నగరంలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ : పురానీ హవేలీ విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా పలు బస్తీలలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని చార్మినార్ సీబీడీ ఏడీఈ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పురానీ హవేలీ, చెత్తబజార్, జహెరా నగర్, మీరాల మండి, పత్తర్‌గట్టీ, మదీనా, దివాన్ దేవుడి, పటేల్ మార్కెట్, రికాబ్‌గంజ్, నయాపూల్, బహదూర్‌పురా, కిషన్ బాగ్, షరీఫ్ నగర్, ఎంవో కాలనీ, అత్తాపూర్, గోల్కొండ ఫంక్షన్ హాల్, వీకర్ సెక్షన్‌కాలనీ, వాసుదేవరెడ్డి నగర్, హైదర్‌గూడ, తేజస్వినీ నగర్ కాలనీ, భరత్ నగర్, లాల్‌దర్వాజా మోడ్, శాలిబండ, నాగుల చింత, రాజీవ్‌నగర్, జమాల్ కాలనీ, హఫీజ్‌బాబా నగర్, చాంద్రాయణగుట్ట, ఉమర్ కాలనీ, రక్షాపురం, అరుంధతి నగర్, జహనుమా, నవాబ్ సాహెబ్ కుంట, బిర్యానీ షా టేకరీ, సాలేహీన్ కాలనీ, తీగల కుంట, ముస్తఫానగర్, ఎంసీహెచ్ కాలనీ, అచ్ఛిరెడ్డినగర్ తదితర బస్తీలలో ఈ అంతరాయం కొనసాగుతుందన్నారు.
అదేవిధంగా జనప్రియ అపార్ట్మెంట్స్, లక్ష్మీనగర్, కేశవ నగర్, అత్తాపూర్, హైదర్‌గూడ, ఏజీ కాలనీ, షా గంజ్, మూసాబౌలి, తగారీ కా నాక, చౌక్, బండికా అడ్డా, చేలాపురా తదితర బస్తీలలో మంగళవారం మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు.