రూటు మార్చిన మృదుల..! | Mrudula Murali to make Bollywood debut with Raag Desh | Sakshi
Sakshi News home page

రూటు మార్చిన మృదుల..!

Published Sat, Jun 25 2016 5:43 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

రూటు మార్చిన మృదుల..! - Sakshi

రూటు మార్చిన మృదుల..!

చెన్నై: చేసింది తక్కువ సినిమాలే అయినా దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ మృదులా మురళి. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ కేరళ కుట్టి.. ‘ఎయిసమ్మ ఎన్నా ఆంకుట్టి’, ‘నాగరాజ చోలన్ ఎంఏ, ఎమ్మెల్యే’, ‘శిగమణి’ వంటి తమిళ, మలయాళ సినిమాలతో యువకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ ఊపులోనే బాలీవుడ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఈ అమ్మడు భావిస్తోంది. అందులో భాగంగా అప్పుడే ఓ బాలీవుడ్ సినిమాకు పచ్చజెండా ఊపింది.

తిగ్మాన్షు ధులియా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాగ్ దేశ్‌’ సినిమాలో మృదులా మురళి హీరోయిన్‌గా ఎంపికైంది. సోనం కపూర్ కజిన్ మోహిత్ మర్వా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కునాల్ కపూర్ కూడా కీలక పాత్ర పోషిస్తాడని వినిపిస్తోంది.

‘చరిత్మాత్మక కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిజజీవిత పాత్రలో మృదుల నటిస్తోంది. ఇండియన్ నేషనల్ ఆర్మీ ట్రయల్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నది’ అని చిత్రయూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement