Rain Forest Research Institute
-
వైరల్ వీడియో: హడలెత్తించిన చిరుత.. 24 గంటల్లో 15 మందిపై దాడి..
-
హడలెత్తించిన చిరుత.. 24 గంటల్లో 15 మందిపై దాడి.. వీడియో వైరల్
దిస్పూర్: అస్సాంలో ఓ చిరుత హడలెత్తించింది. గత 24 గంటలుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అస్సాంలోని జోర్హాట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఇనుప కంచె దాడి జనావాసాల్లోకి వచ్చిన చిరుత.. రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివాసితులపై దాడి చేసింది. చిరుత వరుస దాడిలో 15 మంది గాయపడ్డారని జొర్హాట్ ఎస్పీ మోహన్ లాల్ మీనా తెలిపారు. వీరిలో ముగ్గురు అటవీ అధికారులతో సహా మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. చిరుత పరుగెత్తుతున్న దృశ్యాలను అటవీ శాఖ సిబ్బంది వీడియో తీశారు. ఇందులో చిరుత క్యాంపస్ చుట్టూ తిరుగుతూ, ముళ్ల కంచెపై దూకుతూ కనిపిస్తోంది. జనాలపై మాత్రమే కాకుండా రోడ్డుపై వెళ్తున్న కారుపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా జోర్హాట్ శివారల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. అక్కడి నుంచే చిరుతపులి క్యాంపస్‌లోకి చొరబడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అధికారులకు చిరుత చిక్కలేదు. చిరుతను పట్టుకుని బంధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, నివాసితులు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. చదవండి: Japan Snow Storm: జపాన్‌లో మంచు తుఫాన్ విధ్వంసం..17 మంది మృతి -
సిరిధాన్యాల వర్షాధార సాగుకు సమయమిదే!
ఔషధ గుణాలున్న సిరిధాన్యాల (అరిక, కొర్ర, అండుకొర్ర, సామ, ఊదల)కు గిరాకీ పెరుగుతుండటంతో వీటి సాగుపై మెట్ట రైతులు ఆసక్తి చూపుతున్నారు. రుతుపవనాల రాక కబురుతో ఈ ఐదు వర్షాధార ఆహార పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా వేంపల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్(98496 48498) అందించిన మెలకువలు ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం. అరికలు 6 నెలల పంట. ఆరుద్ర కార్తె దాటక ముందే విత్తుకోవాలి. 6 సాళ్లకు ఒక సాలు కంది, ఆముదం తదితర అంతరపంటలు కూడా విత్తుకోవచ్చని గత నెల 8న ‘సాగుబడి’లో చదువుకున్నాం. ఇక కొర్ర, అండుకొర్ర, సామ, ఊద పంటల సాగు సంగతులు ఇప్పుడు చూద్దాం. వర్షాధారంగా పండే ఈ పంటలను జూన్ ఆఖరులోగా విత్తుకోవాలి. 100–110 రోజుల్లో పూర్తయ్యే పంటలివి. కొంత మంది రైతులు కంగారు పడి 70–80 రోజులకు కోసేస్తున్నారు. యంత్రంతో పొట్టు తీసేటప్పుడు ఎక్కువగా నూక అవుతాయి. గింజ గట్టిపడే వరకు అంటే 100–110 రోజులు ఉంచితే ఈ సమస్య ఉండదు. ఈ ధాన్యాలను విత్తనపు గొర్రుతో విత్తుకోవడం మంచిది. గొర్రుతో సాళ్లుగా విత్తుకుంటే.. ఒకే లోతున విత్తనం పడుతుంది. ఒకేసారి గింజలన్నీ మొలుస్తాయి. ఒకేసారి వెన్ను వస్తుంది. అలాకాకుండా విత్తనాలు వెద జల్లితే విత్తనాలు ఒకే లోతులో పడవు కాబట్టి కొన్ని గింజలు పది రోజుల తర్వాత కూడా మొలుస్తూనే ఉంటాయి. గొర్రు అందుబాటులో లేని వారు వెదజల్లిన తర్వాత విత్తనాలపైకి మట్టి పడేలా ఫోర్స్‌గా దున్నాలి. ఎకరానికి అండుకొర్ర 2.5 కిలోలు, కొర్ర 3 కిలోలు, ఊదలు 3 కిలోలు, సామలు 6 కిలోల విత్తనాలు అవసరం. ఇవి చిన్న గింజలు కాబట్టి, ఒకేచోట కుప్పగా పడకుండా ఉండాలంటే.. కిలో విత్తనాలకు 9–10 కిలోల ఇసుక కలిపి విత్తుకోవాలి. చీడపీడల బెడద పెద్దగా లేదు. ముఖ్య విషయం ఏమిటంటే.. కొర్ర, అండుకొర్ర, సామ, ఊదలను ఖరీఫ్(వర్షాకాలపు)లో సాగు చేసే రైతులు.. అరికల్లో మాదిరిగా కంది తదితర దీర్ఘకాలిక అంతర పంటలు వేసుకోకుండా ఉంటేనే మంచిది. ఈ పంటలు కోసిన తర్వాత ఒకటి, రెండు తడులకు అవకాశం ఉంటే.. శనగ, పెసర, మినుము, ధనియాలు, వాము వంటి పంటలను రెండో పంటగా నెల రోజుల విరామం తర్వాత విత్తుకోవాలి. రెండో పంట వేసుకునే అవకాశం/ఆలోచన లేని రైతులైతే ఖరీఫ్‌లో ఈ పంటల్లో కూడా సిరిధాన్యాలు ఆరు సాళ్లు– ఒక సాలు కంది విత్తుకోవాలి. మరో ఆరుసాళ్ల సిరిధాన్యాల తర్వాత ఒక సాలులో ఆముదాలు, అనుములు, బొబ్బర్లు, గోగులు కలిపి విత్తుకోవచ్చు. -
ఉద్యోగ సమాచారం
ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్.. వివిధ విభాగాల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 64. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 25. వివరాలకు www.epi.gov.in/ recruitment_form.asp చూడొచ్చు. ఎన్ఐఎస్సీఏఐఆర్లో టెక్నీషియన్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ (ఎన్ఐఎస్సీఏఐఆర్).. వివిధ విభాగాల్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 4. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 23. వివరాలకు www.niscair.res.in చూడొచ్చు. ఇండియన్ మారిటైం యూనివర్సిటీలో అసిస్టెంట్స్ (ఫైనాన్స్) ఇండియన్ మారిటైం యూనివర్సిటీ.. అసిస్టెంట్స్ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11. 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. వయసు 35 ఏళ్లు మించరాదు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 18. వివరాలకు www.imu.edu.in చూడొచ్చు. నిమ్స్-హైదరాబాద్‌లో మెడికల్ ఆఫీసర్లు నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్)-హైదరాబాద్.. ఆరు నెలల వ్యవధికి మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వయసు 34 ఏళ్లకు మించరాదు. నవంబర్ 9న నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివరాలకు www.nims.edu.in చూడొచ్చు. ఎన్ఐటీ - హమీర్‌పూర్‌లో లెక్చరర్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) - హమీర్పూర్.. లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 4. నవంబర్ 18న నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివరాలకు www.nith.ac.in చూడొచ్చు. ఐసీఏఆర్-అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐసీఏఆర్- అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. కాంట్రాక్ట్ పద్ధతిన ఎస్ఆర్ఎఫ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. సీనియర్ రీసెర్చ్ ఫెలో (3 పోస్టులు), డేటా ఎంట్రీ ఆపరేటర్ (2 పోస్టులు). ఇంటర్వ్యూ తేదీలు నవంబర్ 16, 17. వివరాలకు www.zpdk.org.in చూడొచ్చు. రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అసోంలోని రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఫీల్డ్ అటెండెంట్, రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం పోస్టులు 6. ఇంటర్వ్యూ తేది నవంబర్ 23. వివరాలకు http://icfre.gov.in చూడొచ్చు. సీఆర్పీఎఫ్లో 570 కానిస్టేబుల్ పోస్టులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్).. స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) (ఖాళీలు -82), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) (ఖాళీలు -448) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వయసు 23 ఏళ్లకు మించరాదు. దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 30. వివరాలకు http://crpf.nic.in చూడొచ్చు.