purandhareswari
-
భువనేశ్వరి, పురంధేశ్వరి ఇద్దరూ వెన్నుపోటు సిస్టర్స్: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. సీఎం జగన్ కాలిగోటికి కూడా సరిపోని వ్యక్తులు ఈరోజు మాట్లాడటం సిగ్గుచేటు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, వరుదు కల్యాణి బుధవారం వైజాగ్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ తిరిగి పాలనలోకి రాదని తేలిపోయింది. వైఎస్సార్సీపీ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతమైన తీరు బట్టి టీడీపీ ఓటమి ఖాయమని తెలిసిపోయింది. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం చంద్రబాబుకి అలవాటు. చంద్రబాబు శిఖండి లాంటి వ్యక్తి. టీవీ 5, ఈనాడు, ఏబీఎన్ చంద్రబాబు ఫొటో లేకుండా ఆయన కోసం పనిచేస్తున్నాయి. నారా భువనేశ్వరి, పురంధేశ్వరి ఇద్దరూ వెన్నుపోటు సిస్టర్స్. వైఎస్సార్సీపీ నేతలు ఎప్పుడైనా టీడీపీ నాయకుల కుటుంబ సభ్యులను విమర్శించారా?. అనవసరంగా సీఎం జగన్ కుటుంబ సభ్యులను విమర్శిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అస్సలు ఊరుకోము’ అంటూ హెచ్చరించారు. -
పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ పై మంత్రి అవంతి సీరియస్
-
‘ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరడం లేదు’
సాక్షి, విజయనగరం : టీడీపీ ఎంపీలపై ఉన్నది కేవలం ఆరోపణలు మాత్రమే.. అవి నిజం కావాలని లేదు కదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2014 ముందు వరకూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉండేది.. కానీ ఇప్పుడు 12 కోట్ల సభ్యత్వాలతో బీజేపీ అతి పెద్ద రాజకీయ పార్టీగా మారిందన్నారు. ఆగస్టు 11 వరకూ బీజేపీ సభ్యత్వ నమోదు జరుగుతుందని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మళ్లీ ఎన్డీఏకు పట్టం కట్టేలా చేశాయన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వం నచ్చి, మెచ్చి, ఢిల్లీ నుంచి గల్లీ వరకూ చేరికలు జరుగుతున్నాయన్నారు. ఆర్థిక సంస్థల దాడులను ప్రశ్నించడం దౌర్భాగ్యం అన్నారు కన్నా. బీజేపీని అనడం సరి కాదు : పురంధరేశ్వరి కర్ణాకటలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి బీజేపీని బాధ్యులని చేయడం సరికాదన్నారు కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి. కాంగ్రెస్ నన్ను క్లర్క్ కన్నా హీనంగా చూస్తుందని అనేక సందర్భాల్లో కుమార్ స్వామి స్వయంగా ఆవేదన వ్యక్తం చేయడం నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత సంక్షోభానికి కాంగ్రెస్-జేడీఎస్ అంతర్గత విబేధాలే కారణం అన్నారు. -
‘ప్రత్యేకహోదా విషయంలో సీఎం విచిత్ర వైఖరి’
అనంతపురం సెంట్రల్ : ప్రత్యేకహోదా విషయంలో సీఎం చంద్రబాబునాయుడు విచిత్రంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి విమర్శించారు. గుత్తిరోడ్డులోని కేటీఆర్ కన్వెషన్హాలులో గురువారం కేంద్ర ప్రభుత్వ పథకాలు– వాటి అమలు అనే అంశంపై బీజేపీ కార్యకర్తలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం చంద్రబాబునాయుడు ఓ సమావేశంలో 2017 తర్వాత దేశంలో ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాలను తొలగిస్తారని చెప్పారని, రాష్ట్రం విషయానికొస్తే ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారన్నారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్నో పథకాలు పేదలకోసం తెచ్చిందన్నారు. కేవలం రూ. 121తో ప్రధానమంత్రి సురక్ష బీమా యోచన పథకం తెచ్చిన ఘనత బీజేపీదే అన్నారు. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం ద్వారా సాగునీరు అభివృద్ధి కోసం 2015–16లో రూ. 800 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకం కింద వచ్చిన నిధుల్ని ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి వినియోగిస్తోందని వివరించారు. జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ద్వారా రాష్ట్రానికి రూ.6,500 కోట్లు నిధులను మంజూరు చేస్తోందని తెలిపారు. ఇందులో అమరావతిలో ఔటర్‌రింగ్ రోడ్లను నిర్మిస్తోందని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అంకాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్దన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, సుదర్శన్, పురందర్, అధికార ప్రతినిధి మల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.