ర్యాగింగ్ సాంఘిక దురాచారం
రిమ్స్‌క్యాంపస్: ర్యాగింగ్‌కు దూరంగా విద్యార్థులు ఉండాలని రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ టి.జయరాజ్ అన్నారు. ర్యాగింగ్ అనేది సాంఘిక దురాచారమని, దీనికి కఠిన శిక్షలు ఉన్నాయన్నారు. రిమ్స్ వైద్య కళాశాల సమావేశ మందిరంలో యాంటీ ర్యాగింగ్ సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు ఉన్నాయని, జైలు శిక్ష పడే అవకాశముందన్నారు. ఇదే జరిగితే విద్యార్థులు అమూల్యమైన భవిష్యత్‌ను కోల్పోతారన్నారు. ర్యాగింగ్ అనే సాంఘిక దురాచారానికి విద్యార్థులు దూరంగా ఉండాలని హితవు పలికారు.