రోడ్డు ప్రమాదం : స్కూల్ విద్యార్థులకు గాయాలు
చిత్తూరు : చిత్తూరు జిల్లా పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై బుధవారం రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. నాగాలమ్మ సర్కిల్ వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... గాయపడిన బాలురుని తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలించారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఆ తర్వాత లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.