raiding
-
లాడ్జిలో రిమాండ్ ఖైదీ సరసాలు
హుబ్లీ: పేరుమోసిన నేరగాడు, విచారణ ఖైదీ లాడ్జిలో ప్రేయసితో ఉండగా పోలీసులు దాడి చేశారు. వివరాలు... బచ్చా ఖాన్ అనే వ్యక్తిపై అనేక కేసులు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో బళ్లారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధార్వాడలో మరో కేసు విచారణ కోసం శనివారం తీసుకెళ్లారు. అదే అదనుగా అతడు రాత్రికి ప్రియురాలిని ఓ లాడ్జికి పిలిపించి, తానూ అక్కడే మకాం వేశాడు. ఇందుకు ఎస్కార్టుగా వచ్చిన బళ్లారి పోలీసులు తమవంతు సహకారం అందించారు. దీన్ని పసిగట్టిన ధార్వాడ పోలీసులు తక్షణమే సదరు లాడ్జిపై దాడి చేసి బచ్చాఖాన్‌ను ధార్వాడ విద్యానగర్ స్టేషన్‌కు పట్టుకెళ్లారు. నిందితునితో చేయి కలిపారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో బళ్లారి ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ యోగీష్ ఆచారి, పోలీస్ కానిస్టేబుళ్లు శివకుమార్, రవికుమార్, సంగమేశ కాళగిలను బళ్లారి జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. లాడ్జి పై దాడి సమయంలో బచ్చా ఖాన్ తప్పించుకోవడానికి ప్రయతి్నంచాడని తెలిసింది. (చదవండి: ఏడాదిలో రూ.60,414 కోట్ల సైబర్ మోసాలు) -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
కర్నూలు: కర్నూలు నగరం మాధవీనగర్ శివారులోని స్టేట్‌బ్యాంక్ కాలనీలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మూడో పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. డోన్ మండలం ఆవులదొడ్డి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, కీర్తి కలిసి కొంత కాలంగా స్టేట్ బ్యాంక్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచార గృహం నడుపుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మూడో పట్టణ పోలీసులు దాడి చేసి నిర్వాహకుడు వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. అలాగే విటుడు జాకీర్‌హుసేన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు, ఆళ్లగడ్డ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వారి చేత వ్యభిచారం చేయిస్తున్నట్లు విచారణలో తేలింది. మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిర్వాహకుడు వెంకటేశ్వర్లుతో పాటు కీర్తిపై కేసు నమోదు చేశారు. అయితే కీర్తి పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నమ్మించి మోసం చేశాడని యువతి ఫిర్యాదు మిడుతూరు: పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని మిడుతూరు ఎస్సీకాలనీకి చెందిన అహల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి కొన్నాళ్లుగా మొహం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ చెన్నయ్య ఆదివారం తెలిపారు. చదవండి: వ్యభిచారం చేయకపోతే చంపేస్తామంటూ... విషాదం: క్షణికావేశం..తీసింది ప్రాణం.. -
లాక్డౌన్లో నటి జాలీ రైడ్, గాయాలు
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్‌తో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో కన్నడ నటి తన స్నేహితుడితో ఖరీదైన కారులో జాలీరైడ్‌కు వెళ్లి ప్రమాదానికి గురైంది. కారు వంతెన పిల్లర్‌కు ఢీకొంది. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ నటి షర్మిలా మాండ్రే ఆమె స్నేహితుడి లోకేష్ వసంత్‌తో కలిసి శనివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తన జాగ్వర్ కారులో జాలీ రైడ్‌కు బయలుదేరారు. వసంతనగర్‌లో కారును అతి వేగంతో నడపడంతో అదుపుతప్పి అండర్‌పాస్ పిల్లర్‌ను ఢీకొన్నారు. దీంతో షర్మిల ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె స్నేహితుడికి కాలు విరిగింది. ప్రమాదం నుంచి బయటపడి తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. దీంతో పోర్టిస్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకుని వెళ్లిపోయారు. (ఫోన్ సిగ్నల్స్ ద్వారా కరోనా?) కాగా లాక్డౌన్ సమయంలో బాధ్యతను విస్మరించిన షర్మిల చర్యలను పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. ‘సీట్ బెల్ట్ వేసుకోని కారణంగా ఎయిర్ బ్యాగ్ తెరుచుకోలేదు. లాక్డౌన్ నియమాలను ఉల్లంఘించి ఇంటి నుండి బయట రావటమే తప్పు. ఆస్పత్రి నుండి పరారీ కావటం మరో తప్పు’ అని విమర్శిస్తున్నారు. కాగా షర్మిల, ఆమె స్నేహితుడు తాగి డ్రైవింగ్ చేశారా లేక వేగంగా వెళ్లి ఢీకొన్నారా?. ప్రమాద సమయంలో ఎవరు డ్రైవింగ్ చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైగ్రౌండ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు పరారీలో ఉన్న వీరి కోసం గాలిస్తున్నారు. మరోవైపు షర్మిలపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసు జాయింట్ పోలీస్ కమిషనర్ రవికాంతెగౌడ తెలిపారు. (జనం చస్తుంటే ఈ వంటావార్పులేంటి: సానియా) -
ఐదు కిలోల గంజాయి పట్టివేత
పట్నంబజారు (గుంటూరు): ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ నేతల ఆనందరాజు ఆదేశాల మేరకు జిల్లాలో ఎకై ్సజ్ అధికారులు గంజాయి అమ్మకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక దాడులు చేస్తున్నారు. దానిలో భాగంగా గురువారం మాచర్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని దుర్గి మండలం అడిగొప్పుల గ్రామానికి చెందిన సంకురాత్రి రామాంజమ్మ, ఈశ్వరమ్మలను అదుపులోకి తీసుకుని వారి నుంచి 5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ జి.సూర్యనారాయణ, ఎసై ్స ప్రసన్నలక్ష్మీ, సిబ్బంది షేక్ బాబావలి, దాసు, సుశీలరావు, శ్రీనివాసరెడ్డి పాల్గోన్నారు. -
నెట్ సెంటర్లపై అధికారుల దాడి
రాజాం, న్యూస్‌లైన్: అనుమతి లేకుండా సినిమా పాటలు, వీడియో క్లిప్పింగులు డౌన్లోడ్ చేస్తున్న నెట్ సెంటర్లపై ఐఎంఏ సిబ్బంది దాడి చేసి నిర్వాహకులను పోలీసులకు అప్పగించారు. అనుమతి లేకుండా పాటలు డౌన్లోడ్ చేస్తున్నారన్న సమాచారం తెలియడంతో ఇండియన్ మ్యూజికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తరుపున వీవీ సూర్యనారాయణ, ఇతర సిబ్బంది పట్టణంలో ఎనిమిది షాపులపై మంగళవారం దాడులు చేశారు. రాజరాజేశ్వరి సెల్ సర్వీస్, వాగ్దేవి నెట్ కనెక్షన్, ఎస్ఆర్బీ సెల్పాయింట్, రాజ్ సెల్పాయింట్, జేఎస్ఆర్ కమ్యూనికేషన్స్, ఎస్ఎస్ఆర్ ఎంటర్‌ప్రైజస్, టీవీఆర్ మొబీకేర్, కృష్ణ సెల్పాయింట్ తదితర షాపులపై దాడులు చేసి పెన్ డ్రైవ్‌లు, చిప్డ్రైవ్లు, సీడీలు, సీజ్‌చేసి పోలీసులకు అప్పగించారు. వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై ప్రభాకరరావు తెలిపారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. -
తొలి వికెట్ పడింది
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులను ఇప్పటి వరకు హెచ్చరిస్తూ వచ్చిన కలెక్టర్ స్మితా సబర్వాల్ ఇక చర్యలకు ఉపక్రమించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొండాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హరిప్రసాద్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని శుక్రవారం ఆమె డీఎంహెచ్ఓ రంగారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. హరిప్రసాద్ సరిగా విధులకు హాజరు కాకపోవడంపై కొండాపూర్ వాసులు ఫిర్యాదులు చేయడంతో కలెక్టర్ అతని పనితీరుపై విచారణ జరిపించారు. గ్రామస్తుల ఆరోపణలు నిజమని తేలడంతో అతన్ని సరెండర్ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యుడి పోస్టు ఖాళీగా చూపిస్తూ కొత్త వైద్యాధికారిని నియమించేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓకు పంపిన ఆదేశాల్లో పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించనంటూ ఇప్పటికే తేల్చిచెప్పిన కలెక్టర్, డాక్టర్ హరిప్రసాద్‌ను సరెండర్ చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులందరికీ మరోసారి హెచ్చరికలు పంపారు