pushkara godavari
-
తల్లి గోదావరి సేద తీరింది!
అక్షర తూణీరం కోట్లాది మంది పుష్కరస్నానాలు ఆచరించారు. తెలుగు ప్రభు త్వాల ప్రచారం ఫలించింది. కోట్లకు కోట్లుగా తీర్థస్నానానికి తరలివచ్చారు. పెద్దలను భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు. ఇదం తా భక్తేనా? కాదన్నారు ఒక మేధావులు. మేధావి అంటే చాలు కదా అనుకోవచ్చు. కాని మేధావి నిత్య బహువచనం. ‘‘ప్రస్తు తం జనంలో ఒక అలజడి, అస్థిరత్వం ఆవరించి ఉన్నాయి. అం దుకని ప్రజలు ఏమాత్రం అవకాశం దొరికినా పక్కకి పారిపోవా లని చూస్తున్నారు. దాని పర్యవసానమే ఇది’’ అంటూ విశ్లేషిస్తు న్నారు. మరికొందరు, ‘‘ఏం లేదండీ! ఇదొక మాస్ హిస్టీరియా’’ అని కొట్టి పారేస్తున్నారు. ఏదైనా రెండువారాల పాటు జనాన్ని వేరే ప్రపంచంలో ఓలలాడించిన మాట వాస్తవం. మా నేత పిలుపుతో జనం తరలి వచ్చారంటున్నారు. మహానేత పిలుపుని అందుకుని మహాజనం మహోత్సవంగా తరలి వచ్చారని సంబరపడుతున్నారు. ఇది పరోక్షంగా తెలుగుదేశం సుభిక్ష పాలనని సమర్థించడమే, ఇది చంద్రబాబు విజయం అంటూ కొందరు కీర్తిస్తున్నారు. నాటకం అయీ కాకుండానే తెరలూ, పూసల కోట్లూ, గదలూ, గెడ్డాలూ మీసాలూ, జుల పాల జుట్లూ మూటలు కట్టే సినట్టు - మీడియా పుష్క రాల సరంజామాని సర్దేసిం ది. పుష్కర పరిభాషని మార్చేసుకుని, సాధారణ జనజీవన స్రవంతిలోకి వచ్చేసింది. ఈ మహా తరు ణాన్ని మార్కెట్ చేసుకున్న వారంతా తమ తమ కలెక్ష న్లను లెక్క చూసు కుంటు న్నారు. రాబోయే కృష్ణా పుష్కరాలకు ఈ అనుభవాన్ని జోడిస్తూ కొత్త ఆలోచనలు చేస్తున్నా రు. ‘‘మూఢ నమ్మకాలను జనంపై రుద్ది నిజాల్ని మభ్యపెడుతున్నారు. ఇది పాలకుల దివాలాకోరుతనానికి సాక్ష్యం. ప్రభుత్వం మూడువేల కోట్లు వృథాచేసింది. కనీసం పది వేల కోట్ల ప్రజాధనం గోదావరి పాలైంది. ఈ డబ్బూ, ఈ పనిగంటలూ వెచ్చిస్తే ఒక ఉప యుక్తమైన జలాశయం పూర్తయ్యేది’’ అంటున్నారు గతితార్కికులు. ప్రతి సందర్భానికీ వారొక స్టేట్మెంట్ ఇస్తారు. ఒక ప్రతిపాదన చేస్తారు. ఎవ్వరూ వాళ్లని పట్టించుకోరు. అయినా వాళ్లు ఖాతరు చెయ్యరు. వారి సదాచారాన్ని వారు పాటిస్తూనే ఉంటారు. గురుడు సింహరాశిలోకి వస్తున్నాడు. ఊరికే మనుషులతో మాటా మాటా పెరిగే అవకాశాలెక్కువ, జాగ్రత్త! అంటూ మన్మథ ఉగాది రోజున సిద్ధాంతిగారు హెచ్చరించారు. అందుకే నా జాగ్రత్తలో నేనుంటున్నాను. అయితే, రుషితుల్యులైన మన ప్రవచనకారులు నాలాగా మెలకువగా ఉన్నట్టు లేరు. మొన్న పన్నెండు రోజులూ పూనకాలు వచ్చినట్టు దుయ్యబట్టుకున్నారు. దూసి పోసుకున్నారు. మీడియా రేటింగులు పెంచారు. ఇప్పటికే ఇన్ని మతాలు, ఇన్ని శాఖలు, ముప్పదిమూడు కోట్ల దేవుళ్లతో సామాన్యులు సతమత మవుతున్నారు. అసలే అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న మూఢమతులకు దారి చూపాల్సిన వారే పరస్పరం ‘‘మట్టి’’ జల్లు కుంటుంటే ఇక దిక్కెవరు? పుష్కరాల ఆఖరిరోజు గోదావరి తీర దేవుళ్లంతా ఒకచోట చేరారు. ఈ పర్వంలో వారి వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మహర్దశ పట్టిన దేవుళ్లను మిగతా వారు అభినందించారు. పుష్కరాలకు వలస వచ్చిన వెంకటేశ్వరస్వామి కూడా అక్కడకు వచ్చి చేరారు. ‘‘తీర్థప్రజ వచ్చి, గంటల తరబడి వేచి, మా దర్శనం చేసుకువెళుతుంటే ఓ గొప్ప అనుభూతి కలిగింది. శ్రీనివాసా! నీ వైభవం, నీ భోగం ఏ స్థాయిదో మాకు బోధ పడింది!’’ అంటూ సాటి దేవుళ్లు వేనోళ్ల పొగిడారు. దేనికైనా పెట్టిపుట్టి ఉండాలని అభిప్రా యపడ్డారు. ఇంతలో ముత్తైవులా గోదావరి మాత అక్కడకు వచ్చింది. అంతా సవిన యంగా నమస్కరించి స్వాగతం పలికారు. ‘‘అలసిపోయావా?’’ అని అడిగారు. ‘‘లేదు, నా బిడ్డల స్పర్శతో సేద తీరాను!’’ అన్నది మాత గోదావరి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు). -
చేష్టలుడిగి... చేతులెత్తేశారు!
తాగునీటి సౌకర్యం కూడా లేదు ట్రాఫిక్ నిర్వహణ అధ్వానం ప్రభుత్వ తీరుపై మండిపడ్డ భక్తజనం రాజమండ్రి: ‘వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం.. పుష్కరాలను మహా కుంభమేళా తరహాలో నిర్వహిస్తున్నాం. భక్తుల సేవలకే తొలి ప్రాధాన్యం.. వారి రక్షణకు అన్ని చర్యలు చేపడుతున్నాం’ గడిచిన రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొట్టిన ప్రచారమిది. ఇంతా చేస్తే పుష్కర ఆరంభం రోజే ప్రభుత్వం.. అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. కళ్లముందు విషాద ఘటన జరిగితే ఏం జరిగిందో కూడా తెలియని.. ఎలా స్పందించాలో కూడా అర్థంకాని, చేతకాని పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోయింది. పుష్కరఘాట్ ప్రమాద నివారణలోనే కాదు.. భక్తులు ఘాట్ల వద్దకు చేరుకునే ఏర్పాట్లు చేయడంలో, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తీసుకున్న చర్యల్లో, భక్తులకు తాగునీరు, వైద్యసేవలు, మరుగుదొడ్ల నిర్వహణ... ఇలా ప్రతీ విషయంలోనూ ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. ప్రణాళికా రాహిత్యం, శ్రద్ధ శూన్యం....: గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం నాలుగు నెలులుగా సన్నాహాలు చేస్తోంది. పుష్కర నిర్వహణకు రూ.వందల కోట్లు కేటాయించింది. అయితే పనులు ఆలస్యంగా ఆరంభించడం, సకాలంలో పూర్తి చేయకపోవడం వంటి చర్యలతో ప్రభుత్వం పుష్కరాలను ఆది నుంచి వివాదాస్పదం చేసింది. భక్తుల భద్రతా చర్యల విషయంలోనూ పూర్తిగా విఫలమైంది. రాజమండ్రి నగరంపై దృష్టి పెట్టినా.. ఇక్కడే ఆశించిన స్థాయిలో పనులు పూర్తి చేయలేదు. పుష్కరాలు ఆరంభమైన మంగళవారమూ రోడ్ల నిర్మాణ పనులు చేస్తుండడం, పార్కింగ్ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేస్తుండడం గమనార్హం. చివరకు తాగునీరు అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైంది.దీనితో భక్తులు దాహంతో అలమటించి పోయారు. గుక్కెడు నీటి కోసం పాన్‌షాపుల వద్ద మంచినీటి వాటర్ బాటిళ్ల వద్ద క్యూకట్టారు. పుష్కర స్నానం కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి రావడం, దీనికితోడు సూర్యభగవానుడి ప్రతాపం తోడుకావడంతో భక్తులు చుక్కనీటి కోసం ఆర్రులు చాచారు. మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానం...: రాజమండ్రి నగరంలో పుష్కర యాత్రికుల కోసం 1,155 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. వీటిని చివరి రెండు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటికి అవసరమైన నీరు సరఫరా చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇవి అధ్వానంగా మారి భక్తులు వినియోగించేందుకు పనికిరాకుండా పోయాయి. చాలామంది పుష్కర భక్తులు పుష్కరఘాట్, కోటిలింగాల ఘాట్‌కు వెళ్లే వీధుల్లో బహిరంగ మల విసర్జన చేస్తున్నారు. -
నా పెనిమిటి చనిపోయాడంటయ్యా.. ఆస్పత్రికి తీసుకెళ్లరూ..
రాజమండ్రి : ‘నా పెనిమిటి చనిపోయాడంటయ్యా.. ఆస్పత్రిలో ఉంచారట. దారి తెలియదు. మీకు దణ్ణం పెడతా. అక్కడికి తీసుకెళ్లండి బాబూ..’ అంటూ పైలా అప్పలనర్సమ్మ పుష్కరఘాట్‌లో నాలుగ్గంటలపాటు కనిపించిన వారినల్లా వేడుకోవడం భక్తులను కలచివేసింది. ఆమెతో పాటే బృందంలో వచ్చిన జిడ్డు అప్పల నర్సమ్మ కూడా మృత్యువాతపడింది. ఈ ఇద్దరి మృతదేహాల కోసం శ్రీకాకుళం జిల్లా వేజెండ్ల మండలం సరసన్నపల్లె గ్రామం నుంచి వచ్చిన బృందం ఘాట్‌లో రోదిస్తూ అధికారులను బతిమాలింది. అయినా వారిని పట్టించుకునే వారు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంది. సరసన్నపాలెం నుంచి 50 మంది ఒక టూరిస్టు బస్సును మాట్లాడుకుని సోమవారం సాయంత్రం పుష్కరాల కోసం రాజమండ్రికి వచ్చారు. నగర శివారులో బస్సు దిగి నడుచుకుంటూ ఉదయం 4 గంటలకు బృందమంతా కోటగుమ్మం సెంటర్లోని పుష్కరఘాట్‌కు వచ్చింది. అప్పటికే భారీగా జనం ఉండడంతో అప్పలనర్సమ్మ ఆమె భర్త పెంటయ్యనాయుడు, జడ్డు అప్పల నర్సమ్మ, మిగిలినవారంతా లైన్లో నిలబడ్డారు. పుష్కర స్నానం త్వరగా చేసి తిరిగి వెళ్లిపోదామనే ఉద్దేశంతో త్వరత్వరగా ముందుకు కదలిగారు. కానీ కొద్దిసేపటికే గేట్లు మూసివేయడంతో గేటు బయటే నిలబడిపోయారు. ఈ సమయంలో బృందమంతా చెల్లాచెదురైపోయింది. 8.20 గంటలకు గేటు తెరవడంతో అందరితోపాటు ఈ బృందంలోని సభ్యులు కూడా లోనికి తోసుకెళ్లారు. ఏం జరిగిందో తెలిసేలోపే అందరూ ఒకరిమీద ఒకరు పడిపోయారు. గంటపాటు ఊపిరాడక నరక యాతన అనుభవించి పైలా అప్పల నర్సమ్మ, కొంతమంది బయటపడ్డారు. మిగిలినవారు కనపడకపోవడంతో వారి గురించి వెతకడం ప్రారంభించారు. అందరినీ పట్టుకున్నా పెంటయ్యనాయుడు, జిడ్డు అప్పల నర్సమ్మల జాడ తెలుసుకోలేకపోయారు. 12 గంటలకు ఆ పేర్లున్నవారు ఇద్దరు చనిపోయారని, మృతదేహాలు ఆస్పత్రిలో ఉన్నాయని కంట్రోల్ రూమ్‌లో చెప్పారు. దీంతో కన్నీరుమున్నీరవుతూ పైలా అప్పలనర్సమ్మ, మిగిలిన వారు తమను ఆస్పత్రికి తీసుకెళ్లాలని పోలీసులను, అక్కడున్న ఇతర శాఖల వారిని బతిమాలినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి మీడియా ప్రతినిధులు వారిని పోలీసులకు అప్పగించినా వారు రెండుగంటలపాటు అటూఇటూ తిప్పి ఘాట్ బయట వదిలేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఒక అంబులెన్స్ ఆస్పత్రికి వెళుతుంటే మీడియా ప్రతినిధులే డ్రైవర్‌ను బతిమాలి సరసన్నపాలెం బృందాన్ని ఆస్పత్రికి పంపించారు. ఆస్పత్రిలో తమవారి మృతదేహాలను చూసి వారంతా గొల్లుమన్నారు. పుణ్యానికి వ స్తే తమవారి ప్రాణాలుపోయాయని బోరున విలపించారు.