purnea
-
నా పర్యటనతో లాలూ, నితీశ్‌కు కడుపులో నొప్పి.. అమిత్ షా విమర్శలు
పాట్నా: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024లో ప్రధాని కావాలనే లక్ష్యంతో ఆయన బీజేపీకి వెన్నుపోటు పొడిచి లాలూ ప్రసాద్ యాదవ్ ఒళ్లో కూర్చున్నారని ధ్వజమెత్తారు. నితీశ్ తెగదెంపులు చేసుకోవడంతో బిహార్‌లో ఎన్డీఏ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రానికి తొలిసారి వచ్చారు అమిత్ షా. రెండు రోజుల పర్యటనలో భాగంగా సరిహద్దు జిల్లా పూర్ణియాలో ర్యాలీలో ప్రసంగించారు. నితీశ్‌పై విమర్శలు గుప్పించారు. 'నేను ఈవాళ సరిహద్దు జిల్లాల్లో పర్యటించడం చూసి లాలూ ప్రసాద్ యాదవ్, సీఎం నితీశ్ కుమార్‌లకు కడుపునొప్పి వస్తోంది. వాళ్లు అశాంతి కోరుకుంటున్నారు. నేను ఇక్కుడకు వస్తే అశాంతి నెలకొంటుందని ఆరోపిస్తున్నారు. నితీశ్ కుమార్ లాలూ ఒళ్లో కూర్చుకున్నారు. ప్రజలేం ఆందోళన చెందవద్దు. సరిహద్దు జిల్లాలు భారత్‌లో భాగమే. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మనకు ఎలాంటి భయం అక్కర్లేదు. ఏదో ఒకరోజు ప్రధాని కావాలనే ఆశతో నితీశ్ లాలూ చెంతకు చేరారు. వాళ్లు బిహార్ ప్రజల తీర్పుకు విరుద్ధంగా ద్రోహం చేశారు. సీమాంతర ప్రజలు నితీశ్‌కు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. కూటములు మార్చి నితీశ్ ప్రధాని కాగలరా?' అని అమిత్ షా ప్రశ్నించారు. నితీశ్‌కు సీఎం పదవి ఇస్తామని ప్రధాని మోదీ మాటిచ్చినందు వల్లే బీజీపే అందుకు కట్టుబడి ఉండి ఆయనకు బాధ్యతలు అప్పగించిందని అమిత్ షా చెప్పారు. కానీ నితీశ్ మాత్రం ద్రోహం చేసి ప్లేటు పిరాయించారని దుయ్యబట్టారు. ర్యాలీ అనంతరం కిషన్‌గంజ్‌కు వెళ్తారు అమిత్ షా. రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, పార్టీ కార్యాలయాల బాధ్యులతో సమావేశమై రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తారు. చదవండి: అధ్యక్ష పదవికి సోనియా ఫ్యామిలీ దూరం! -
నామినేషన్ వేయబోతే జైలుకు పంపారు!
పుర్ణియా: మద్యం సేవించి నామినేషన్ వేసేందుకు వచ్చిన ఓ అభ్యర్థిని పోలీసులు కటకటాలవెనక్కు నెట్టిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లోని పుర్ణియా స్థానం నుంచి రాజీవ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. పూటుగా మద్యం సేవించి మంగళవారం నామినేషన్ వేసేందుకు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే బిహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో రాజీవ్ ప్రవర్తనపై అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా, ఆయన పూటుగా మద్యం సేవించినట్లు తేలింది. దీంతో మద్య నిషేధ చట్టం కింద కేసు నమోదుచేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. బిహార్‌లో ఏప్రిల్ 18న పోలింగ్ జరగనుంది. కాగా, పుర్ణియా లోక్‌సభ స్థానానికి 17 మంది నామినేషన్లు వేశారు. వీరిలో 11 మంది చివరిరోజున నామినేషన్ వేయడం గమనార్హం. -
'పాకిస్తాన్' ప్రజలందరూ మోడీ వైపే
పాకిస్తాన్ ప్రజలు ముక్తకంఠంతో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలంటున్నారు. తమ ఓటు నరేంద్ర మోడీకేనని వారు ఢంకాబజాయించి మరీ చెబుతున్నారు. 'పాకిస్తాన్ ఓటర్లు నరేంద్ర మోడీని ఓటేయడమేమిటి.. ఇదంతా పచ్చి అబద్ధం' అనుకోకండి. నిజం! పాకిస్తాన్ లోని 250 మంది ప్రజలు, వంద మంది ఓటర్లు తాము మోడీకే ఓటేస్తామంటున్నారు. అవును... బీహార్ లోని పూర్ణియా జిల్లాలో పాకిస్తాన్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో వంద ఓట్లున్నాయి. ఈ వందమందీ తాము మోడీకే ఓటేస్తామని చెబుతున్నారు. తమాషా ఏమిటంటే పూర్ణియాలో ఒక్క ముస్లిం ఓటరు కూడా లేడు. అందరూ ఆదివాసులే. దేశ విభజన సమయంలో ఈ ఊళ్లోని ముస్లింలందరూ తూర్పు పాకిస్తాన్ కి వెళ్లిపోయారు. వెళ్లినవారికి గుర్తుగా మిగిలిన ప్రజలు తమ ఊరికి పాకిస్తాన్ అని పేరు పెట్టుకున్నారు. అంతే అప్పట్నుంచీ ఈ ఊరు పాకిస్తాన్ అయిపోయింది. పాకిస్తాన్ లో చదువుకున్న వారు లేరు. అందరూ నిరుపేదలే. రెండేళ్ల క్రితం మాత్రం ఊరి ప్రజలంతా కలిసి ఊరి పేరు మార్చేయాలనుకున్నారు. కానీ అంతలోనే ఊరుకుండిపోయారు. దీంతో పాకిస్తాన్ పేరు పాకిస్తాన్ గానే ఉండిపోయింది. ఇప్పుడీ పాకిస్తానీయులే మోడీకి మద్దతిస్తున్నారు.