యజమాని మోసం!
ఆ మంత్రికి నమ్మినబంటు అతను. ఏ పని చెప్పినా మారు మాట్లాడకుండా చక్కబెట్టుకొస్తాడు. అయితే ఆ నమ్మకాన్ని ఆ మినిస్టర్ తన స్వార్థానికి వాడుకోవాలనుకుంటాడు. తాను సీఎం కావడానికి నమ్మినబంటుకే వెన్నుపోటు పొడిచి అతన్ని నేరంలో ఇరికించాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ఊబిలోంచి అతను ఎలా బయటపడ్డాడు? తన యజమానికి ఎలా బుద్ధిlచెప్పాడు... అనే అంశాలతో రూపొందిన కన్నడ చిత్రం ‘రథావరం’.
శ్రీ మురళి, రచితారామ్ జంటగా చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మంజునాథ్ తెలుగులోకి అనువదిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మంజునాథ్ మాట్లాడుతూ– ‘‘యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. నమ్మకం, ప్రేమ, త్యాగం, స్నేహం.. ఇలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాలో హిజ్రాల విశిష్టతను చెప్పే ప్రయత్నం చేశాం. త్వరలో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.