racism act
-
టెస్లాకు వెయ్యికోట్ల జరిమానా, 'మై లార్డ్'..ఒక్కసారి ఆలోచించండి
టెస్లాలో జాత్యంహాకర దాడుల అంశంపై ఎలన్ మస్క్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్ట్‌ను ఆశ్రయించారు. టెస్లా కంపెనీలో జాత్యంహాకర దాడులపై నమోదైన కేసు విషయంలో కోర్టులోని జ్యూరీ బృందం ఇచ్చిన తీర్పుపై పున:పరిశీలించాలని కోరారు. బాధితుడికి అనుకూలంగా తీర్పు టెస్లా కంపెనీ ఫ్రీమాంట్ ప్లాంట్‌లో ఓవెన్ డియాజ్ అనే నల్లజాతీయుడు 2015 నుంచి 2016 వరకు పనిచేశాడు. పనిచేస్తోన్న సమయంలో మాజీ కాంట్రాక్ట్ ఎలివేటర్ ఆపరేటర్ వైట్ అమెరికన్లు తనని నిగ్గర్ (అమెరికన్లు నల్లజాతీయుల్ని వ్యతిరేకించడం) అని ఏడిపించాడు. వర్క్‌ప్లేస్‌లో జాత్యహంకార వ్యంగ్యంగా బొమ్మల్ని గీసారని, బాత్రూమ్ స్టాల్లో నల్లజాతియుల్ని దూషించేలా స్లోగన్లు రాశారని, గోబ్యాక్ ఆఫ్రికా అంటూ వేధించారని ఆరోపించాడు. అయితే జాత్యంహకార వ్యాఖ్యలపై క్షోభకు గురైన ఓవెన్ డియాజ్ కోర్డును ఆశ్రయించాడు. దీంతో విచారణ చేపట్టిన కోర్ట్ అక్టోబర్ 4న ఓవెన్ డియాజ్కు అనుకూలంగా తుది తీర్పును వెలువరించింది. 137మిలియన్ల నష్టపరిహారం ఈ ఏడాది అక్టోబర్ 4న శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ జ్యూరీ సభ్యులు ఇచ్చిన తీర్పులో టెస్లా కాలిఫోర్నియా ఫ్యాక్టరీలో జాత్యహంకార వేధింపులను కంపెనీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నల్లజాతీయుడు ఓవెన్ డియాజ్కు $137 మిలియన్లు చెల్లించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పుపై తాజాగా టెస్లా కోర్ట్ తీర్పును సవాలు చేసింది. కోర్టు తీర్పు టెస్లాను అస్థిరపరిచేలా ఉందని, నిర్ణయాన్ని పున:పరిశీలించాలని న్యాయమూర్తిని కోరింది. ప్రత్యామ్నాయంగా న్యాయస్థానం విధించిన $137(భారత కరెన్సీలో రూ.10,17,98,67,200.00) మిలియన్ల నష్టపరిహారం కాకుండా $300,000 డాలర్లు చెల్లిస్తామని వాదించినట్లు బ్లూమ్‌బెర్గ్ తన కథనంలో తెలిపింది. అంతేకాదు టెస్లా డియాజ్ ఫిర్యాదు పై తమ సంస్థ కార్మికులను క్రమశిక్షణగా ఉంచుతుందని, ఫిర్యాదు దారుడు చేసిన ఆరోపణల్లో ఆధారాలు లేవని బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. చదవండి: ఎలన్ మస్క్ కంపెనీ బలుపు చేష్టలు..టెస్లాకు భారీ షాక్! -
జాత్యహంకారం.. కెమెరాకు చిక్కిన ప్లేయర్
బెల్గ్రేడ్: జాత్యంహకారం, సెక్సీయెస్ట్ కామెంట్ల నేపథ్యంలో ఆటగాళ్లపై వేటు పడుతున్న ఘటనలు ఈమధ్య వరుసగా జరుగుతున్నాయి. అంతేకాదు పాత ఘటనల్ని సైతం తవ్వి తీసి.. విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో సెర్బియన్ వాలీబాల్ ప్లేయర్ ఒకరు.. కోర్టులోనే జాత్యహంకార ధోరణిని ప్రదర్శించి వేటుకి గురైంది. జూన్ 1న థాయ్‌లాండ్, సెర్బియా మహిళా జట్ల మధ్య వాలీబాల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మధ్యలో సంజా జుర్డ్జెవిక్ అనే సెర్బియన్ ప్లేయర్.. థాయ్‌లాండ్ ఆటగాళ్లను వెక్కిరిస్తూ సైగ చేసింది. ఇది థాయ్ ఆటగాళ్లు పట్టించుకోకపోయినా.. ఆమె అలా చేసినప్పుడు స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. దీంతో అగ్గిరాజుకుంది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో సంజా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వివరణ ఇచ్చుకుంది. తాను మ్యాచ్ ముగిశాకే థాయ్‌లాండ్ టీంకు క్షమాపణలు చెప్పానని, ఇప్పుడు మరోసారి చెప్తున్నానని ప్రకటించింది. అయినా వివాదం చల్లారక పోవడంతో ఆమెపై రెండు మ్యాచ్‌ల నిషేధంతో పాటు 16 వేల పౌండ్ల ఫైన్ కూడా విధించింది ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్. ఈ జరిమానాను యాంటీ డిస్క్రిమినేషన్ ఛారిటీకి లేదంటే ఏదైనా ఎడ్యుకేషనల్ సొసైటీకి డొనేట్ చేయాలని వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనపై సెర్బియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కూడా క్షమాపణలు చెప్పింది.ఇంతకుముందు 2017లో సెర్బియన్ వాలీబాల్ టీం యూరోపియన్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ తర్వాత.. ఇలాంటి చేష్టలకే పాల్పడి విమర్శలు ఎదుర్కొంది. 2008లో స్పానిష్ బాస్కెట్‌బాల్ టీం, 2017లో అర్జెంటీనా ఫుట్‌బాల్ టీం. చైనా వాళ్లను అవహేళన చేస్తూ కళ్లను చిన్నవి చేసి ఫొటోలు దిగి విమర్శలపాలయ్యాయి. చదవండి: ఫ్రస్ట్రేషన్ ట్వీట్లపై సారీ! -
‘చిన్నదానివి అయినా చాలా గొప్పగా చెప్పావ్’
లండన్: మన దేశంలో కులం, మతం, ప్రాంతం పేరుతో తన్నుకు చస్తూంటే.. విదేశాల్లో జాత్యాంహకార దాడులు జరుగుతుంటాయి. రంగు, దేశం పేరుతో విదేశాల్లో ఉన్న భారతీయులు వేధింపులకు గురవుతుంటారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి బ్రిటన్‌లో చోటు చేసుకుంది. పదేళ్ల బ్రిటీష్ సిక్కు విద్యార్థిని జాత్యాంహకార దూషణలు ఎదుర్కొంది. అయితే చాలా మంది లాగా ఆ చిన్నారి బాధపడుతూ కూర్చోలేదు. తనను కామెంట్ చేసినవారినే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారి నోరు మూతపడేలా.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను ట్విట్ చేసింది. బ్రిటీష్ సిక్కు విద్యార్థిని పదేళ్ల మున్సిమర్ కౌర్ కొద్ది రోజుల క్రితం అమ్యూజ్మెంట్ పార్కులో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వీడియోలో చెప్పుకొచ్చింది. ‘కొద్ది రోజుల క్రితం నేను ఓ అమ్యూజ్మెంట్ పార్క్‌కు వెళ్లాను. నా ఫేవరెట్ గేమ్ ఆడదామని వెళ్లి చూస్తే.. అక్కడ చాలా మంది జనాలున్నారు. అప్పుడు అక్కడే ఉన్న 14-17 ఏళ్ల వయసున్న కొందరు అమ్మాయిలు, అబ్బాయిల దగ్గరకు వెళ్లి.. నేను ఈ గేమ్ ఆడతా అని చెప్పా. అప్పుడు వారు పెద్దగా నవ్వుతూ.. నువ్వు ఆడకూడదు.. నువ్వు ఉగ్రవాదివి అంటూ నన్ను కామెంట్ చేశారు. ఆ మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. కానీ దాన్ని బయట పడనీయకుండా.. తలెత్తుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది. Racist Park @GLL_UK My eldest daughter Munsimar Kaur, aged 10, tells her own true story. Today it was my child tomorrow it could be yours. #sikh pic.twitter.com/NwR4iFUUE7 — Sikh Dad (@sikhdad) August 8, 2019 ‘మరుసటి రోజు కూడా అదే పార్క్‌కు వెళ్లాను. అక్కడ నేను నా వయసు పాపతో ఆడుకుంటున్నాను. కాసేపటి తర్వాత ఆ పాప వాళ్ల అమ్మ తనను పిలిచి.. నాతో ఆడకూడదని.. నేను చాలా ప్రమాదకర వ్యక్తినని చెప్పింది. కానీ ఆ పాప వాళ్ల అమ్మ మాటల్ని కొట్టి పారేస్తూ.. తల్లి తరఫున తను నాకు క్షమాపణలు చెప్పింది. ఈ రెండు సంఘటనలు చూశాక జనాల అమాయకత్వం చూసి నాకు జాలేసింది. వీరికి సిక్కుల గురించి అసలు ఏమి తెలియదు. మేము ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం.. చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. మీకు ఈ విషయాల గురించి తెలియక మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు’ అని మున్సిమర్ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాక ‘అయితే ఒక్క విషయం గమనించండి.. అందరూ ధైర్యవంతులే ఉండరు. మీ మాటలు విన్న తర్వాత కూడా ధైర్యంగా ముందుకు సాగిపోవడం.. లేదా వారి తల్లిదండ్రులతో ఈ విషయాల గురించి చర్చించడం వంటి పనులు అందరూ చేయలేరు. దయచేసి మనుషుల్ని ఇలా బాధపెట్టకండి. అలానే ఇలాంటి విమర్శలు ఎదురైనప్పుడు ధైర్యంగా తలెత్తుకు ముందుకు సాగండి.. ఏదో రోజు వారే అర్ధం చేసుకుంటారు’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. మున్సిమర్ కౌర్ తండ్రి ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. చిన్న దానివి ఐనా చాలా గొప్పగా చెప్పావ్.. నీ మాటలు ఎందరికో స్ఫూర్తినిస్తాయి అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. -
'చింగ్ చాంగ్' అన్నందుకు జాబ్ ఊడింది!
న్యూయార్క్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అక్కడ జాతి విద్వేష ఘటనలు తీవ్రమవుతున్నాయి. తాజాగా న్యూయార్క్‌లో అలాంటి ఘటన చోటుచేసుకుంది. జాత్యహంకారాన్ని ప్రదర్శించిన అమెరికన్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ వివరాలివి.. ఆసియాకు చెందిన వ్యక్తి మనహట్టన్ ఈస్ట్ విలేజ్‌లో కార్నర్‌స్టోన్ కేఫ్ అనే రెస్టారెంట్‌కు వెళ్లాడు. అతడు తనకు కావలసిన ఐటమ్స్ ఆర్డర్ చేయగా.. రెస్టారెంట్ లోని ఓ వెయిటర్ కస్టమర్ పేరుకు బదులుగా 'చింగ్ చాంగ్' అని రాశాడు. ఈ విషయాన్ని రెస్టారెంట్ మేనేజర్ రాక్కో దృష్టికి కస్టమర్ తీసుకెళ్లాడు. ఇది కచ్చితంగా జాతి విద్వేష చర్య అని వివరించి, తనకు అవమానం జరిగిందని వాపోయాడు. కస్టమర్‌ను అవమానించాడన్న కారణంగా వెయిటర్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు మేనేజర్ రాక్కో తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అసలు వివాదమేంటి.. తన స్నేహితుడి కుటుంబం రెస్టారెంట్‌కు వెళ్లగా కస్టమర్ పేరుకు బదులుగా చింగ్ చాంగ్ అని రాశారని జిగ్గి చౌ అనే యువకుడు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. బిల్లు పేపర్‌పై చింగ్ చాంగ్ ఉన్నట్లు ఓ ఫొటోను పోస్ట్ చేయడంతో ఈ జాతి విద్వేష చర్య విషయం వెలుగుచూసింది. దీనిపై స్పందించిన యాజమాన్యం వెయిటర్ చేసిన తప్పిదాన్ని గుర్తించి ఫేస్బుక్ ద్వారా క్షమాపణ చెప్పడంతో పాటు అతడిని జాబ్ నుంచి తొలగించినట్లు మేనేజర్ వివరించారు. సాధారణంగా చైనా భాషను, చైనీయులను గేలీ చేయడానికి చింగ్ చాంగ్ అనే పదాలు వాడతారన్న విషయం తెలిసిందే.