'రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోంది'
వైఎస్సార్ జిల్లా(చిన్నమండెం): రాష్ట్ర విభజన అనంతరం రాయలసీమ జిల్లాలకు తీరని అన్యాయం జరుగుతోందని రాయచోటి ఎమ్మెల్యేశ్రీకాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. విలేకర్లతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ, బీజేపీనాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాపై ప్రజలకి ఎలాంటి స్పష్టత ఇవ్వలేక పోతున్నారన్నారు. కృష్ణాజలాల నుంచి 200టీఎంసీల నీటిని రాయలసీమకు విడుదల చేయాలని శ్రీకాంత్‌రెడ్డి కోరారు. శ్రీశైలంలో నీటి మట్టం పూర్తిగా ఉంటే తప్ప రాయలసీమకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. కాబట్టి ప్రస్తుతానికి లాభంలేని పట్టిసీమ ప్రాజెక్టుకు బదులు పోలవరం ప్రాజెక్టుతో పాటు హంద్రీ-నీవా సుజల స్రవంతి మెయిన్ కాలువ పనులు పూర్తి చేయాలన్నారు.
పూర్తిగా రాజధాని పనులే కాకుండా రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉద్యోగఅవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.