Railway Recruitment Board Exam
-
బీహార్‌లో ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఆందోళనలు
గయ: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ బీహార్ లో ఆందోళనలు మూడవ రోజు కూడా కొనసాగాయి. బుధవారం గయ నగరంలో ఉద్యోగార్థులు రైలుకు నిప్పు పెట్టారు. దాదాపు 200 మంది అభ్యర్థులు రైల్వే స్టేషన్ కు చేరుకొని ఆగి ఉన్న ఓ రైలును తగలబెట్టారు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు, గయా జిల్లా పోలీస్ యంత్రాంగం, నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని గయ ఎస్ఎస్పీ ఆదిత్యకుమార్ చెప్పారు. నిరసనకారులు నిప్పటించిన కోచ్ యార్డ్ లో ఖాళీగా నిలిపి ఉందని, అందుకే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో రాజేష్ కుమార్ తెలిపారు. బీహార్ లోని గయా, పాట్నా, నలంద, నవాదా, ఆరా, హాజిపూర్ ప్రాంతాల్లో వేలాది మంది నిరసనకారులు రైలు పట్టాలపై రైలు రోకో చేశారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలిపారు. నిరసనల కారణంగా అధికారులు కొన్ని రైళ్లు రద్దు చేశారు. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపారు. ఆర్‌ఆర్‌బిఎన్‌టిపిసి(నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి)లో ఉత్తీర్ణత సాధించిన వారికి మళ్లీ పరీక్షను నిర్వహించాలన్న రైల్వే నిర్ణయాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. లెవల్ 2 నుండి లెవల్ 6 వరకు 35,000 పోస్ట్‌లకు పైగా ప్రకటనలు చేసిన పరీక్షలకు దాదాపు 1.25 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్టిపిసి, లెవల్ 1 పరీక్షలను నిలిపివేత హింసాత్మక నిరసనల నేపథ్యంలో రైల్వే తన నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు (ఎన్టిపిసి), లెవల్ 1 పరీక్షలను నిలిపివేసింది. వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల (ఆర్ఆర్బి) కింద పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు, ఫెయిల్ అయిన వారి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదిక అందజేయనుంది. అభ్యర్థులు తమ సమస్యలు మరియు సూచనలను సంబంధిత వెబ్సైట్లో కమిటీకి తెలియజేయవచ్చని రైల్వే తెలిపింది. అభ్యంతరాలను తెలపడానికి మూడు వారాల సమయం ఇచ్చింది. ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం కమిటీ మార్చి 4లోపు రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేస్తుంది. నిరసనల సమయంలో విధ్వంసానికి, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిని రైల్వేలో ఎన్నటికీ రిక్రూట్ చేయకుండా నిషేధిస్తామని హెచ్చరిస్తూ రైల్వే ఒక సాధారణ నోటీసును జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వద్దు్ద అభ్యర్థులెవ్వరూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రిక్రూట్మెంట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న అభ్యర్థుల ఫిర్యాదులను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. కేంద్రం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. అభ్యర్థులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, తమ ఫిర్యాదులను అధికారికంగా ఉన్నత కమిటీకి అందించాలని సూచించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించినవారిపై చర్యలుంటాయని తెలిపారు. అణచివేత ధోరణి సరికాదు అభ్యర్థులపై ప్రభుత్వ అణచివేత ధోరణి సరికాదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారా వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ’సత్యాగ్రహ’ మార్గంలో చాలా శక్తి ఉందని, ఆందోళనలు శాంతియుత మార్గంలో చేయాలని ఉద్యోగార్థులకు ఆమె విజ్ఞప్తి చేశారు. -
రైల్వే పరీక్షా ఫలితాలపై నిరసన... ఏకంగా రైలుకే నిప్పుపెట్టారు
పట్నా: బిహార్‌లో నిరుద్యోగులు మరోసారి రెచ్చిపోయారు. ఈ క్రమంలో కొంత మంది విద్యార్థులు, ఆందోళన కారులు.. పెద్ద ఎత్తున గయా రైల్వేస్టేషన్ చేరుకున్నారు. ఆతర్వాత ఆగి ఉన్న ప్యాసింజర్ రైలుకు నిప్పుపెట్టారు. అంతటితో ఆగకుండా ప్రయాణిస్తున్న రైళ్లపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడి ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. పోలీసు అధికారుల ప్రకారం.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్‌టెక్నికల్ పాపులర్ (RRB-NTPC) సీబీటీ-1 పోస్టుల కోసం 2019లో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సదరు నోటిఫికేషన్లో ఒక దశ పరీక్ష మాత్రమే ఉందని తెలిపారు. కాగా, మొదటి దశకు సంబంధించి పరీక్ష ఫలితాలను జనవరి 15న వెల్లడించింది. అయితే, ఈ పరీక్షలలో పలు అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు నిరసనలు చేపట్టారు. కాగా, అభ్యర్థి ఉద్యోగం సాధించాలంటే.. రెండో దశ సీబీటీ కంప్యూటర్ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాలని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. రెండు దశల్లో పరీక్ష నిర్వాహణపై నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బిహర్ అంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. పట్నాలో నిరసన కారులు పెద్ద ఎత్తున రైల్వే ట్రాక్‌పై చేరుకుని నిరసనలు తెలిపారు. జెహనాబాద్‌లో రైలుపట్టాలపై మోదీ దిష్టిబొమ్మను దహనంచేసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే విధంగా, సీతామర్హి ప్రాంతంలోను ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. కాగా, నిరసన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు పలుచోట్ల గాల్లోకి కాల్పులు జరిపారు. నవాడా, ముజఫర్‌పూర్, సీతామర్హి, బక్సర్, భోజ్‌పూర్ జిల్లాలో నిరుద్యోగుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. అయితే, దీనిపై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ స్పందించింది. తాము.. నోటిఫికేషన్లోనే రెండో దశ వివరాలను కూడా తెలిపామని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరికి సబంధించి పరీక్షలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలపై అభ్యర్థుల ఆందోళలను పరిశీలించడానికి రైల్వేశాఖ ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అభ్యర్థులు తమ ఈ కమిటికి తమ ఫిర్యాదులను ఫిబ్రవరి 16 వరకు సమర్పించవచ్చని రైల్వే మంత్రిత్వశాఖ ట్విటర్ వేదికగా తెలిపింది. నిరసన కారుల ఆందోళన ప్రధానంగా ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌లోని ఆయా మార్గాల్లో ప్రభావం చూపింది. దాదాపు 25 కంటే ఎక్కువ రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పట్నాలో నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కూడా పట్నా రైల్వేస్టేషన్‌ను విద్యార్థులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. చదవండి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం తీపికబురు.. ఇక నుంచి.. -
ప్రయాణికులతో ఆర్ఆర్బీ అభ్యర్థుల ఘర్షణ
గుంటూరు వరకూ 15చోట్ల ఆగిన ఫలక్‌నుమా గుంటూరు: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షకు వెళ్లే అభ్యర్థులు, ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగింది. ఫలితంగా 15 చోట్ల రైలు నిలిచిపోయింది. వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు సెంటర్లలో ఆదివారం నిర్వహించిన ఆర్ఆర్బీ పరీక్ష రాసేందుకు పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి దాదాపు 50 వేల మంది అభ్యర్థులు వచ్చారు. ఉచిత పాస్‌లు, టికెట్లు విక్రయించిన రైల్వే శాఖ అభ్యర్థులకు అవసరమైన ప్రత్యేక రైళ్లను కానీ, ప్రత్యేక బోగీలను కానీ కేటాయించలేదు. వారంతా సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైల్లోని అన్ని బోగీల్లో కిక్కిరిసి ఎక్కారు. దీంతో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు రైలు ఎక్కేందుకు వీలు లేకపోయింది. నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల స్టేషన్లలో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులకు స్థానిక ప్రయాణికులకు మధ్య ఘర్షణ జరిగింది. పిడుగురాళ్లలో స్థానిక ప్రయాణికులపై ఇతర రాష్ట్రంనుంచి వచ్చిన అభ్యర్థులు రాళ్లతో దాడి చేశారని టికెట్ ఇన్స్పెక్టర్లు తెలిపారు. రైలు కిటీకీలు కూడా ధ్వంసమయ్యాయి. సికింద్రాబాద్ నుంచి గుంటూరు చేరేలోగా మార్గ మధ్యంలో 15 చోట్ల రైలు నిలిచిపోయింది. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు రైలు ఎక్కే వీలు లేక ఆయా స్టేషన్లలోనే నిలిచిపోయారు. రైల్వే పోలీసుల అభ్యర్థన మేరకు గుంటూరు సివిల్ పోలీసులు రైలు గుంటూరు రైల్వేస్టేషన్ చేరుకునే సరికి అప్రమత్తమయ్యారు. రైల్వే, సివిల్ పోలీసులు మోహరించి రిజర్వేషన్ బోగీల్లో రిజర్వేషన్ లేని వారిని దించేందుకు యత్నించినా కొంతవరకే సఫలీకృతులయ్యారు. గుం టూరు నుంచి రిజర్వేషన్ చేసుకున్న వారిని ఎక్కించలేకపోయారు. దీంతో ఆందోళనకు దిగారు. అనంతరం విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో పంపారు.