ వేసుకోవద్దని గొడవ.. భార్యను చంపిన భర్త | Husband Killed His Wife After Argument On Not To Wear Punjabi Dress In Hyderabad | Sakshi
Sakshi News home page

పంజాబీ డ్రెస్‌ వేసుకోవద్దని గొడవ.. భార్యను చంపిన భర్త

Oct 14 2024 12:02 PM | Updated on Oct 14 2024 12:42 PM

wife murdered by husband

చైతన్యపురి: భార్యా భర్తల మధ్య చోటుచేసుకున్న గొడవ హత్యకు దారితీసింది. ఆవేశానికి లోనైన భర్త కత్తితో పొడిచి భార్యను చంపిన సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి తెలిపిన వివరాలు...ప్రకాశం జిల్లాకు చెందిన గంజి వెంకటే‹Ù, గంజి సోను (32) దంపతులు ఇద్దరు పిల్లలతో నగరానికి వచ్చి గడ్డిఅన్నారం సరస్వతీనగర్‌ కాలనీలో నివసిస్తున్నారు. 

వెంకటేష్‌ కూలిపని చేస్తుండగా సోను ఇళ్లలో పనిచేస్తుంది. వీరికి గోవిందరాజు (14), మురళీ కృష్ణ (11) ఇద్దరు కుమారులున్నారు. గత మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం సోను పంజాబీ డ్రస్‌ వేసుకోగా వెంకష్‌ కు నచ్చలేదు.

 వద్దని వారించినా వినకపోవటంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ దశలో వెంకటేశ్‌ ఆవేశంగా కూరగాయలు కోసే చాకు తీసుకుని భార్యను కడుపులో, వీపుపై పొడిచాడు. దీంతో సోను రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. భార్యపై దాడి చేసే సమయంలో వెంకటేష్‌ చేతికి స్వల్పగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement