Race car
-
ఈ స్టార్ హీరో ఓ సాహసి.. స్పెయిన్ బార్సిలోనా ఎఫ్ 1 రేసులో అజిత్ కుమార్ (ఫొటోస్)
-
ఫార్ములా 1 రేస్ కారులాంటి వాహనంలో పాల క్యాన్లు... వీడియో వైరల్
A viral video shows motorist carrying milk cans: చాలామంది మంచి ఖరీదైన బైక్ పై రైడ్ చేయాలనుకుంటారు. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్య లేక మరేదైన కారణాల వల్లో తమకు ఇష్టమైన వాహనాల్లో వెళ్లలేకపోతుంటారు. ఇది సర్వసాధరణమే. కానీ కొంతమంది తమ కలల వాహనంలోనే రైడ్ చేయాలనుకుంటారు. అందుకోసం తమ సృజనాత్మకతకు పదును పెట్టి మరీ తమ డ్రీమ్ వాహనాన్ని రూపొందించుకుంటారు. ఇక్కడోక వ్యక్తి అచ్చం అలాంటి కోవకు చెందినవాడే. వివరాల్లోకెళ్తే...ఒక వ్యక్తి ఫార్తులా వన్ రేస్ కారు మాదిరి వాహనంలో పాల క్యాన్లు మోసుకు వెళ్తున్నాడు. పైగా అతను ఫార్ములా వన్ కారు రైడ్ చేస్తున్నప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకుంటారో అలానే అతను నల్లటి కోట్, హెల్మెట్ ధరించి రైడ్ చేస్తున్నాడు. అయితే అతను పాలను పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని రోడ్స్ ఆఫ్ ముంబై సంఘం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇలాంటి ఇన్నోవేషన్ వీడియోలను షేర్ చేసేందుకు ఆసక్తి కనబర్చే దిగ్గజ పారశ్రామికవేత్త ఆనంద్ మహింద్రాకి ఈ వీడియో నచ్చుతుందంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. నిజానికి సృజనాత్మకత భారతీయుల రక్తంలోనే ఉంది. గతంలో కూడా ఓ వ్యక్తి విద్యుత్తు లేకుండా పనిచేసే చెక్క ట్రెడ్మిల్ రూపోందించి అందరి మన్నలను అందుకున్న సంగతి తెలిసిందే. When you want to become a F1 driver, but the family insists in helping the dairy business 👇😜 pic.twitter.com/7xVQRvGKVb — Roads of Mumbai 🇮🇳 (@RoadsOfMumbai) April 28, 2022 (చదవండి: సెలవు కావాలని వైరల్ లేఖ) -
స్పీడు పెంచిన ‘టాటా’
న్యూఢిల్లీ: రేసు కార్లపై దృష్టిసారించిన టాటా మోటార్స్... కోయంబత్తూర్ సంస్థ జయం ఆటోమోటివ్స్‌తో కలిసి దేశీ మార్కెట్లో రెండు సరికొత్త కార్లను శుక్రవారం విడుదలచేసింది. టియాగో జేటీపీ, టైగర్ జేటీపీ పేరిట విడుదలైన ఈ కార్లలో శక్తివంతమైన 1.2 –లీటర్ టర్బోచార్జిడ్ న్యూ జనరేషన్ రివోట్రన్ పెట్రోల్ ఇంజిన్లను అమర్చినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ స్థాయి ఇంజిన్ నుంచి 112 బీహెచ్పీ, 150 ఎన్ఎం పీక్ టార్క్ విడుదలై.. కేవలం 10 సెకన్లలోనే జీరో నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కారు అందుకోగలుగుతుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ వివరించారు. ధరల విషయానికి వస్తే.. హచ్‌బ్యాక్ టియాగో జేటీపీ రూ.6.39 లక్షలు, సెడాన్ టియాగో జేటీపీ రూ.7.49 లక్షలు. టైగర్ జేటీపీ ప్రారంభ ధర రూ.5.5 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ.6.5 లక్షలు. ప్రస్తుతానికి హైదరాబాద్, మరికొన్ని నగరాల్లో 30 డీలర్ల వద్దే బుకింగ్స్‌కు అవకాశం ఉంది. -
వినూత్న రేస్ కారు ఆవిష్కరణ
చేబ్రోలు: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజ్ఞాన్ వర్శిటీ మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో వినూత్న రేస్ కారును ఆవిష్కరించారు. మెకానికల్ విభాగాధిపతి రామకృష్ణ మాట్లాడుతూ తమ విద్యార్థులు రూ. 94 వేల ఖర్చుతో వినూత్న రేస్ కారును తయారు చేశారన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కారును రూపొందించినట్లు తెలిపారు. సిబ్బంది అల్లంనేని శారద, ఆయా విభాగాల అధిపతులు, డీన్లు, విద్యార్థులు పాల్గొన్నారు.