పై-లీన్ నేపథ్యం: దక్షిణ మధ్య రైల్వే హెల్ప్లైన్ల ఏర్పాటు
పై-లీన్ తుఫాను కారణంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని పలు రైళ్లు రద్దుకావడం, మరిన్ని రైళ్ల మార్గాల మార్పిడి తదితర కారణాల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రధాన స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. ముందుజాగ్రత్త చర్యగా 56 రైళ్లను రద్దుచేయగా, 16 రైళ్ల మార్గాలు మార్చామని, నాలుగైదు రైళ్లను పాక్షికంగా రద్దుచేశామని రైల్వే అధికారప్రతినిధి అనిల్ సక్సేనా తెలిపారు.
విజయవాడ, రాజమండ్రి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, మంచిర్యాల స్టేష్లలో ప్రయాణికుల కోసం వీటిని ఏర్పాటుచేశారు. ఆ నెంబర్లు ఇవీ.. విజయవాడ: 0866-2575038, రాజమండ్రి: 0883-2420541, 2420543, కాజీపేట: 0870-2548660, వరంగల్: 0870-2426232, ఖమ్మం: 08742-256025, మంచిర్యాల: 08736-250081