న్యూఢిల్లీ: రేసు కార్లపై దృష్టిసారించిన టాటా మోటార్స్... కోయంబత్తూర్ సంస్థ జయం ఆటోమోటివ్స్‌తో కలిసి దేశీ మార్కెట్‌లో రెండు సరికొత్త కార్లను శుక్రవారం విడుదలచేసింది. టియాగో జేటీపీ, టైగర్ జేటీపీ పేరిట విడుదలైన ఈ కార్లలో శక్తివంతమైన 1.2 –లీటర్ టర్బోచార్జిడ్ న్యూ జనరేషన్ రివోట్రన్ పెట్రోల్ ఇంజిన్‌లను అమర్చినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది.
ఈ స్థాయి ఇంజిన్ నుంచి 112 బీహెచ్‌పీ, 150 ఎన్‌ఎం పీక్ టార్క్ విడుదలై.. కేవలం 10 సెకన్లలోనే జీరో నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కారు అందుకోగలుగుతుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ వివరించారు. ధరల విషయానికి వస్తే.. హచ్‌బ్యాక్ టియాగో జేటీపీ రూ.6.39 లక్షలు, సెడాన్ టియాగో జేటీపీ రూ.7.49 లక్షలు. టైగర్ జేటీపీ ప్రారంభ ధర రూ.5.5 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ.6.5 లక్షలు. ప్రస్తుతానికి హైదరాబాద్, మరికొన్ని నగరాల్లో 30 డీలర్ల వద్దే బుకింగ్స్‌కు అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment