ప్రవేశాలు
రచన జర్నలిజం కళాశాల
హైదరాబాద్‌లోని రచన జర్నలిజం కళాశాల దూర విద్య విధానంలో నిర్వహిస్తున్న జర్నలిజం కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు:పీజీ డిప్లొమా
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. సర్టిఫికెట్ కోర్సు
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
దరఖాస్తు: దరఖాస్తు కోసం రూ.100 డిమాండ్ డ్రాఫ్ట్‌ను ‘రచన జర్నలిజం కళాశాల, హైదరాబాద్’ పేరిట తీసి కింది చిరునామాకు పంపాలి.
చిరునామా: రచన జర్నలిజం కళాశాల, కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ క్యాంపస్, దీపక్ థియేటర్ పక్క వీధి, నారాయణగూడ, హైదరాబాద్ - 500 029
ఫోన్: 040-23261335,
మొబైల్: 99596 40797
చివరి తేది: ఆగస్టు 20
విదేశీ విద్య
తెలంగాణ షెడ్యూల్డ్ కులాలఅభివృద్ధి శాఖ
యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్లలోని విశ్వవిద్యాలయాల్లో మెడిసిన్/ ఇంజనీరింగ్/ ఫార్మసీ/ నర్సింగ్/ ప్యూర్ సెన్సైస్/ హ్యుమానిటీస్/ సోషల్ స్టడీస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ విద్యార్థులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు: తెలంగాణ రాష్ట్రానికి చెందిన షెడ్యూల్డ్ కులాలవారే దరఖాస్తు చేసుకోవాలి. కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రెండు లక్షల రూపాయలకు మించకూడదు. విదేశాల్లో పీజీ కోర్సులను కొనసాగించడానికి గ్రాడ్యుయేషన్‌లో, పీహెచ్డీ కొనసాగించడానికి పీజీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 5
వెబ్సైట్:www.epass.cgg.gov.in