రేపు పూరానాపూల్‌లో రీపోలింగ్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పాతబస్తీలో తలెత్తిన ఘర్షణల కారణంగా పూరానాపూల్ డివిజన్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య జరిగిన గొడవల కారణంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
52 డివిజన్ పూరానాపూల్లోని 36 పోలింగ్ బూత్‌లలో శుక్రవారం ఉదయం 7గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 34,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 225 మంది ఎన్నికల సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటారు. శుక్రవారం గ్రేటర్ పరిధిలో 24 ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. పూరానాపూల్ రీ పోలింగ్ కారణంగా గ్రేటర్ ఎన్నికల ఫలితాల విడుదలపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం 4గంటల నుంచి 150 డివిజన్ల కౌంటింగ్ జరిపేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశముంది.