
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. సెంట్రల్ ఢిల్లీలోని రైల్ భవన్‌లో పనిచేసే ఓ ఉద్యోగినికి సోమవారం కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఇదే భవనంలో గత రెండు వారాలుగా ఐదు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇక మే 20న చివరిసారిగా ఆమె విధులకు హాజరైనట్టు సమాచారం. ఆమెతో కలిసి కార్యాలయ విధుల్లో పనిచేసిన 14 మంది అధికారులను హోం క్వారంటైన్‌కు పంపారు. గతంలో రైల్ భవన్‌లో పాజిటివ్ కేసులు నమోదవడంతో భవనంలో శానిటైజేషన్ చేపట్టేందుకు ఈనెల 14, 15 తేదీల్లో రైల్ భవన్‌ను మూసివేశారు.
Comments
Please login to add a commentAdd a comment