R. krishniah
-
ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంపు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతూ రూపొందించిన ‘ప్రభుత్వ ఉద్యోగాల విరమణ వయస్సు క్రమబద్ధీకరణ బిల్లు’కు సోమవా రం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవం గా ఆమోదం తెలిపింది. తెలంగాణకు తాత్కాలి కంగా కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకూ పద వీ విరమణ పెంపు వర్తిస్తుందని బిల్లులో పేర్కొన్నా రు. తెలంగాణ ప్రభుత్వంలో తాత్కాలికంగా కేటాయించిన ఉద్యోగులు 58 సంవత్సరాలకు పదవీ విరమణ చేసినా తిరిగి ఏపీ ప్రభుత్వంలో చేర్చుకోవడానికి బిల్లు అవకాశం కల్పిస్తుంది. పదవీ విరమణకు, తిరిగి ఏపీ ప్రభుత్వంలో చేరడానికి మధ్య గ్యాప్ ఉన్నా.. సర్వీస్ బ్రేక్ లేకుండా చర్యలు తీసుకోనున్నారు. బాబు వ్యాఖ్యతో నిరుద్యోగుల్లో ఆందోళన.. ఇంటికో ఉద్యోగమంటూ ఎన్నికల ప్రచారంలో ఊరూరా ఊదరగొట్టిన చంద్రబాబు.. ఇప్పుడు శాసనసభ సాక్షిగా మాట మార్చడంపట్ల నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలే కాదని సీఎం చంద్రబాబు సోమవారం శాసనసభలో చెప్పడం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సరికాదు: టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడాన్ని బీసీ సంఘం నేత, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిందిపోయి.. పదవీ విరమణ వయసును పెంచడం సరికాదని ఆయన విలేకరులతో అన్నారు. -
ఆశల పల్లకిలో..
డోకూరి వెంకటేశ్వర్‌రెడ్డి: తాను గెలిచీ.. పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పీఠం ఎక్కవచ్చన్న ఆశ ఒకరిది. చట్టసభల్లో అడుగిడాలన్న వాంఛ మరొకరిది. కలగా మారిన మంత్రి పదవులను దక్కించుకోవాలనే ఆకాంక్ష ఇంకో ఇద్దరిది. రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల బరిలో ఉన్న ఆ నలుగురికి ప్రస్తుత ఎన్నికలు కీలకంగా మారాయి. టీఆర్ఎస్ తరఫున పరిగిలో పోటీ చేస్తున్న కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, తాండూరు నుంచి పోటీచేస్తున్న పట్నం మహేందర్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థులుగా ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో బరిలో ఉన్న ఆర్.కష్ణయ్య, తీగల కృష్ణారెడ్డిలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశించే ఈ పోరులో విజయం కోసం వారు వ్యూహప్రతివ్యూహాల్లో తలమునకలయ్యారు. పరిగి.. మంత్రి పదవిపై గురి రెండు దశాబ్ధాలుగా ఓటమెరుగని హరీశ్వర్‌రెడ్డి ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యూరు. మంత్రి పదవి కలగానే మారింది. చ ంద్రబాబు సర్కారులో డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే కేబినెట్ బెర్త్ ఖాయమని భావిస్తున్న ఆయన జోరుగా ప్రచారం చేస్తూప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల ఓట్ల చీలికతో ప్రజావ్యతిరేకత నుంచి గట్టెక్కుతాననే ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున టి.రామ్మోహన్‌రెడ్డి, బీజేపీ నుంచి కమతం రాంరెడ్డిలు హరీశ్వర్‌కు పోటీ ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి రుక్మారెడ్డి కూడా నిర్ణయాత్మక శక్తిగా మారడం ప్రధాన పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఒకప్పుడు తనకు కుడిభుజంగా ఉన్న రుక్మారెడ్డి ప్రత్యర్థిగా బరిలో దిగడం ఆందోళన కలిగిస్తోంది. ఇవే తాను పోటీ చేసే చివరి ఎన్నికలంటున్న హరీశ్వర్ గెలిస్తే వుంత్రి కావాలన్న కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నారు. తాండూరు.. పార్టీ మారినా.. రాత మారేనా? తెలంగాణలో టీడీపీ గ్రాఫ్ పడిపోతుందని ముందే పసిగట్టిన తాండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి గులాబీ గూటికి చేరారు. మంత్రి కావాలనే కోరిక టీఆర్ఎస్తో నెరవేరుతుందని భావిస్తున్నారు. టీడీపీ శ్రేణులు తన వెంట రాకపోవడంతో విజయం కోసం శ్రమించాల్సిన వస్తోంది. ఎం.నారాయణరావు (కాంగ్రెస్), ప్రభుకుమార్(వైఎస్సార్ సీపీ), ఎం.నరేశ్(టీడీపీ) బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ చతుర్ముఖ పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఉద్యమకాలంలో ఉద్యోగులతో ఘర్షణ పడ్డ ఆయనను అప్పట్లో టీజేఏసీ తెలంగాణ ద్రోహిగా పేర్కొనడం ఇబ్బందికరంగా మారింది. నానాటికీ ప్రజల మద్దతు కూడగట్టుకంటున్న ప్రభుకుమార్‌పై తాజాగా దాడి చేయించడం వ్యతిరేకతను పెంచుతోంది. మహేశ్వరం.. ఒక్క ఛాన్స్! శాసనసభలో అడుగిడాలనే చిరకాల వాంఛను నెరవేర్చుకునేందుకు తీగల కృష్ణారెడ్డి చెమటోడుస్తున్నారు. 1989,1996లో హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి, 2009లో మహేశ్వరం అసెంబ్లీకి టీడీపీ తరుఫున బరిలో దిగిన ఆయనకు పరాభవమే ఎదురైంది. తాజాగా మరోసారి మహేశ్వరం నుంచి అదష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సౌమ్యుడిగా పేరున్న కృష్ణారెడ్డికి ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. గతంలో తనకు దక్కాల్సిన మలక్‌పేట టీడీపీ టికెట్టును ఎగురేసుకుపోయిన మల్రెడ్డి రంగారెడ్డి(కాంగ్రెస్)తో హోరాహోరీగా తలపడుతున్నారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్.. అనూహ్యంగా రంగారెడ్డికి బీ ఫారం ఇచ్చి సీపీఐకి షాక్ ఇచ్చిం ది. సీపీఐతో పెద్దగా పోటీ ఉండదని భావిం చిన తీగలకు కాంగ్రెస్ మార్క్ రాజకీయంతో దిమ్మ తిరిగింది. మరోవైపు ఈసా రి ఎన్నికలకు దూరంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడం ఆయనకు ఇబ్బందిగా మారింది. ఎంపీగా బరిలో దిగిన తనయుడు కార్తీక్‌రెడ్డికి ఇక్కడి నుంచి మంచి మెజార్టీ తెచ్చిపెట్టాలనే ఉద్దేశంతో ఇతర పార్టీలకు చెందిన బలమైన అభ్యర్థులను సబితాఇంద్రారెడ్డి తమవైపు తిప్పుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో నామినేషన్లను విత్‌డ్రా చేయించారు. దీంతో ఇక్కడ పోటీ టీడీపీ-కాంగ్రెస్‌ల మధ్యే ప్రధానంగా నెలకొంది. సొంత మండలమైన సరూర్నగర్పై గంపెడాశలు పెట్టుకున్న కృష్ణారెడ్డి తాడోపేడో తేల్చుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. ఎల్బీనగర్.. ఒత్తిడిలో సీఎం అభ్యర్థి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ అధికారికంగా ప్రకటించిన ఆర్. కృష్ణయ్య ఎల్బీనగర్లో ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. వెనుకబడిన వర్గాల కోసం ప్రజాక్షేత్రంలో పోరాడిన ఆయన తొలిసారి ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉద్యమ బాట వీడి రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణయ్యకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో ఒత్తిడి పెరిగింది. కొంచెం అటూ ఇటూ అయినా ఇన్నేళ్ల ఉద్యమ జీవితంలో సంపాదించుకున్న ప్రతిష్ట మసకబారుతుందని భావిస్తున్నారు. స్థానికేతరుడైన ఆయనను ఇక్కడ పోటీకి దింపడంపై మండిపడ్డ ‘దేశం’ శ్రే ణులు నామినేషన్ రోజే దాడికి దిగాయి. పలువురు సీనియర్ టీడీపీ నేతలు కాంగ్రెస్ గూటికి చేరడం ఆయునకు ప్రతికూలంగా మారింది. సొంత పార్టీ నేతలను బుజ్జగించడం కత్తిమీద సామైంది. కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పుత్తా ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్ ఆయనమీద పోటీలో ఉన్నారు. -
హోరాహోరీ
ప్రధాన పార్టీల్లో రె‘బెల్స్’ తిరుగు‘బాట’లో పలువురు భారీగా నామినేషన్లు కిటకిటలాడినరిటర్నింగ్ కేంద్రాలు కొన్నిచోట్ల ఉద్రిక్తతలు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో సార్వత్రిక ఎన్నికల సంగ్రామం రక్తి కడుతోంది. అభ్యర్థుల వెల్లడిలో జాప్యం.. పొత్తు కుదరని స్థానాలు.. రాత్రికి రాత్రి పార్టీ గోడలు దూకేసిన అభ్యర్థులు.. క్షణాల్లో రంగు మారిన కండువాలు.. ఎవరు ఏ టికెట్‌పై పోటీ చేస్తున్నారో తెలియక అయోమయం.. రెండు రోజులుగా సాగిన గందరగోళ పరిణామాల మధ్య బుధవారం గ్రేటర్ రాజకీయ ముఖచిత్రంలో ఎట్టకేలకు స్పష్టత ఏర్పడింది. అన్ని పార్టీల్లోనూ రె‘బెల్స్’ గట్టిగా మోగాయి. ప్రధాన పార్టీలన్నీ తిరుగుబాట్లకు ఎదురీదక తప్పని పరిస్థితి నెలకొంది. చివరి రోజైన బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. గడువు మధ్యాహ్నం 3 గంటల వరకే ఉన్నా.. అప్పటిలోగా రిటర్నింగ్ కార్యాలయాలకు చేరుకున్న అభ్యర్థులంతా నామినేషన్లు పూర్తిచేసేందుకు రాత్రి వరకు వేచి ఉండాల్సి వచ్చింది. అభ్యర్థుల అభిమానులు, అనుచరులతో ఆయా ప్రాంతాల్లో హడావుడి కనిపించింది. నమ్ముకున్న పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రాత్రికి రాత్రే పార్టీ ఫిరాయించి టికెట్లు పొందిన వారు, రెబల్స్ అభ్యర్థులు పోటాపోటీగా తరలి రావడంతో కొన్ని ప్రాంతాల్లో ఇది ఆవేశకావేశాలకు దారి తీసింది. తిరుగు‘బాట’లో.. ఎల్బీనగర్ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆర్.కృష్ణయ్యకు నామినేషన్ దాఖలు రోజునే గట్టి సెగ తగిలింది. ఎల్బీనగర్ టికెట్ ఆశించి భంగపడిన సామ రంగారెడ్డి అనుచరులు.. కృష్ణయ్య కారుపై కొబ్బరిబొండాలతో దాడి చేశారు. ‘కృష్ణయ్యా గోబ్యాక్’ అంటూ నిరసనలతో హోరెత్తించారు. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ నేత ఎస్వీ కృష్ణప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గోషామహల్ బీజేపీ టికెట్ రాజాసింగ్‌కు దక్కడంతో.. ఆ టికెట్ ఆశించిన నందకిశోర్‌వ్యాస్, రఘునందన్‌యాదవ్, రామస్వామి, గోవింద్‌రాఠి రెబల్స్‌గా నామినేషన్ వేశారు. ఈ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ మిత్రపక్ష టీడీపీ నుంచి శీలం సరస్వతి రెబల్‌గా నామినేషన్ వేశారు. ఇదే నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ దక్కని ఆర్వీ మహేందర్‌కుమార్.. ప్రత్యర్థిగా రంగంలోకి దిగారు. సికింద్రాబాద్ టీడీపీ అసెంబ్లీ టికెట్ ఆశించి ఆ పార్టీలో చేరిన వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి కుంచాల ఏడుకొండలు చివరకు నిరాశే మిగలడంతో పెద్దసంఖ్యలో తన అనుచరులతో ఊరేగింపుగా వెళ్లి రెబల్‌గా నామినేషన్ వేశారు. ఇదే నియోజకవర్గంపై ఎంతోకాలంగా ఆశలు పెంచుకున్న టీడీపీ నేతలు పీఎల్ శ్రీనివాస్, బద్రినాథ్‌యాదవ్ సైతం స్వతంత్రులుగా బరిలో దిగారు. కుత్బుల్లాపూర్ నుంచి టీఆర్ఎస్ టికెట్ లభించని శోభాకృష్ణ అక్కడ తిరుగుబావుటా ఎగురవేశారు. ఖైరతాబాద్ స్థానాన్ని బీజేపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ టీడీపీ నుంచి బిఎన్‌రెడ్డి ప్రత్యర్థిగా పోటీకి దిగారు. డాక్టర్ వినయ్‌కుమార్ (ముషీరాబాద్-కాంగ్రెస్) అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ బీసీ సెల్ నేత న గేష్ ముదిరాజ్, అడిక్‌మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాశ్‌గౌడ్, ఎన్.దశరథ్ స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ టికెట్ లభించని హఫీజ్‌పేట కార్పొరేటర్ జగదీష్‌గౌడ్ ప్రత్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయనకు గతంలో జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులిస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్ పెద్దలు ఏదీ నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో తనకు అసెంబ్లీ టికెట్ ఖాయమని ఆయననమ్మారు. అదీ దక్కకపోవడంతో తిరుగుబావుటా ఎగురవేశారు. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన మొవ్వా సత్యనారాయణ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్-సీపీఐ పొత్తులో భాగంగా మహేశ్వరం స్థానాన్ని సీపీఐ (అజీజ్‌పాషా)కి కేటాయించారు. మరోవైపు, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం నామినేషన్ వేయడం విశేషం. ఇంకా, చల్లా నర్సింహారెడ్డి, బి.చెన్నకృష్ణారెడ్డి కాంగ్రెస్ రెబెల్స్‌గా బరిలో నిలిచారు. అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ రెబల్స్‌గా కాలేరు శ్రీనివాసరావు, అంగరెల్లి నాగరాజు నామినేషన్లు దాఖలు చేశారు. మల్కాజిగిరి అసెంబ్లీ టీడీపీ రెబల్స్‌గా శారదామహేశ్, సుమలతారెడ్డి సవాల్ విసురుతున్నారు. పటాన్చెరులో కాంగ్రెస్ రెబల్‌గా నగేశ్‌యాదవ్ బరిలో నిలిచారు. అన్ని పార్టీల్లో స్వతంత్రుల హవా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం, వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎంతో పాటు లోక్‌సత్తా, ఆమ్ఆద్మీ, బీఎస్పీ, ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్, తెలంగాణ జాగిర్, జై సమైక్యాంధ్ర, టీఆర్ఎల్డీ, ఆర్ఎస్పీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, తెలంగాణ లోక్‌సత్తా పార్టీల నుంచీ పెద్దసంఖ్యలో నామినేషన్లు పడ్డాయి. వైఎస్సార్సీపీ గ్రేటర్‌లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మూడు లోక్‌సభ స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను రంగంలో దింపింది. స్వతంత్ర అభ్యర్థులుగానూ పలువురు నామినేషన్లు వేశారు. గోడ దూకిన వారికి టికెట్లు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారి వెంటనే బీఫారాలు తెచ్చుకొని పోటీలో నిలిచిన వారూ తక్కువేం లేరు. టీడీపీకి చెందిన ముఠా గోపాల్, ప్రేంకుమార్దూత్, మురళిగౌడ్, మైనంపల్లి హన్మంతరావు టీడీపీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. వీరిలో మల్కాజిగిరి అసెంబ్లీని ఆశించిన మైనంపల్లి హన్మంతరావు, టీడీపీ నుంచి కాంగ్రెస్.. అక్కడి నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లి ఏకంగా మల్కాజిగిరి ఎంపీగా నిలిచారు. మిగతా వారికీ పార్టీల మార్పుతో తాము కోరుకున్న అసెంబ్లీ స్థానాల టికెట్లు లభించాయి. -
బీసీనేత ఆర్.కృష్ణయ్యపై దాడి
* నామినేషన్ వేసేందుకు వెళుతుండగా టీడీపీకే చెందిన కొందరు కార్యకర్తల దాడి * కారు అద్దాలు ధ్వంసం... సురక్షితంగా బయటపడ్డ బీసీ నేత * ఎల్బీనగర్ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళుతున్న బీసీ నేత ఆర్.కృష్ణయ్యపై దాడి జరిగింది. బుధవారం ఆయన ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయానికి కారులో వస్తుండగా స్థానిక టీడీపీ నాయకుడు సామ రంగారెడ్డి అనుచరులు .. కృష్ణయ్య గో బ్యాక్ అంటూ పక్కనే ఉన్న కొబ్బరి బొండాలతో కారుపై దాడిచేశారు. ఈ సంఘటనలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే కృష్ణయ్య సురక్షితంగా బయటపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. తర్వాత కృష్ణయ్యకు రక్షణగా ఉండి సర్కిల్ కార్యాలయానికి తీసుకెళ్లారు. నామినేషన్ సందర్భంగా కొంత మంది తనపై దాడికి ప్రయత్నించారని, ఇది మొత్తం బీసీలపై జరిగిన దాడిగా చూస్తామని కృష్ణయ్య పేర్కొన్నారు. కృష్ణయ్య కారుపై దాడి సంఘటనమీద ఆయన అనుచరుడు శ్రీనివాస్‌గౌడ్ సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణయ్య నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకే టీడీపీ నాయకుడు సామరంగారెడ్డి అనుచరులు కొందరు తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సరూర్‌నగర్ సీఐ నవీన్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. కృష్ణయ్యపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు జె.శ్రీనివాస్‌గౌడ్, ఇతర నేతలు జి.కృష్ణ, మల్లేష్, రామ్మూర్తి అన్నారు. మొదటి సంతకం రైతుల రుణమాఫీపైనే : కృష్ణయ్య తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం రైతుల రుణమాఫీపైనే ఉంటుందని ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన టీడీపీ అభ్యర్థిగా ఎల్బీనగర్ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత కొంత కాలంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో టీడీపీని నమ్ముకుని కొంత మంది పనిచేశారని, తన పట్ల కొంత అసంతృప్తి ఉన్నా రెండు మూడు రోజుల్లో సద్దుమనుగుతుందని తెలిపారు. -
మాకు పొత్తులు కలిసొస్తాయి
సాక్షి, హైదరాబాద్: ‘తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత ప్రతి ఎన్నికల్లో టీడీపీ భావసారూప్యత గల పార్టీలను కలుపుకొని ఎన్నికల్లో తలబడుతుంది. 1983 ఎన్నికల్లో సంజయ్ విచార్ మంచ్‌తో కలిసి పోటీచేశాం. 1984లో ఎన్టీఆర్‌ను గద్దెదించిన తర్వాత జరిగిన ఉద్యమంలో బీజేపీ కలసి వచ్చిం ది. 1985,1989,1999 ఎన్నికల్లో బీజేపీతో కలిసే ఎన్నికల్లో పోరాడి విజయాలు అందుకున్నాం. ఇప్పుడు కూడా బీజేపీతో కలసి తెలంగాణలో అధికారంలోకి వస్తాం’ అని టీడీపీ తెలంగాణ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ పేర్కొన్నారు. మోడీ ప్రధాని కావడం వల్ల దేశానికి మంచి జరుగుతుందని, ఎన్డీఏ ప్రభుత్వంలో సెక్యులరిజం పరిరక్షణకు టీడీపీ వాచ్‌డాగ్‌లా పనిచేస్తుందని అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్సు ఫెడరేషన్ శనివారం మీట్ ది మీడియా కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఎల్.రమణతో పాటు ఇటీవల టీడీపీలో చేరిన బీసీ నేత ఆర్. కృష్ణయ్య ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతుంటాయని, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మోడీ ఆహ్వానం మేరకే టీడీపీ పొత్తులకు తెరలేపిందని రమణ చెప్పారు. 2002లో గోద్రా సంఘటనను దేశమంతా ఖండించిందని, చంద్రబాబు కూడా అదే రీతిన స్పందించారని తెలిపారు. -
సబ్ ప్లాన్ రాకుంటే ఆకలి చావులే!
ఇంతవరకు ఈ వృత్తులనే నమ్ముకుని, సమాజ మనుగడకు కారణభూతులైన కోట్లాది మందికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపవలసిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఉంది. వృత్తి యాంత్రీకరణ జరిగి, లాభసాటి కాగానే దానిని సంపన్న పారిశ్రామిక వర్గాల చేతిలో పెట్టడం ధర్మమా? దీనికి ఒక విధానం ఉండాలి. అనాదిగా సంపద సృష్టికి, సమాజ మనుగ డకు కారణభూతులైన చేతివృత్తులు, కులవృ త్తుల వారి మనుగడ ఈ రోజు ప్రశ్నార్థకమైం ది. 1992 నాటి సరళీకృత ఆర్థిక విధానాల తరువాత, ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పరి శ్రమలు రావడంతో దాదాపు 42 కులవృ త్తులు పూర్తిగా కుదేలయి వాటిని నమ్ముకున్న కులాలు విలవిలలాడుతున్నాయి. ప్రపంచం శరవేగంతో ముందుకు పోతు న్నది. ఈ సందర్భంలో కులవృత్తులు, చేతి వృత్తుల స్థానంలో యాంత్రీకరణ, కంప్యూటీ కరణ, కార్పొరేటీకరణ జరగడాన్ని వ్యతిరేకిం చనవసరం లేదు. పాత వ్యవస్థ కొనసాగాలని కోరడం సబబు కాదు. కాని ఇంతవరకు ఈ వృత్తులనే నమ్ముకుని, సమాజ మనుగడకు కారణభూతులైన కోట్లాది మందికి ప్రత్యా మ్నాయ ఉపాధి చూపవలసిన బాధ్యత ప్రజా స్వామ్య ప్రభుత్వంపై ఉంది. వృత్తి యాంత్రీక రణ జరిగి, లాభసాటి కాగానే దానిని సం పన్న పారిశ్రామిక వర్గాల చేతిలో పెట్టడం ధర్మమా? దీనికి ఒక విధానం ఉండాలి. ప్రపంచ దేశాలు ఆధునికీకరణ చెందే క్రమంలో ఆయా ప్రభుత్వాలు అన్ని వర్గాలను ఆ మార్పులకు భాగస్వాములను చేస్తున్నా యి. అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాలకు అం దిస్తున్నాయి. దాదాపు 40 దేశాలలో వచ్చిన పురోగతి అన్ని వర్గాలకు సమంగా చేరింది. మన దేశంలో ఆ సమతుల్యత కానరాదు. బట్ట ల మిల్లులు, ఫ్యాక్టరీలు న్యాయబద్ధంగా చేనే త కార్మికులకు; డిస్టిలరీలు, బ్రేవరీస్, వైన్‌షా పులు గీత కార్మికులకు చెందాలి. అలా జరగ డంలేదు. చేపల చెరువులు, రొయ్యల చెరు వులు మత్స్యకారులకు కేటాయించడంలేదు. ఇవన్నీ పారిశ్రామిక వర్గాల వశమై, వృత్తులు కోల్పోయిన వారు ఆకలి చావులు చస్తున్నారు. 54 శాతం ఉన్న చేతివృత్తులు, కులవృత్తుల వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవ డం ఉచిత సహాయమని ప్రభుత్వం భావించరాదు. మానవ వనరులను సద్వినియోగం చేస్తున్నా మనే కోణంలో చూడాలి. ఈ అంశంలో ప్రభుత్వ విధానాలు మొక్కుబడిగా ఉంటే మంచిది కాదు. ఫెడరే షన్ల ద్వారా లబ్ధిదారులకు ప్రస్తుతం ఒక్కొ క్కరికి కేవలం 5 వేల రూపాయలు మంజూరు చేస్తున్నారు. దీనితోనే అభివృద్ధి చెందగలరా? కార్పొరేటీకరణ నేపథ్యంలో రజకులకు ఒక్కొ క్కరికి 5 వేలు మంజూరు చేస్తే ‘డ్రైక్లీన్ షాప్’ ఎలా పెడతారు? కాబట్టి 17 ఫెడరేషన్ల వారికి ఒక్కొక్కరికి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తే తప్ప, వృత్తిలో యాంత్రికీకరణ సాధించలేరు. 20 వేల కోట్ల బడ్జెట్‌తో సబ్‌ప్లాన్ ప్రకటించాలని బీసీ సంక్షే మ సంఘం ముఖ్యమంత్రితో నాలుగు దఫా లు చర్చించింది. కుల, చేతివృత్తులకు ప్రత్యా మ్నాయ ఉపాధి, రోడ్లపాలైన 124 కులాల వారికి బీసీ కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు లిం కు లేకుండా రుణాలు మంజూరు చేయడం. కులవృత్తులను ఆధునీకరించి, కార్పొరేట్ స్థాయిలో పోటీ పడి నడిపించడానికి వృత్తిని బట్టి ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.50 లక్షల వరకు రుణాలు మంజూరు చేయడం, ఫీజుల రియింబర్స్‌మెంట్ పథకానికి పెట్టిన షరతు లను తొలగించడం, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ తదితర కోర్సుల వారికి పూర్తి ఫీజులు మంజూరు, రెసిడెన్షియల్ పాఠశాలలు లేని 244 అసెంబ్లీ నియోజకవర్గాలలో బీసీ రెసిడెన్షి యల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు మం జూరు చేయడం. పాఠశాల స్థాయి విద్యా ర్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమును పునరుద్ధరించి ఒక్కొక్కరికి నెలకు రూ.500 చొప్పున స్కాలర్షిప్ 10 నెలలపాటు ఇవ్వ డం వంటి డిమాండ్లను బీసీ సంక్షేమ సంఘం ప్రభుత్వం ముందు ఉంచింది. అన్ని రంగా లలో శాఖల వారీగా బీసీ జనాభా ప్రకారం సబ్ ప్లాన్‌కు 50 శాతం బడ్జెట్ కేటాయించా లని కూడా సంఘం కోరుతోంది. ఈ డిమాం డ్లతోనే కలెక్టరేట్లు ముట్టడి జరిగింది. దీనితో నలుగురు మంత్రుల ఉపసంఘం వేశారు. కానీ ఇంకా ఏమీ తేలలేదు. ఇందిరమ్మ ఇళ్లు, సబ్సిడీ బియ్యం, ఆహార భద్రత, అభయ హస్తం, బంగారు తల్లి లాంటి పధకాలతో వారి బతుకులు బాగుపడవు. ఎప్పుడూ చేత లు చాచేవిగానే మిగిలిపోతాయి. ఇవి ఓటు బ్యాంకు రాజకీయాలకే ఉపయోగపడతాయి. 66 ఏళ్ల స్వాతంత్య్రంలో ఈ కులాలను ప్రభు త్వాలు ఇలాగే మోసగిస్తున్నాయి. బీసీ కులాల సమగ్రాభివృద్ధికి సత్వరం స్పందించవలసిన సమయమిది. - ఆర్.కృష్ణయ్య అధ్యక్షులు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం