వెంకటేశ్వరుడిగా దర్శనమిచ్చిన సౌరబ్
అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడి సాయి లాంటి భక్తి రస చిత్రాలను అందించిన నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్లో మరో భక్తి రస చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పరమ భక్తుడు హథీరాం బాబా జీవితకథ ఆధారంగా సినిమా రూపొందించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
సాక్ష్యాత్తు శ్రీనివాసుడితో పాచికలాడిన పరమ భక్తుడు హథీరాం బాబా కథతో సినిమా అంటే ఆ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర కూడా చాలా సమయం తెర మీద కనిపిస్తోంది. అందుకే ఆ పాత్రలో కనిపించే నటుడి ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో అన్నమయ్య, శ్రీ రామదాసు సినిమాల్లో సుమన్ దేవుడి పాత్రలో కనిపించగా కొత్త సినిమా కోసం ఓ ఉత్తరాది నటుణ్ని తీసుకున్నారు.
పలు హిందీ సీరియల్స్‌లో శ్రీమహావిష్ణువు, కృష్ణుడు, శ్రీ రాముడి పాత్రల్లో కనిపించిన సౌరభ్ రాజ్ జైన్ ఓం నమో వెంకటేషాయలో వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తున్నాడు. సినిమా రిలీజ్ లోపు సౌరబ్ ను తెలుగు ప్రేక్షకులకు అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టీజర్ లో అతని లుక్ ను మాత్రమే రివీల్ చేశారు. హీరో నాగార్జున ఒక్క ఫ్రేమ్ లో కూడా కనిపించని టీజర్ నాగ్ అభిమానులకు నిరాశకలిగించినా.. వెంకటేశ్వరుడిగా సౌరబ్ లుక్ మాత్రం సినిమా మీద అంచనాలను పెంచుతోంది.
నాగార్జున సినిమా కోసం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు బుల్లి తెర మీదే కనిపించిన సౌరభ్‌కు తొలిసారిగా సినిమా అవకాశం రావటం పై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. త్వరలో సౌరభ్ క్యారెక్టర్‌పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.