'నేపాల్లో తిరిగి పర్యాటకులకు ఆహ్వానం'
భక్తాపూర్: తీవ్ర భూకంపానికి గురైన నేపాల్ మెల్లగా కోలుకుంటోంది. భూకంప కారణంగా దెబ్బతిన్న హెరిటేజ్ ప్రాంతాలను శరవేగంగా పునరుద్ధరించి తిరిగి ప్రారంభించింది. విదేశీ పర్యాటకులను ఆకర్శించేందుకు అనువుగా వీటి రూపు రేఖల్లో స్వల్ప మార్పులు చేసి సుందరంగా ముస్తాబు చేసింది.
ఈ మేరకు అక్కడి పర్యాటక శాఖమంత్రి కృపాసుర్ షెర్పా మాట్లాడుతూ భూకంపం కారణంగా ఏడు హెరిటేజ్ ప్రాంతాల్లో ఆరింటిని మూసివేశామని, తిరిగి వాటిని సోమవారం ప్రారంభించామని చెప్పారు. ప్రతి యేటా నేపాల్ ను దాదాపు ఎనిమిది లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారని, కానీ, ప్రస్తుతం ఏర్పడిన ఉత్పాతం కారణంగా ఎంతమంది వస్తారోనన్న ఆందోళన కొంత ఉందని చెప్పారు. నేపాల్ కు వచ్చే ఆదాయంలో టూరిజం శాఖ నుంచి అధికంగా వస్తుంది.