pushkar ghatana
-
ఆధారాల సేకరణ పూర్తి
‘పుష్కర తొక్కిసలాట’ విచారణపై ఏకసభ్య కమిష¯ŒS ప్రకటన ఆధారాలు, సమాచారం రాతరూపంలో ఇవ్వాలని సూచన సమ్మతించిన అఫిడవిట్‌దారులు, ప్రభుత్వ న్యాయవాది విచారణ వాయిదా.. నేటితో ముగియనున్న గడువు సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై జరుగుతున్న విచారణలో ఆధారాల సేకరణ పూర్తయిందని ఏకసభ్య కమిష¯ŒS ప్రకటించింది. జస్టిస్ సీవై సోమయాజులు ఏకసభ్య కమిష¯ŒS రాజమహేంద్రవరంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో శనివారం మరోసారి విచారణ చేపట్టింది. అఫిడవిట్ దాఖలు చేసిన న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు కమిష¯ŒS ద్వారా అడిగిన మేరకు.. ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉన్న సమాచారాన్ని న్యాయవాది చింతపెంట ప్రభాకరరావు సమర్పించారు. ఆ సమాచారం అసంపూర్తిగా ఉండడంపై కొద్దిసేపు చర్చ జరిగింది. ప్రారంభం నుంచీ ఆధారాలు, సమాచార సేకరణకే సమయం సరిపోయిందని కమిష¯ŒS వ్యాఖ్యానించింది. ముప్పాళ్ల సుబ్బారావు ఇప్పటికీ సమాచారం కోరడంపై చింతపెంట ప్రభాకరరావు అసహనం వ్యక్తం చేశారు. విచారణ జరుగుతున్నట్లుగా లేదని ప్రైవేటు వ్యక్తులు ఈ ఘటనపై పరిశోధన చేస్తున్నట్లుగా ఉందని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాధికారులు తమవద్ద ఉన్న సమాచారాన్ని నిజాయతీగా కమిష¯ŒSకు సమర్పించి ఉంటే ప్రారంభంలోనే ఈ విచారణ పూర్తయ్యేదని ముప్పాళ్ల అన్నారు. తద్వారా అందరికీ సమయం, ప్రభుత్వానికి ధనం ఆదా అయ్యేదన్నారు. ఇప్పటికీ సీసీ కెమెరాల ఫుటేజీ, ఘటన జరిగిన రోజు పుష్కర ఘాట్ వద్ద పరిస్థితిపై ఎలాంటి సమాచారమూ లేదని గుర్తు చేశారు. సమాచార శాఖ ఇచ్చిన వీడియోను సెకను, రెండు సెకన్ల నిడివితో ముక్కలుముక్కలుగా ఇచ్చారని పేర్కొన్నారు. సమాచార శాఖ చిత్రీకరించిన వీడియో తెప్పించాలని కమిష¯ŒSను కోరారు. సీఎం చంద్రబాబు పుష్కర ఘాట్‌లో గంటన్నరపాటు ఉన్నారంటూ ప్రభుత్వమే తెలిపిందని, ఆ సమయంలో ఆయన పక్కన దర్శకుడు బోయపాటి శ్రీను ఎందుకున్నారో చెప్పలేదని అన్నారు. ఆయన చేతిలో మైక్ కూడా ఉందని, షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కోసమే భక్తులను ఆపడంతో తొక్కిసలాట జరిగిందని ముప్పాళ్ళ ఆరోపించారు. ‘ప్రజలకు సూచనలు ఇచ్చేందుకు ఆయనకు మైక్ ఇచ్చి ఉండొచ్చు కదా!’ అని కమిష¯ŒS వ్యాఖ్యానించింది. జెడ్+ భద్రత ఉన్న సీఎం వద్ద ఓ ప్రైవేటు వ్యక్తి ఎందుకుంటాడని, ప్రజలకు సూచనలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాధికారులదని సుబ్బారావు అన్నారు. ఆ రోజు ఉదయం గోదావరి స్టేష¯ŒSకు ఏడు రైళ్లు వస్తాయని తెలిసినా, భక్తులను ఇతర ఘాట్లకు ఉద్దేశపూర్వకంగానే మళ్లించలేదని కమిష¯ŒS దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఏర్పాట్లు, ఇతర వివరాలు ఇవ్వాలని తాము సమాచార హక్కు చట్టం ద్వారా కోరినా కలెక్టర్ కార్యాలయం ఇవ్వలేదని పేర్కొన్నారు. ‘ఉన్న ఆధారాలన్నీ సమర్పించినట్టేనా?’ అని ప్రభుత్వ న్యాయవాదిని, అఫిడవిట్దారులను కమిష¯ŒS ప్రశ్నించింది. అనంతరం ఈ ఘటనలో ఆధారాల సేకరణ ముగిసిందని ప్రకటించింది. ఇరుపక్షాల వద్ద ఉన్న ఆధారాలు, సమాచారం రాతపూర్వకంగా తమకు అందజేయాలని కోరింది. ఇందుకు ఇరుపక్షాలూ అంగీకరించడంతో విచారణను వాయిదా వేసింది. కమిష¯ŒSకు పెంచిన గడువు ఆదివారంతో ముగియనుంది. తదుపరి విచారణలో ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలను మాత్రమే కమిష¯ŒS ఆలకించనుంది. కమిష¯ŒSకు సహాయకారిగా ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు వ్యవహరించారు. విచారణకు న్యాయవాది కూనపరెడ్డి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రూరల్ తహసీల్దార్ జి.భీమారావు, స్పెషల్‌బ్రాంచి డీఎస్పీ రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. -
పుష్కర విచారణ ముగిసేదెప్పుడు ?
రేపటితో ముగియనున్న గడువు నేడు మరోసారి విచారణ ఇప్పటికి మూడుసార్లు గడువు పెంపు ఆధారాలు సమర్పించని ప్రభుత్వ శాఖలు సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి మహా పుష్కరాల తొలి రోజున జరిగిన తొక్కిసలాటపై విచారణ కొనసా.....గుతూనే ఉంది. ఏకసభ్య కమిష¯ŒSకు ప్రభుత్వ శాఖలు ఏడాదిన్నరగా ఆధారాలు సమర్పిస్తూనే... ఉన్నాయి. ఇప్పటికి కూడా కొన్ని ప్రభుత్వ శాఖలు ఇంకా ఆధారాలు సమర్పించాల్సి ఉంది. దీనిపై కమిష¯ŒS ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వ శాఖల స్పందన అంతంత మాత్రంగానే ఉంది. 2015 జూలై 14న గోదావరి మహా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరిగి పుణ్య స్నానాలకు వచ్చిన 29 మంది దుర్మరణంపాలయ్యారు. మరో 51 మంది గాయపడ్డారు. గాయపడిన వారిపై కూడా పోలీసు, రెవెన్యూ శాఖల లెక్కలు భిన్నంగా ఉన్నాయి. వీవీఐపీలు పుష్కరఘాట్లకు రావడం, గంటల కొద్దీ ప్రజలను బారికేడ్ల ద్వారా నిలువరించి ఒక్కసారిగా వదలడంతో తోపులాట జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అనంతరం ప్రభుత్వం ఘటనపై సమగ్ర విచారణ కోసమంటూ జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలో ఏకసభ్య కమిష¯ŒS వేసింది.ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని గడువు విధించింది. అయితే సీఎం చంద్రబాబు కుటుంబం పుష్కర ఘాట్‌లో స్నానమాచరించడం, డాక్యుమెంటరీ కోసం ప్రజలను నిలిపివేయడం వల్లనే ప్రమాదం జరిగిందని రాజకీయ పార్టీల నేతలు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు బలంగా ఆరోపించాయి. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా కమిష¯ŒSకు సమర్పించాయి. విచారణ పూర్తయితే సీఎం చంద్రబాబు, సాధారణ భక్తులు స్నానం చేసే పుష్కర ఘాట్‌లోకి వీవీఐపీలను అనుమతించిన అధికారులు దోషులుగా తేలే అవకాశం ఉందని ప్రభుత్వ శాఖలు విచారణ సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. తమ వద్ద ఉన్న ఆధారాలను ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయి. కమిష¯ŒS అడిగినా కూడా అరకొరగా ఇస్తూ కాలం వెళ్లదీస్తున్నాయి. దీనిపై కమిష¯ŒS కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా ప్రభుత్వ శాఖలకు చీమ కుట్టినట్లుగా లేదు. జియోగ్రాఫికల్ చానెల్ చిత్రీకరించిన డాక్యుమెంటరీని కూడా ఎడిట్ చేసి ఇచ్చారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేసిన వారు పేర్కొంటున్నారు. మూడోసారి కూడా రిక్త హస్తమేనా? ప్రభుత్వ శాఖలు ఆధారాలు సమర్పించకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన ఆరు నెలల గడువులోపు ఏకసభ్య కమిష¯ŒS విచారణ పూర్తి చేయలేకపోయింది. దీంతో కలెక్టర్ వినతి మేరకు ప్రభుత్వం ఇప్పటి వరకు మూడుసార్లు గడువు పొడిగించింది. కమిష¯ŒSకు ఇచ్చిన గడువు ఆరు నెలలు గత ఏడాది మార్చి 29తో ముగియగా జూ¯ŒS 29 వరకు మరో మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు నెల తరువాత జారీ చేసింది. ఆ సమయంలో కూడా విచారణ పూర్తి కాకపోవడంతో రెండోసారి సెప్టెంబర్ 29 వరకు మరో మూడు నెలలు గడువు ఇస్తూ రెండో దఫా గడువు పెంచారు. ఈసారి కూడా దాదాపు 24 రోజుల అనంతరం పెంచిన గడువుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు కూడా ప్రభుత్వ శాఖలు సహకరించకపోవడంతో విచారణ పూర్తి కాలేదు. దీంతో మూడోదఫా ఈ ఏడాది జనవరి 29 వరకు నాలుగు నెలలపాటు గడువు పెంచుతూ నెల తరువాత ప్రభుత్వం జారీ చేసింది.మూడుసార్లు గడువు పెంచిన ప్రభుత్వం వాటికి సంబంధించిన జీవోలు మాత్రం ప్రతిసారీ దాదాపు నెల రోజుల తరువాత జారీ చేయడం విచారణను సాగ దీయడమేనని అఫిడవిట్ దాఖలు చేసిన వారు ఆరోపిస్తున్నారు. పెంచిన గడువు 29తో ముగుస్తోంది. శనివారం మరోసారి కమిష¯ŒS విచారణ చేపడుతోంది. ఈ సారైనా విచారణ ఎంత వరకు వచ్చిందన్న దానిపై కమిష¯ŒS ఒక స్పష్టత ఇస్తుందని అఫిడవిట్ దాఖలు చేసిన వారు ఆశిస్తున్నారు. ఆధారాలు సమర్పించడంలో అధికారుల నిర్లక్ష్యం... విచారణ ప్రారంభమై ఏడాదిన్నర గడుస్తోంది. ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అధికారులు వాస్తవాలను కమిష¯ŒS ముందు పెట్టకపోవడంతోనే ఈ జాప్యం జరుగుతోంది. కమిష¯ŒS అడిగినా సరైన స్పందన లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకు ఉదాహరణ నేషనల్ జియోగ్రఫీ చానల్ ఫుటేజీని ఎడిట్చేసి ఇవ్వడమే. విచారణ పూర్తికి అవసరమైన సమాచారం కాకుండా అనవసరమైన వివరాలు కమిష¯ŒSకు ఇస్తున్నారు. పోలీసు విచారణ కూడా ఇప్పటి వరకూ పూర్తి కాలేదంటున్నారు. – ముప్పాళ్ల సుబ్బారావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, రాజమహేంద్రవరం. ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారు ఏడాదిన్నరవుతున్నా ఇప్పటికీ విచారణ పూర్తి కాలేదు. చంద్రబాబు దోషిగా తేలుతాడన్న భయంతోనే విచారణను నాన్చుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ శాఖలను తన ఇష్టానుసారం ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ శాఖలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. అధికారులు స్వేచ్ఛగా తమ పని చేయలేకపోతున్నారు. అందుకు నిదర్శనమే ఇప్పటి వరకు ఆధారాలు సమర్పించకపోవడం. విచారణ పొడిగిస్తూ ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారు. – జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు. చంద్రబాబే బాధ్యుడు కాబట్టి... పుష్కరాలు తానే నిర్వహించానని సీఎం చంద్రబాబు పదే పదే చెప్పారు. ఇదే విషయం కమిష¯ŒS ముందు ఆధారాలతో నేను సమర్పించాను. అధికారులు నిజాలు చెప్పాలి. కమిష¯ŒS వాటినే ప్రభుత్వానికి సమర్పిస్తుంది. కానీ అధికారులు నిజాలు చెప్పేందుకు ముందుకు రావడంలేదు. డాక్యుమెంటరీ చిత్రీకరణ వల్లే తొక్కిసలాట జరిగింది. ఈ అఘాయిత్యానికి కారణం చంద్రబాబే. ఇది అందరికీ తెలుసు. ఈ ఘటనలో చంద్రబాబే ముద్దాయి అవుతాడు. పొరపాటు జరిగిందని చంద్రబాబు ఒప్పుకుంటే సరిపోతుంది. కానీ మానవ ప్రమేయం లేదని వాదిస్తాడు. విచారణ కోసం మళ్లీ గడువు ఇస్తారు. చివరికి అధికారులు సహకరించడం లేదని కమిష¯ŒS ప్రభుత్వానికి చెప్పే అవకాశం ఉంది. – ఉండవల్లి అరుణ్‌కుమార్, పార్లమెంట్ మాజీ సభ్యుడు -
పుష్కర మహా విషాదం.. అందువల్లనే..
పుష్కర ఘాట్ వద్ద ఆర్అండ్బీ ఏర్పాటు చేసిన బారికేడ్ల తొలగింపు సీఎం కాన్వాయ్ కోసమే ఈ నిర్వాకం ఫలితంగానే తొక్కిసలాట మరణాలు ఘటన జరిగిన గంట వరకూ అందని వైద్యం స.హ. చట్టం ద్వారా వెల్లడైన నిజాలు సాక్షి, రాజమహేంద్రవరం : అధికారులే స్వయంగా నిబంధనలను తుంగలో తొక్కడం.. పెద్ద సంఖ్యలో వస్తున్న యాత్రికులను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలం కావడమే గోదావరి పుష్కర మహావిషాదానికి కారణమని మరోసారి వెల్లడైంది. పావన వాహిని పుష్కర పర్వం సందర్భంగా గత ఏడాది జూలై 14న రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగి, 29 మంది అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రముఖ న్యాయవాది, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు సేకరించిన సమాచారం.. పుష్కర ఏర్పాట్లలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని మరోమారు ఎత్తిచూపింది. పుష్కర ఘాట్ వద్ద నలువైపుల నుంచీ ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు రోడ్లు, భవనాల శాఖ తెలిపింది. ఇసుక ర్యాంపు నుంచి మూడో గేటు వరకూ 5 వరుసలు.. జెండా పంజా రోడ్డు నుంచి ఒకటో గేటుకు 4 వరుసలు.. గోదావరి రైల్వే స్టేషన్ నుంచి హేవలాక్ వంతెన వరకూ 4 వరుసలు.. గోకవరం బస్టాండ్ నుంచి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా ఘాట్‌లోకి 3 వరుసల్లో బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ పేర్కొంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్, ఇతర వీఐపీల వాహనాలను ఘాట్ వద్దకు అనుమతించేందుకుగానూ అధికారులు వాటిని తొలగించారు. అంతేకాకుండా నిబంధలకు విరుద్ధంగా సీఎం కాన్వాయ్‌ను ఘాట్ వద్దకు అనుమతించారు. పుష్కర ఘాట్ ఎదుట వీఐపీ వాహనాలు నిలపడానికి అనుమతించడంతో ఆ ప్రాంతం ఇరుకుగా తయారైంది. సీఎం పుష్కరస్నానం చేసే వరకూ అన్ని గేట్లూ మూసివేశారు. ఘాట్ బయట తోపులాట జరుగుతున్నా పోలీసులు అదుపు చేయకుండా సీఎం, ఇతర వీఐసీల సేవల్లో ఉన్నారు. ఏదైనా ఆపద తలెత్తినప్పుడు వెళ్లేందుకు అత్యవసర మార్గం ఏర్పాటు చేసినట్లు మ్యాపులో చూపించినా క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఘటన జరిగిన గంట తర్వాత.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రాత్రికే పుష్కరఘాట్ వద్దకు చేరుకున్నారు. వారిలో ఉపవాసం ఉన్నవారు కూడా ఉన్నారు. మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేసినా అవి భక్తులకు అందుబాటులో లేకుండా పోయాయి. నీర సించిపోయిన భక్తులకు తొక్కిసలాట జరగడంతో శ్వాస తీసుకోవడం కష్టమైంది. వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసినా సకాలంలో వైద్యం అందించలేకపోయారు. క్షతగాత్రులకు ఆక్సిజన్ అందించడానికి కూడా ఏర్పాట్లు చేయలేదు. సాధారణ మందులు మాత్రమే అందుబాటులో ఉంచారు. తొక్కిసలాట ఉదయం 8.30 గంటలకు జరిగితే మొదటి క్షతగాత్రుడిని 9.40 గంటలకు ఆస్పతికి తీసుకెళ్లినట్లు వైద్య శాఖ తెలిపింది. మధ్యాహ్నం 12:10 గంటల వరకూ క్షతగాత్రులను తరలిస్తూనే ఉన్నారు. అంబులెన్స్‌లు ఘాట్ వద్దకు రావడానికి, తిరిగి వెళ్లడానికి అధిక సమయం పట్టింది. ఇక్కడే ఏర్పాట్లలో లోపాలు ప్రస్ఫుటమవుతున్నాయి. తొక్కిసలాట జరిగిన వెంటనే బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సరైన ఏర్పాట్లు చేయలేదని ఈ వివరాల ఆధారంగా స్పష్టమవుతోంది. నిబంధనలకు విరుద్ధం ఏదైనా ఓ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరైనప్పుడు నిబంధనల ప్రకారం వాహనాలను అనుమతించరాదు. కానీ పుష్కర ఘాట్ వరకూ సీఎం చంద్రబాబు, ఇతర వీఐపీల వాహనాలను అనుమతించారు. ఇందుకోసం రోడ్లు, భవనాల శాఖ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు. ఎవరి ఆదేశాలతో వీటిని తొలగించారో కమిషన్ విచారించాలి. ఘాట్ ఇన్చార్జికి ఈ సమాచారం ఉందో లేదో తేలాల్సి ఉంది. ఘాట్‌లో సీఎం చంద్రబాబు ఎంతసేపు ఉన్నారు? వీఐపీ ఘాట్‌కు వెళ్లాల్సిన సీఎం సామాన్య భక్తులు వచ్చే పుష్కర ఘాట్‌కు రావడానికి ఏ అధికారి అనుమతిచ్చారు? తదితర అంశాలన్నింటినీ కమిషన్ విచారించాలి. – ముప్పాళ్ల సుబ్బారావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు