R. Sridhar
-
WTC FInal: భారత్‌కు ‘సన్నద్ధతలేమి’ సమస్య కాదు
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు సరైన రీతిలో సన్నద్ధమయ్యేందుకు భారత జట్టుకు తగినంత సమయం లభించడం లేదు. ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన తర్వాత ఉండే క్వారంటైన్ నిబంధనలు, ఆంక్షలే అందుకు కారణం. అయితే ఇది మరీ పెద్ద సమస్య ఏమీ కాదని జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ అభిప్రాయపడ్డాడు. మన ఆటగాళ్లకు ఉన్న అనుభవంతో దానిని అధిగమించవచ్చని అతను చెప్పాడు. ‘ఇంగ్లండ్ వెళ్లిన తర్వాత హార్డ్ క్వారంటైన్ ఎన్ని రోజులు? సాఫ్ట్ క్వారంటైన్ ఎన్ని రోజులు? ఇలా అన్ని అంశాలు చూసిన తర్వాతే సన్నద్ధతపై స్పష్టత రావచ్చు. అయితే మాకు ఎంత సమయం దొరికినా దానిని పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తాం. మాకు ఎన్ని సెషన్లు ప్రాక్టీస్‌కు అవకాశం లభిస్తుందో చెప్పలేం. ఇంతకుమించి మరో ప్రత్యామ్నాయం కూడా లేదు. అయితే మన జట్టులో ఆటగాళ్లంతా అనుభవజ్ఞులే. ఇలాంటి స్థితిలో అదే అవసరం. వారంతా పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకోగలరు. వారంతా న్యూజిలాండ్‌లోనూ ఇంగ్లండ్‌లోనూ కూడా ఆడారు’ అని శ్రీధర్ విశ్లేషించాడు. అయితే ఎక్కువగా సన్నద్ధం కాకపోవడం కూడా కొన్నిసార్లు మేలు చేస్తుందని శ్రీధర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఇది ఉపకరిస్తుందని అతను చెప్పాడు. వారికి కొంత అనుకూలత: భరత్ అరుణ్ భారత్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడనుండటం న్యూజిలాండ్‌కు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదని టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. అయితే తాము దేనికైనా సిద్ధంగా ఉండాలని అతను చెప్పాడు. ‘ఇంగ్లండ్‌లోని పరిస్థితులకు అలవాటు పడతారు కాబట్టి కచ్చితంగా వారికి కొంత అనుకూలత ఉంటుంది. షెడ్యూల్ అలా ఉంది కాబట్టి మనమేమీ చేయలేం. దాని ప్రకారమే ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో న్యూజిలాండ్ ఎలా ఆడుతుందో చూడటం ఎంతో అవసరం. దానిని బట్టే మన వ్యూహాలు తయారు చేసుకోవాల్సి ఉంది’ అని అరుణ్ వ్యాఖ్యానించాడు. చదవండి: WTC Final: అతడు ఫాంలో ఉంటే భారత్‌దే గెలుపు! -
‘స్లెడ్జింగ్ మొదలు పెట్టగానే విషయం తెలిసింది’
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో భారత జట్టు పోరాటపటిమ, అద్భుత ప్రదర్శన ఎప్పటికీ మరిచిపోలేనిది. ముఖ్యంగా సిడ్నీ టెస్టును అశ్విన్, విహారి కలిసి కాపాడుకున్న తీరు అసమానం. ఈ పర్యటనలో తాను ఆడిన తొలి మూడు టెస్టులకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌తో కలిసి పంచుకున్నాడు. మైదానంలో అశ్విన్, విహారి పోరాడుతున్న సమయంలో కోచ్‌లుగా తమ పరిస్థితి ఎలా ఉందో శ్రీధర్ గుర్తు చేసుకున్నాడు. ‘పుజారా అవుటయ్యాక ఆందోళన పెరిగిపోయింది. విహారికి కండరాలు పట్టేయడం కూడా రవిశాస్త్రికి ఆగ్రహం తెప్పించింది. ఒక్క సింగిల్ తీస్తేనే ఇలా జరుగుతుందా అని అతను కోప్పడ్డాడు. ఇక అశ్విన్, విహారి డిఫెన్స్ మొదలయ్యాక ప్రతీ బంతికి అతనిలో ఉత్కంఠ కనిపించింది. ఒక్క బంతి ఆడగానే సీట్లోంచి లేవడం, శభాష్ అంటూ మళ్లీ కూర్చోవడం...ఇలా ఇలా 249 బంతుల పాటు సాగింది. మ్యాచ్ ముగిసేవరకు ఈ భావోద్వేగాలు కొనసాగాయి’ అని శ్రీధర్ చెప్పాడు. అశ్విన్ కూడా విహారితో తన భాగస్వామ్యం గురించి చెప్పుకొచ్చాడు. ‘నేను స్పిన్‌ను సమర్థంగా ఆడతాను కాబట్టి లయన్‌ను ఎదుర్కోవాలని, పేసర్లను విహారి ఆడాలనేది ప్లాన్. అయితే ఒక దశలో సింగిల్ కారణంగా లెక్క మారిపోయింది. కమిన్స్ బౌలింగ్‌లో దెబ్బలు తినకుండా ఆడటం అసాధ్యం. అదే నాకు జరిగింది. మధ్యలో శార్దుల్ ఠాకూర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి పరుగెత్తుకొచ్చాడు. ఏదో సందేశం ఉందని మేం భావిస్తే... హెడ్ కోచ్ మీకు ఏవేవో సూచనలు ఇవ్వమని నాకు చెప్పి పంపించాడు. అయితే నేను మాత్రం అవేమీ మీకు చెప్పను. మీరు ఎలా ఆడుతున్నారో అలాగే ఆడండి అని చెప్పి వెళ్లిపోయాడు. ఇది చెప్పడానికి నువ్వు రావాలా అన్నాను. ఆసీస్ పేలవ వ్యూహాలు కూడా మాకు మేలు చేశాయి. నేను వంగడం కష్టమై నిటారుగా నిలబడుతుంటే నాకు బౌన్సర్లు వేశారు. అదే ముందుకొచ్చి ఆడేలా చేస్తే నేను బాగా ఇబ్బంది పడేవాడిని. పైన్ స్లెడ్జింగ్ మొదలు పెట్టగానే మమ్మల్ని అవుట్ చేసే విషయంలో వారు చేతులెత్తేశారని మాకు అర్థమైపోయింది’ అని అశ్విన్ వివరించాడు. అడిలైడ్‌లో ఘోర పరాభవం తర్వాత అదే రోజు అర్ధరాత్రి సమావేశంలోనే మెల్బోర్న్ టెస్టు కోసం వ్యూహరచన చేశామని శ్రీధర్ వెల్లడించాడు. 36కు ఆలౌట్ అయిన తర్వాత బ్యాటింగ్‌ను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టకుండా అదనపు బౌలర్‌ను తీసుకోవాలనే ఆలోచన బాగా పని చేసిందని, జడేజా అద్భుతంగా ఆడాడని అతను కితాబునిచ్చాడు. పైగా ఆసీస్ బౌలర్లు ఒకే లైన్లో బంతులు వేస్తున్న విషయంపై చర్చించి ఎడమ చేతివాటం ఆటగాడు ఉంటే బాగుంటుందని భావించి పంత్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు. జూలైలోనే వ్యూహరచన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆఫ్‌సైడ్ వైపు ఆడే అవకాశాలు బాగా తగ్గిస్తే తాము పైచేయి సాధించవచ్చనే ప్రణాళికను సిరీస్‌కు చాలా రోజుల ముందుగా వేసినట్లు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వెల్లడించాడు. సిరీస్‌లో లెగ్ సైడ్ ఆడబోయి కీలక ఆటగాళ్లు స్మిత్, లబ్‌షేన్ వికెట్లు కోల్పోవడంతో భారత్‌కు పట్టు చిక్కింది. ‘స్మిత్, లబ్‌షేన్ ఎక్కువగా కట్, పుల్ షాట్లతో పాటు ఆఫ్ సైడ్ పరుగులు సాధించే బ్యాట్స్‌మెన్. అయితే న్యూజిలాండ్ పేసర్ వాగ్నర్ కొద్ది రోజుల ముందు లెగ్ సైడ్ బౌలింగ్ చేసి స్మిత్‌ను బాగా ఇబ్బంది పెట్టాడు. ఇది చూసి పన్నిన వ్యూహం అద్భుతంగా పని చేసింది’ అని అరుణ్ వివరించారు. ఆస్ట్రేలియా పర్యటనలో లభించిన ఆణిముత్యం సిరాజ్ అని హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించారు. వ్యక్తిగత బాధను దిగమింగి అతను జట్టు కోసం చేసిన ప్రదర్శనను ఎంత ప్రశంసించినా తక్కువేనని అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఒక రోజు ఆలస్యంగా శుక్రవారం అశ్విన్, వాషింగ్టన్ సుందర్ స్వస్థలం చెన్నై చేరుకొని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు రోజులు క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. -
పంతం నెగ్గింది!
♦ రవిశాస్త్రి కోరుకున్నవారే సహాయక బృందంలోకి ♦ భారత బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ ♦ బంగర్‌కు అసిస్టెంట్ కోచ్ హోదా ♦ ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్. శ్రీధర్ ఏడాది క్రితం ఇంటర్వ్యూలో కోచ్ పదవిని దక్కించుకోలేకపోయిన రవిశాస్త్రి సంవత్సరం తిరిగే లోపే భారత క్రికెట్‌కు సంబంధించి మరోసారి ప్రధాన కేంద్రంగా ఎదిగారు. నాటి సలహాదారుల కమిటీ ద్వారానే మళ్లీ కోచ్‌గా ఎంపికవడమే కాకుండా... తనతో కలిసి పని చేసే సహాయక సిబ్బంది ఎంపికలో కూడా తన ముద్ర చూపించారు. కమిటీ ఎంచుకున్న బౌలింగ్, బ్యాటింగ్ సలహాదారులు జహీర్ ఖాన్, రాహుల్ ద్రవిడ్‌లను కాదంటూ తనకు నచ్చినవారినే బృందంలోకి తీసుకురాగలిగారు. కోహ్లి అండతో హెడ్ కోచ్‌గా మారి, ఇప్పుడు తన పంతం కూడా నెగ్గించుకోగలిగిన రవిశాస్త్రి రాబోయే రెండేళ్లు ఎలా పని చేస్తారన్నది ఆసక్తికరం. ముంబై: భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ ఎంపికయ్యారు. ఇప్పటి వరకు బ్యాటింగ్ కోచ్‌గా పని చేస్తున్న సంజయ్ బంగర్‌కు అసిస్టెంట్ కోచ్ హోదా దక్కగా... ఆర్. శ్రీధర్ ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగుతారు. మంగళవారం బీసీసీఐ ఈ ఎంపికను ప్రకటించింది. బౌలింగ్ కోచ్‌గా అరుణ్ కావాలంటూ కొద్ది రోజులుగా పట్టుబట్టిన హెడ్ కోచ్ రవిశాస్త్రి... సోమవారమే దీనిపై బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్ చౌదరి, సీఈఓ రాహుల్ జోహ్రి, సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీలతో చర్చించారు. ఆయన సూచనల మేరకు వీరి నియామకాలకు బోర్డు అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. రవిశాస్త్రితో పాటు ఈ ముగ్గురి పదవీ కాలం కూడా 2019 వన్డే వరల్డ్ కప్ వరకు ఉంటుంది. గతంలో రవిశాస్త్రి డైరెక్టర్‌గా ఉన్న సమయంలో కూడా ఈ ముగ్గురే ఆయనతో కలిసి పని చేశారు. అనేక మలుపుల తర్వాత... గత మంగళవారం రవిశాస్త్రిని కోచ్‌గా ఎంపిక చేసిన సమయంలో బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్, బ్యాటింగ్ సలహాదారుడిగా రాహుల్ ద్రవిడ్ పేర్లను కూడా సీఏసీ ప్రకటించింది. అయితే వారు తమ పరిధి దాటారంటూ సీఓఏ నుంచి విమర్శలు రావడం... శాస్త్రితో సంప్రదించిన తర్వాతే పేర్లు ప్రకటించామంటూ సీఏసీ లేఖ రాయడం... అసలు వారిద్దరి ఎంపికను ఖరారు చేయలేదని, కేవలం ప్రతిపాదనలు మాత్రమేనని మళ్లీ బోర్డు నుంచి వివరణ రావడం వ్యవహారాన్ని మరింత వివాదాస్పదంగా మార్చింది. చివరకు శాస్త్రి చెప్పిన వారికే బోర్డు ఓటు వేసింది. అయితే బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి మాత్రం ఈ అంశాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. అసలు ఈ విషయంలో సమస్య ఎప్పుడూ లేదని ఆయన వివరణ ఇచ్చారు. ‘నాకు తెలిసి ఇందులో ఎలాంటి గందరగోళం చోటు చేసుకోలేదు. ఒకసారి శాస్త్రి హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాక తనతో కలిసి పని చేసే వ్యక్తులను ఎంచుకునే హక్కు ఆయనకు ఉంది’ అని చౌదరి అన్నారు. నేను మాత్రం వెళ్లను... భారత క్రికెట్ జట్టుకు సంబంధించి ద్రవిడ్, జహీర్ పాత్ర ఏమిటో, వారి బాధ్యతలు ఎలాంటివో స్పష్టత లేదు. వీరిద్దరు సలహాదారులుగా ఉంటారని మాత్రం చౌదరి అన్నారు. అయితే తాను విదేశీ పర్యటనలకు వెళ్లనని ద్రవిడ్ ఇప్పటికే బీసీసీఐకి చెప్పినట్లు సమాచారం. భారత్‌లో జరిగే ఏదైనా శిక్షణా శిబిరానికి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడేందుకు, తన అనుభవాన్ని పంచుకునేందుకు మాత్రం సిద్ధమని చెప్పినట్లు తెలిసింది. వారిద్దరి సలహాలు తీసుకుంటా! తాను అనుకున్న రీతిలోనే సహాయక సిబ్బందిని ఎంపిక చేయడం పట్ల రవిశాస్త్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘నేను ఇంగ్లండ్‌లో వింబుల్డన్ చూస్తున్నా, నా మనసులో ఇతర కోచింగ్ సిబ్బంది గురించి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి. నేను కోరుకున్న వ్యక్తులనే ఇప్పుడు మీరు చూస్తున్నారు’ అని ఆయన మీడియాతో చెప్పారు. జహీర్, ద్రవిడ్‌ల సూచనలు తీసుకునేందుకు కూడా తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. ‘నేను వారిద్దరితో విడివిడిగా మాట్లాడాను. వారు అద్భుతమైన క్రికెటర్లు. వారిచ్చే సూచనలు వెల కట్టలేనివి. సంబంధిత అధికారులతో చర్చించిన తర్వాత వారు కూడా మా బృందంలో భాగమవుతారు’ అని శాస్త్రి అన్నారు. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా పని చేయడం గొప్ప గౌరవమని, తనకు ఆ అర్హత ఉందని భావించి తనను ఎంపిక చేసిన సలహాదారుల కమిటీకి శాస్త్రి కృతజ్ఞతలు తెలిపారు. రూ. 8 కోట్ల వేతనం! భారత జట్టు హెడ్ కోచ్‌గా రవిశాస్త్రికి ఏడాదికి రూ. 8 కోట్ల వరకు వేతనంగా చెల్లించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. గత కోచ్ కుంబ్లేకు (రూ. 6.5 కోట్లు) ఇచ్చిన దానికంటే ఇది మరింత ఎక్కువ కావడం విశేషం. దీనిపై బోర్డులోని ప్రముఖుడు ఒకరు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నట్లు తెలిసింది. భరత్ అరుణ్, సంజయ్ బంగర్, శ్రీధర్‌లకు రూ. 2–3 కోట్ల మధ్య దక్కే అవకాశం ఉంది. భరత్ అరుణ్ ప్రొఫైల్ విజయవాడలో పుట్టిన ఈ మాజీ పేస్ బౌలర్ తమిళనాడు తరఫున ఆడారు. భారత్‌కు కేవలం 2 టెస్టులు (4 వికెట్లు), 4 వన్డేల్లో (1వికెట్) మాత్రమే ప్రాతినిధ్యం వహించిన అరుణ్‌కు దేశవాళీ క్రికెట్లో మాత్రం మెరుగైన రికార్డు ఉంది. భారత బౌలింగ్ కోచ్‌గా మంచి ఫలితాలు సాధించిన ఆయన, గత ఏడాది హైదరాబాద్ రంజీ టీమ్ కోచ్‌గా కూడా పని చేసి జట్టును నాకౌట్ దశకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. అండర్–19 స్థాయి నుంచి రవిశాస్త్రితో ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు ఆయనకు మరోసారి కీలక అవకాశం కల్పించింది. -
మరోసారి ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీధర్
ముంబై: న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు భారత ఫీల్డింగ్ కోచ్‌గా మరోసారి ఆర్.శ్రీధర్‌ను నియమించారు. ఇటీవలి కరీబియన్ పర్యటనలో ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించిన అభయ్ శర్మకు ఉద్వాసన పలికారు. సోమవారం జరిగిన టెస్టు జట్టు ఎంపిక సందర్భంగా విండీస్ పర్యటనపై కోచ్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లితో కలిసి బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కే రివ్యూ జరిపారు. వారిద్దరి సూచనల మేరకు శ్రీధర్‌కు పిలుపు అందింది. గతంలో శ్రీధర్ జాతీయ జట్టుకు సేవలందించగా టి20 ప్రపంచకప్ అనంతరం ఆయన ఒప్పందం ముగిసింది.