rail bhavan
-
కోవిడ్-19 బారిన రైల్‌భవన్ ఉద్యోగిని
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. సెంట్రల్ ఢిల్లీలోని రైల్ భవన్లో పనిచేసే ఓ ఉద్యోగినికి సోమవారం కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఇదే భవనంలో గత రెండు వారాలుగా ఐదు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇక మే 20న చివరిసారిగా ఆమె విధులకు హాజరైనట్టు సమాచారం. ఆమెతో కలిసి కార్యాలయ విధుల్లో పనిచేసిన 14 మంది అధికారులను హోం క్వారంటైన్‌కు పంపారు. గతంలో రైల్ భవన్లో పాజిటివ్ కేసులు నమోదవడంతో భవనంలో శానిటైజేషన్ చేపట్టేందుకు ఈనెల 14, 15 తేదీల్లో రైల్ భవన్‌ను మూసివేశారు. చదవండి : కోవిడ్-19 : ఎయిమ్స్ సీనియర్ ఉద్యోగి మృతి -
రైల్వే బాదుడు?
నిధుల కొరతతో ప్రయాణ చార్జీలు పెంచే యోచన ♦ 5% నుంచి 10% పెరిగే అవకాశం న్యూఢిల్లీ: ప్రయాణికులకు షాక్ ఇచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. నిధుల కొరత నేపథ్యంలో ప్రయాణ చార్జీలు పెంచాలని యోచిస్తోంది. రానున్న బడ్జెట్లో రైల్వే ప్రయాణికుల చార్జీలను 5 నుంచి 10 శాతం పెంచే అవకాశం ఉంది. ప్రయాణ, సరుకు రవాణా చార్జీల ద్వారా ఏటా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గడం, ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు రూ. 32 వేల కోట్ల అదనపు భారం పడిన నేపథ్యంలో ప్రయాణ చార్జీల పెంపు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు రైల్వే శాఖ వర్గాలు చెపుతున్నాయి. స్థూల బడ్జెట్ తోడ్పాటు కింద రైల్వేలకు ఇచ్చే నిధుల్లో 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక శాఖ రూ. 8 వేల కోట్ల మేరకు కోత విధించడమూ ఈ ప్రతిపాదనకు ఊతం ఇస్తోంది. అయితే ప్రయాణికుల చార్జీల, సరుకు రవాణా చార్జీల పెంపుతో పాటు పలు ప్రతిపాదనలు ఉన్నాయని, ఇప్పటి వరకూ దేనిపైనా తుది నిర్ణయం తీసుకోలేదని రైల్వే వర్గాలు చెపుతున్నాయి. ప్రయాణ చార్జీలు పెంచాలా లేదా అనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపాయి. అయితే బడ్జెట్లోనే చార్జీలు పెంచడం తప్పనిసరి కాదని, ఎప్పుడైనా చార్జీలు పెంచొచ్చన్నాయి. అయితే ఈ నెల 25న ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో ప్రయాణ చార్జీలు పెంచే అవకాశం ఉందని రైల్ భవన్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. మార్చిలో వేసవి సీజన్ ప్రారంభం కానుండటంతో ప్రయాణాల జోరు పెరిగే నేపథ్యంలో చార్జీలు పెంచి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నట్టు చెపుతున్నాయి. ప్రస్తుతం ఏసీ తరగతి చార్జీలు, సరుకు రవాణా చార్జీలు ఎక్కువగానే ఉన్నాయి. ఒకవేళ వీటి ధరలు పెంచినట్లయితే స్టీల్, సిమెంట్, కోల్, ముడి ఇనుము, ఎరువుల రవాణా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరి వరకూ ప్రయాణ చార్జీలు, సరుకు రవాణా చార్జీలు కలిపి రైల్వే శాఖ మొత్తం ఆదాయం రూ. 1,36,079.26 కోట్లు. ఇందులో సుమారు 3.77 శాతం తగ్గుదల నమోదైంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వా త 2014లో అన్ని రకాల ప్రయాణ చార్జీలను 14 శాతం పెంచింది. గత ఏడాది మరో పది శాతం పెంచింది. -
మోడీ వందరోజుల పాలనకు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ఆందోళన
న్యూఢిల్లీ: మోడీ వందరోజుల పాలనలోని లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా యూత్‌కాంగ్రెస్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఆందోళనలు నిర్వహించింది. ఆందోళనకు ‘వందరోజుల్లో మోడీ వైఫల ్యం’ పేరు కూడా పెట్టింది. ఎన్నికలకు ముందు మోడీ ఇచ్చిన హామీలేవి? మోడీ ప్రభుత్వం ఎన్ని హామీలను నెరవేర్చింది? అనే విషయాలను ఆందోళన ద్వారా ప్రజలకు వివరించి చెప్పాలని నిర్ణయించింది. అంతేకాక హామీలను నెరవేర్చని సంబంధిత నేతల కార్యాలయలను ముట్టడిస్తామని యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ సతావ్ తెలిపారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసం ముందు, కృషి భవన్ ఎదుట, రైల్‌భవన్ ఆవరణలో యూత్‌కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిం చారు. మరో రెండ్రోజులపాటు కూడా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని సతావ్ తెలిపారు. జంతర్‌మంతర్‌లో ఆందోళన నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని 20 రోజుల క్రితమే అనుమతి కోరామని, అందుకు అధికారులు తిరస్కరించడంతో రోడ్లపైకి రావాల్సి వచ్చిందని సతావ్ చెప్పారు. ట్విటర్ ద్వారా కూడా మోడీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రైల్‌భవన్ వద్ద ఆందోళన చేస్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీల తో విరుచుకుపడ్డారని, వందలమంది కార్యకర్తలను గాయపర్చారని, దీనిని తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. వందరోజుల్లో మోడీ చేయలేకపోయిన వంద పనుల గురించి మరింత ప్రచారం చేస్తామని చెప్పారు.