నేడు తిరుమలలో శ్రీవారికి పుష్పయాగం
తిరుమలలో కొలువైన దేవదేవుడు శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదివారం నిర్వహిస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయినట్లు టీటీడీ ఆదివారం వెల్లడించింది. ఈ రోజు మధ్యాహ్ననం 1.00 గంట నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పుష్పయాగం జరుగుతుందని తెలిపింది.
పుష్పయాగం నేపథ్యంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. దాదాపు 7 టన్నుల పుష్పాలను ఆ యాగానికి వినియోగించనున్నట్లు చెప్పింది. అయితే శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమల పొటెత్తింది. ఉచిత దర్శనానికి 5 గంటలు,శ్రీఘ్ర దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.