లుపిన్ క్యూ 1 నికర లాభాల్లో క్షీణత
ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం ఫలితాల్లో నిరాశపర్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను అందుకోలేకపోయింది. రూ. 358 కోట్లు నికరలాభాన్ని సాధించింది. ఆదాయం13.4శాతం క్షీణించి రూ. 3869 కోట్లుగా నమోదైంది. ఎబిటా మార్జిన్టు 19.8శాతంగా నిలిచాయి.
మరోవైపు లుపిన్ తయారీ లైడెక్స్ ఆయింట్మెంట్ జనరిక్ వెర్షన్‌కు యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించడంతో ఈ కౌంటర్ లాభాల్లో ట్రేడ్ అవుతోంది. అమెరికా మార్కెట్లలో ఫ్లోసినోనైడ్ టాపికల్ ఆయింట్మెంట్ విక్రయానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి లభించినట్లు లుపిన్ లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. కౌంటీలైన్ ఫార్మా విక్రయించే లైడెక్స్ ఆయింట్మెంట్కు ఇది జనరిక్ వెర్షన్కాగా.. ఈ ఔషధం మార్కెట్ విలువ 4 కోట్ల డాలర్లకుపైగా(రూ.250 కోట్లు) ఉన్నట్లు కంపెనీ తెలిపింది.