pvp prasda. indusrtylist
-
చంద్రబాబూ.. మీవాళ్లు బ్రీఫ్ చేసినట్లు లేరు
విజయవాడసిటీ: తన మాటలను వక్రీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ‘ఎల్లో మీడియా’పెద్దలు దుష్ప్రచారాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ప్రసాద్ వి. పొట్లూరి ధ్వజమెత్తారు. ఇంగ్లిష్ వచ్చిన వారిని చంద్రబాబు పక్కనబెట్టుకుంటే మంచిదని సూచించారు. తాను ఓ సదస్సులో మాట్లాడిన దాంట్లో రెండు పదాలను కట్ చేసి ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబుకు తన పక్కన ఉన్నవాళ్లు ‘బ్రీఫ్డ్’చేసినట్లుగా లేరని, గల్లా జయదేవ్‌తో తర్జుమా చేయించుకుంటే మంచిదని హితవు పలికారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో పీవీపీ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. సీఐఐ సంస్థ అన్ని రాజకీయ పార్టీలను రాష్ట్ర, విజయవాడ అభివృద్ధిపై మాట్లాడమని పిలిస్తే ఆ సమావేశంలో తాను పాల్గొన్నానన్నారు. అప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఏడుగురు వక్తలు మాట్లాడిన తర్వాత తనకు అవకాశం వస్తే.. తాను ఎక్కువ బోర్ కొట్టించనని, ప్రత్యేక హోదాపై తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడతానని చెప్పానన్నారు. ప్రత్యేక హోదాపై మాట్లాడిన పూర్తి సారాంశాన్ని ప్రసారం చేయకుండా ఎల్లో మీడియా ఎడిట్ చేసి దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. -
ఎన్.ఎస్.ఎం. చారిటబుల్ సొసైటీ ప్రారంభం
విజయవాడ (మొగల్రాజపురం) : అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పదని ఎన్.ఎస్.ఎం.స్కూల్ పూర్వ విద్యార్థి,æప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పి.వి.పి.) అన్నారు. ఆదివారం ఉదయం బందరురోడ్డులో గేట్‌వే హోటల్లో పటమటలోని ఎన్.ఎస్.ఎం.స్కూల్ 1991 బ్యాచ్ విద్యార్ధుల ఆధ్వర్యంలో ఏర్పాౖటెన ఎన్.ఎస్.ఎం.ఛారిటబుల్ సొసైటీని పి.వి.పి. ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అప్పటి స్నేహితులనుSఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సొసైటీ అధ్యక్షుడు సూర్యప్రసాద్ నల్లూరు మాట్లాడుతూ సంపాందించిన సొమ్ములో నుంచి కొంత మొత్తాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఆశయంతోనే ఈ సొసైటీని స్థాపించామన్నారు. సేవలను క్రమంగా నగరం వెలుపలకు విస్తరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎం.స్కూల్ ప్రిన్సిపాల్ డిసౌజా, సొసైటీ కార్యదర్శి శ్రీకాంత్ అట్లూరి, ఉపాధ్యాక్షురాలు ఆయేషా కాటూన్లతో పాటుగా స్కూల్ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన విద్యార్థులు తమ ఉపాధ్యాయుల చేయూతను ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు.