మహారాష్ట్ర పున్పున్ నదిలో విషాదం
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా పున్పున్ నదిలో మంగళవారం పడవ మునిగిపోయిన దుర్ఘటనలో ఒకరు మరణించారు. మరో 8 మందికిపైగా గల్లంతయ్యారు.
విద్యార్థులతో సహా 15 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది. వీరిలో ఆరుగురిని రక్షించారు. మిగిలినవారికోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి వుంది.