Raag Desh
-
మనిషిని చంపడమే దేశభక్తా..: కునాల్ కపూర్
ఛండీగఢ్: దేశభక్తిపై బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీధుల్లో ఒకరిని చంపడం, లేకపోతే సోషల్ మీడియాలో ఒకరి మీద మరోకరు విమర్శలు చేసుకోవడమే దేశభక్తా అని ప్రశ్నించారు. దేశభక్తి అంటే ఇండియా-పాక్ మ్యాచ్ల్లో గంతులేయడం కాదన్నారు. దేశభక్తి అంటే ఒక సిద్ధాంతం అని, దేశ నిర్మాణం దానిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. దేశంలో ప్రతిఒక్కరూ సమానమేనని అందరికీ సమాన హక్కులు ఉంటాయని కపూర్ అన్నారు. పంజాబ్ యూనివర్సిటీలో తను ప్రధాన పాత్రపోషించిన సినిమా 'రాగ్దేశ్' ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎర్రకోటలో భారతీయ ఆర్మీనేపథ్యంలో ఈచిత్రం తెరకెక్కింది. ఇందులో కునాల్ ఆర్మీ మేజర్ జనరల్ షా నవాజ్ ఖాన్ ప్రాత పోషిస్తున్నారు. రాజ్యసభ టీవీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పాకిస్తాన్ నటులను బాలీవుడ్ లో నటించడానికి అనుమతినివ్వాలన్నారు. కరణ్ జోహార్ నటించిన ఏ దిల్ హై ముస్కిల్ చిత్రంలో పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ ఉన్నాడని చాలా మంది నిరసన వ్యక్తం చేశారు. కానీ తర్వాత రోజుల్లో శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో పాకిస్తాన్ నటుడు ఉన్నా ఎందుకు అభ్యంతరం తెలపలేదు. అందరికీ ఒకే న్యాయం ఉండాలన్నారు. -
రూటు మార్చిన మృదుల..!
చెన్నై: చేసింది తక్కువ సినిమాలే అయినా దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ మృదులా మురళి. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ కేరళ కుట్టి.. ‘ఎయిసమ్మ ఎన్నా ఆంకుట్టి’, ‘నాగరాజ చోలన్ ఎంఏ, ఎమ్మెల్యే’, ‘శిగమణి’ వంటి తమిళ, మలయాళ సినిమాలతో యువకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ ఊపులోనే బాలీవుడ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఈ అమ్మడు భావిస్తోంది. అందులో భాగంగా అప్పుడే ఓ బాలీవుడ్ సినిమాకు పచ్చజెండా ఊపింది. తిగ్మాన్షు ధులియా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాగ్ దేశ్’ సినిమాలో మృదులా మురళి హీరోయిన్గా ఎంపికైంది. సోనం కపూర్ కజిన్ మోహిత్ మర్వా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కునాల్ కపూర్ కూడా కీలక పాత్ర పోషిస్తాడని వినిపిస్తోంది. ‘చరిత్మాత్మక కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిజజీవిత పాత్రలో మృదుల నటిస్తోంది. ఇండియన్ నేషనల్ ఆర్మీ ట్రయల్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నది’ అని చిత్రయూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది.