R R Patil
-
మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం కన్నుమూత
ముంబై: మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత ఆర్ ఆర్ పాటిల్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాటిల్ సోమవారం సాయంత్రం మరణించారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో పాటిల్ మహారాష్ట్ర హోం శాఖ మంత్రిగా ఉన్నారు. -
‘ప్రతీ ఇంటిముందు పోలీసును పెట్టలేం కదా’
ముంబై: ఉత్తరప్రదేశ్ సహా దేశవ్యాప్తం గా మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి నోరు పారేసుకుంటున్న నేతల జాబితాలోకి తాజాగా మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ చేరారు. ‘మహిళలపై రేప్‌లు, ఇతర నేరాలు సాధారణంగా ఇళ్లల్లోనే జరుగుతుంటా యి. అందుకని ప్రతీ ఇంటిముందు ఒక పోలీసును నిలబెట్టగలమా!.. అది సా ద్యమేనా’ అంటూ కొత్త లాజిక్‌ను తెరపైకి తెచ్చారు. సమాజంలో నైతిక విలువలు దిగజారడం వల్లనే అత్యాచారం లాంటి నేరాలు పెరుగుతున్నాయన్నా రు. మహిళలపై పెరుగుతున్న నేరాలకు సంబంధించి బుధవారం మహారాష్ట్ర శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా పాటిల్ ఈ వ్యాఖ్య లు చేశారు. వీటిపై విమర్శలు వెల్లువెత్తడంతో.. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చారు. -
పెరోల్ నిబంధనలలో మార్పులు
జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను పెరోల్‌పై విడుదల చేసే క్రమంలో... పెరోల్ నియమ నిబంధనలలో మార్పులకు శ్రీకారం చుడతామని మహారాష్ట్ర హోం మంత్రి ఆర్. ఆర్.పాటిల్ వెల్లడించారు. మంగళవారం ఆయన ముంబైలో విధాన సభలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... మహారాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఖైదీలు, వారి బంధువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మానవతా ధృక్పథంతో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను పెరోల్ పై విడుదల చేశామన్నారు. అయితే ఖైదీలు దరఖాస్తు చేసుకున్న పెరోల్ విన్నపాన్ని జైలు శాఖ అధికారులు ముందుగా రెవెన్యూ కమిషనర్ కు పంపుతారని వారు అక్కడ పరిశీలించి ఆ తర్వాత హోం శాఖకు పరిశీలను పంపుతారన్నా విషయాన్ని మరువరాదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఖైదీలకు పెరోల్‌పై విడుదల నిర్ణయం హోం శాఖ పరిధిలోని మాత్రమే కాదన్న సంగతి గుర్తించాలన్నారు. బాలీవుడ్ నటుడు, సంజయ్ దత్త్ ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఏరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే తన భార్య మాన్యతకు తీవ్ర అనారోగ్యం చోటు చేసుకుందని, తనను పేరోల్‌పై విడుదల చేయాలని ఆయన జైలు అధికారులను దరఖాస్తు చేసుకున్నారు. దాంతో గతేడాది మూడు సార్లు ఆయన పెరోల్‌పై విడుదలయ్యారు. దీంతో సర్వత్ర నిరసనలు వ్యక్తమైనాయి. దానిని నిరసిస్తు కొంత మంది ముంబై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) వేశారు. ఆ అంశాన్ని పరిశీలించిన ముంబై హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్నితలంటింది. దాంతో మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం నడుం కట్టింది. అయితే సంజయ్ దత్త్ పేరోల్‌పై నివేదిక అందజేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
61 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ
సాక్షి, ముంబై: ఈ ఏడాది 61 వేల పోలీసు ఉద్యోగాలను ఐదు విడతల్లో భర్తీ చేస్తామని హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ వెల్లడించారు. ఠాణేలో రూ.11కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన ఠాణే పోలీసు కమిషనరేట్ కార్యాలయాన్ని ఆయన ఇటీవల ప్రారంభించారు. అనంతరం పాటిల్ మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ‘హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ (హుడ్కో) నుంచి రూ.వెయ్యి కోట్లు రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిధుల ద్వారా పోలీసు స్టేషన్ భవనాల ఆధునీకరణ పనులు కూడా చేపడతామని వివరించారు. కొత్తగా నిర్మించే ఇళ్లతోపాటు పాత, శిథిలావస్థకు చేరుకున్న పోలీసు క్వార్టర్స్ భవనాలకు మరమ్మతులు చేపడతామన్నారు. ఠాణే సిటీలో చితల్సర్, ఖడక్‌పాడా, దాపోడే ప్రాంతాల్లో మూడు కొత్త పోలీసు స్టేషన్లు, జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో ఐదు పోలీసు స్టేషన్లు నిర్మించనున్నామని పాటిల్ తెలిపారు. వీటిద్వారా పోలీసు శాఖ మరింత పటిష్టమవడంతో నేరస్తులను పట్టుకోవడం సులువవుతుందన్నారు. అదనంగా అందుబాటులోకి వచ్చే ఈ పోలీసు స్టేషన్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిపోయిన అత్యాచారాలు, గొలుసు దొంగతనాలను అరికట్టవచ్చని అన్నారు.