ఉద్యోగ సమాచారం | Employment Information | Sakshi
Sakshi News home page

ఉద్యోగ సమాచారం

Published Thu, Nov 5 2015 5:06 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

Employment Information

ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్
 ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్.. వివిధ విభాగాల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 64. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 25. వివరాలకు www.epi.gov.in/ recruitment_form.asp చూడొచ్చు.

ఎన్‌ఐఎస్‌సీఏఐఆర్‌లో టెక్నీషియన్లు
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ (ఎన్‌ఐఎస్‌సీఏఐఆర్).. వివిధ విభాగాల్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 4. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 23. వివరాలకు www.niscair.res.in చూడొచ్చు.

 ఇండియన్ మారిటైం యూనివర్సిటీలో అసిస్టెంట్స్ (ఫైనాన్స్)
 ఇండియన్ మారిటైం యూనివర్సిటీ.. అసిస్టెంట్స్ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11. 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. వయసు 35 ఏళ్లు మించరాదు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 18. వివరాలకు www.imu.edu.in చూడొచ్చు.

నిమ్స్-హైదరాబాద్‌లో మెడికల్ ఆఫీసర్లు
 నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్)-హైదరాబాద్.. ఆరు నెలల వ్యవధికి మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వయసు 34 ఏళ్లకు మించరాదు. నవంబర్ 9న నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివరాలకు www.nims.edu.in చూడొచ్చు.

ఎన్‌ఐటీ - హమీర్‌పూర్‌లో లెక్చరర్లు
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) - హమీర్‌పూర్.. లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 4. నవంబర్ 18న నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివరాలకు www.nith.ac.in చూడొచ్చు.

ఐసీఏఆర్-అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
 ఐసీఏఆర్- అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. కాంట్రాక్ట్ పద్ధతిన ఎస్‌ఆర్‌ఎఫ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. సీనియర్ రీసెర్చ్ ఫెలో (3 పోస్టులు), డేటా ఎంట్రీ ఆపరేటర్ (2 పోస్టులు). ఇంటర్వ్యూ తేదీలు నవంబర్ 16, 17. వివరాలకు www.zpdk.org.in చూడొచ్చు.

రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో
 అసోంలోని రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఫీల్డ్ అటెండెంట్, రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం పోస్టులు 6. ఇంటర్వ్యూ తేది నవంబర్ 23. వివరాలకు http://icfre.gov.in చూడొచ్చు.

 సీఆర్‌పీఎఫ్‌లో 570 కానిస్టేబుల్ పోస్టులు
 సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్).. స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) (ఖాళీలు -82), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) (ఖాళీలు -448) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వయసు 23 ఏళ్లకు మించరాదు. దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 30. వివరాలకు http://crpf.nic.in చూడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement