ఐటీఐ పరీక్షల్లో గందరగోళం
అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఐటీఐ పరీక్ష నిర్వహణలో గందరగోళం నెలకొంది. మోటార్ మెకానిక్ ప్రశ్నాపత్రం బదులు అధికారులు ట్రాక్టర్ మెకానిక్ ప్రశ్నాపత్రం ఇచ్చారు. దీంతో పరీక్షలు ఆగిపోయాయి.
ప్రశ్నాపత్రాలను హైదరాబాద్ నుంచి ఫ్యాక్స్ ద్వారా తెప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికారుల తీరుపై విద్యార్థులు మండిపడ్డారు.