బ్యాంక్ అకౌంట్ల గందరగోళం
=అందని నీలం నష్టపరిహారం
=ఆందోళనలో రైతాంగం
అనకాపల్లి, న్యూస్‌లైన్ : సాంకేతిక కారణాలతో రైతులు 14 నెలలుగా పంట నష్టపరిహారం అందుకోలేక పోతున్నారు. 2012 నవంబర్‌లో నీలం తుపానుకు అనకాపల్లి మండలం లో వెయ్యి హెక్టార్లలో వరి, చెరకు, అపరాలకు నష్టం వాటిల్లింది. సుమారు 10 వేల మంది వరకు రైతులు తుపాను కారణంగా నష్టపోయారని యంత్రాంగం అంచనా వేసిం ది. నష్టపరిహారం పంపిణీలో ఇదిగో, అదిగో అంటూ కా లం వెళ్లదీసిన అధికారులు ఇప్పుడు బ్యాంకు ఖాతాల గం దరగోళంతో తలపట్టుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం నీలం నష్టపరిహారాన్ని పంపిణీ చేశామని చెబుతున్నా ఇంకా అనకాపల్లి మండలంలో 2022 మందికి అందలేదు.
నష్టాన్ని అంచనా వేసిన రెవెన్యూ, వ్యవసాయశాఖలు బ్యాంకులకు అనుసంధానం చేసే విషయంలో సాంకేతిక అవరోధాలు తలెత్తాయి. నష్టపరిహారం పొందవలసిన రైతు పేర్లకు, బ్యాంక్ నుంచి జమ కావాల్సిన ఖా తాకు పొంతన లేకపోవడంతో అనకాపల్లి మండలంలో ఇంకా రూ. పాతిక లక్షల వరకు పంపిణీ కాలేదు. నీలం తు పాను నష్టానికి వెయ్యి హెక్టార్ల పరిధిలో రూ.కోటి వరకు నష్టపరిహారం విడుదలయింది.
అయితే 20 బ్యాంకుల ఖా తాలు పొంతనలేక సొమ్ము బ్యాంకులలో మూలుగుతోంది. బరోడా బ్యాంకులో 5 అకౌంట్లు, మహారాష్ట్ర 92, ఐడీబీఐ 132, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 18, ఫెడరల్ బ్యాంక్ 4, ఇండియన్ బ్యాంక్ 39, కెనరా 8, ఐసీఐసీఐ 14, ఐఓసీ 254, ఎస్బీహెచ్ 18, కనకమహాలక్ష్మి 7, కరూర్ వైశ్యా బ్యాంకు 29, ఓరియంటల్ 2, ఆంధ్రా బ్యాంక్ 615, గ్రామీణ వికాస్ బ్యాంక్ 403, ఇండియన్ బ్యాంక్ 6, ఐఎన్జీ వైశ్యా 6, సిండికేట్ 1, బ్యాంక్ ఆఫ్ ఇండియా 217 వెరసి 2022 ఖాతాలకు నష్టపరిహారం అందలేదు. తక్షణమే సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి సంక్రాంతికి ముందైనా పంట నష్టపరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.