పీవీకి ప్రముఖుల ఘన నివాళి
హైదరాబాద్: భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు 94 వ జయంతి వేడుకలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. నెక్లెస్ రోడ్డులోని పివి సమాధి జ్ఞాన భూమి వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డితో కాంగ్రెస్ పార్టీకి చెందని పలువురు సీనియర్ నేతలతోపాటు పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం పీవి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.