raith bazaar
-
ఏపీలో మార్కెట్ యార్డుల్లోనూ రైతు బజార్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మార్కెట్ యార్డుల్లో శనివారం నుంచి రైతుబజార్లు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు యార్కెట్ యార్డుల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసింది. మార్కెట్ యార్డులోని గోడౌన్లు, ప్లాట్‌ఫారాలపై కూరగాయలు, పండ్లు విక్రయించేందుకు చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని 216 మార్కెట్ కమిటీల్లో 150 మార్కెట్ యార్డ్లు ఉండగా, ప్రస్తుతం ఈ యార్డుల్లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. వ్యవసాయ యార్డ్‌కు నిత్యం 200మంది వరకూ వస్తున్నట్లు అంచనా. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలకు అనువుగా ఉండేలా ఇక్కడే కొత్త రైతుబజార్లు ఏర్పాటు చేశారు. అలాగే కూరగాయలు, పండ్లను తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. (జనతా బజార్లలో ఆక్వా ఉత్పత్తులు) అలాగే గోడౌన్లు లేని యార్డుల్లో తాత్కాలికంగా షెడ్లు వేసి అమ్మకాలు ప్రారంభించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. అలాగే తాత్కాలిక రైతు బజార్ల సంఖ్యను 417కు పెంచింది. అంతేకాకుండా మొబైల్ రైతుబజార్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. అవసరం అయిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో కూడా రైతు బజార్లు నిర్వహిస్తోంది. (కేసులు ఎక్కువున్న చోట కఠినంగా..) వంద యార్డుల గుర్తింపు రాష్ట్రంలోని 216 మార్కెట్ కమిటీల పరిధిలో 150 మార్కెట్ యార్డులు ఉన్నాయి. సౌకర్యాలున్న 100 యార్డులను అధికారులు గుర్తించారు. వాటిలో ఇవాళ్టి నుంచి అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ఈ యార్డుల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. వీటికి రైతులు, హమాలీలు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది కలిపి రోజుకు సగటున 200 మంది వరకు వస్తున్నట్లు అంచనా. వీరితోపాటు పరిసర ప్రాంతాల వినియోగదారులకు ఇవి ఉపయోగపడతాయి. కరోనా వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే.. ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు మార్కెట్ కమిటీల పరిధిలో ఉండే మేజర్ పంచాయతీల్లోనూ అక్కడి పరిస్థితులను బట్టి రైతు బజార్లు ఏర్పాటు కానున్నాయి. అందుబాటులోకి మొబైల్ బజార్లు కరోనా వైరస్‌కు ముందు రాష్ట్రంలో 100 రైతు బజార్లు ఉండేవి. తర్వాత తాత్కాలిక రైతు బజార్ల ఏర్పాటు ద్వారా వాటి సంఖ్యను 417కు పెంచారు. వీటికి అధిక సంఖ్యలో కొనుగోలుదారులు వ స్తుండటంతో మొబైల్ రైతు బజార్ల విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం 451 మొబైల్ రైతు బజార్లు పని చేస్తున్నాయి. ఇందు కు ఆర్టీసీ బస్సులను కూడా వాడుతున్నారు. -
ఏపీలో కూరగాయల రవాణాకు అనుమతి
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రకటించిన లాక్‌డౌన్‌తో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న పూలు, పండ్లు, కూరగాయలు, మిర్చి, పసుపు రైతులకు ఊరట లభించింది. ఈ పంటల రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎటువంటి ఆటంకం కలుగకుండా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు ఇచ్చే ఉత్తర్వులు కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం మరోసారి ఆదేశించింది. (లాక్డౌన్: వైరస్ కంటే మరింత ప్రమాదకరం!) లాక్డౌన్ నుంచి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లకు మినహాయింపు ఇచ్చినప్పటికీ రవాణాలో చాలా చోట్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌధురి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఉద్యాన పంటల రవాణా, ఎగుమతి, శుద్ధి, సేకరణ, రైతు బజార్లకు, స్థానిక మార్కెట్లకు తరలింపు వంటి వాటికి గతంలో మినహాయింపు ఇచ్చినా సక్రమంగా అమలు కావడంలేదని, మరోసారి జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు ఇస్తూ ఈ మినహాయింపులు అమలయ్యేలా చూడాలని కోరారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆమోదం తెలిపాయి. దీంతో జిల్లాలలో వ్యవసాయ ఉత్పత్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ చిరంజీవి చౌధురి జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు. (కరోనాతో యుద్ధం : ప్రభుత్వానికి సహకరించండి) లేఖలో అంశాలు.. ► రాష్ట్రంలో రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి పండ్లు, కూరగాయలు సేకరించి రవాణా చేసుకునేందుకు ఐఎన్ఐ ఫారమ్స్, దేశాయ్ ఫ్రూట్స్, ఐటీసీ ఇండియా లిమిటెడ్, మహీంద్రా, జైన్ ఇరిగేషన్ ఇండియా లిమిటెడ్, నింజా కార్ట్ తదితర సంస్థలకు అనుమతి ► రాష్ట్ర వ్యాప్తంగా మామిడి కాయల సేకరణ, ఎగుమతులకు అనుమతి ఇచ్చి పచ్చి సరుకు చెడిపోకుండా చూడాలి ► చిత్తూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఇతర జిల్లాలలో పండ్లు, కూరగాయల శుద్ధి పరిశ్రమలకు అనుమతి ► గుంటూరు, కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలతో పాటు పాడేరు ప్రాంతంలో మిర్చి, పసుపు సేకరణ, రవాణాకు అనుమతి ► కర్నూలు, ప్రకాశం జిల్లాలలో విత్తన శుద్ధి పరిశ్రమలకు అనుమతి ఇచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటే రవాణాకు అనుమతించాలి. ► ఖరీఫ్ సీజన్‌కు టిష్యూ కల్చర్ ప్లాంటింగ్ మెటీరియల్‌కు, సూక్ష్మనీటి పారుదల సామగ్రి రవాణాకు అనుమతించాలి. మొబైల్ రైతు బజార్లుగా సిటీ బస్సులు లాక్డౌన్ నేపథ్యంలో ప్రజల చెంతకే కూరగాయలను తీసుకెళ్లేందుకు నగరాల్లో సిటీ బస్సుల్ని మొబైల్ రైతు బజార్లుగా తిప్పాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం 200 బస్సులు కావాలని మార్కెటింగ్, ఉద్యాన శాఖ, మున్సిపల్ శాఖలు ఆర్టీసీకి ప్రతిపాదనలు పంపించాయి. ప్రయోగాత్మకంగా విజయవాడలో ఐదు సిటీ బస్సులను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినియోగించుకుని ఒక్క రోజులో పది క్వింటాళ్ల కూరగాయలు అమ్మారు. ఈ విధానం విజయవంతం కావడంతో విశాఖ, తిరుపతి, గుంటూరు తదితర నగరాల్లో కూడా ఇదే విధంగా సిటీ బస్సునే ప్రాంతాల వారీ తిప్పుతూ కూరగాయలను అమ్మితే ప్రజల్ని రోడ్లపైకి తిరగనివ్వకుండా కట్టడి చేయవచ్చని అధికార యంత్రాంగం భావిస్తోంది. జిల్లాల వారీగా ఎన్ని బస్సులు కేటాయించాలనే అంశంపై ఈ నెల 6న ఆర్టీసీ అధికారులు, మార్కెటింగ్, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం కానున్నారని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్పారు. రైతులకు అనుమతి పత్రాలు.. పూలు, పండ్లు, కూరగాయల సాగు రైతులు ఎవరైనా స్థానిక మార్కెట్లలో తమ ఉత్పత్తులు అమ్ముకోవాలనుకుంటే తమ శాఖ అధికారులు అనుమతి పత్రాలు, పాస్‌లు అందజేస్తారని ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఏ పంట అమ్ముకోవాలనుకుంటున్నారో తెలిపితే తమ అధికారులే తోటల వద్దకు వెళ్లి పాస్‌లు ఇస్తారని, దీనివల్ల రవాణాకు ఎటువంటి ఆటంకం ఉండదని వివరించారు. జొన్న, మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం రాష్ట్రంలో 3.64 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 1.50 లక్షల మెట్రిక్ టన్నుల జొన్నలు కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదనరెడ్డి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. శుక్రవారం (నిన్న) నుంచి జూన్ 16 వరకు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ► రైతుల నుంచి వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, మార్కెటింగ్ సొసైటీలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో ఈ పంటను కొనుగోలు చేసేందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ► మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.1,760, హైబ్రిడ్ జొన్నకు రూ.2,550ని మద్దతు ధరగా నిర్ణయించినట్టు తెలిపారు. -
విశాఖ రైతు బజార్లలో మంత్రులు తనిఖీలు
విశాఖ : విశాఖలోని రైతు బజార్లలో మంత్రులు బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తూనికలతో పాటు, ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లలో పేరుకున్న వ్యర్థాలను తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే అక్కడ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్ల తనిఖీల్లో మంత్రులు పి. నారాయణ, గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు తదితరులు ఉన్నారు. -
రైతు బజార్ల వద్ద క్యూ కట్టిన జనాలు
విజయనగరం : విజయనగరం జిల్లాలో నిత్యవసర వస్తువుల కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. నిత్యావసరాల వస్తువులు, కూరగాయల కోసం జనాలు రైతు బజార్ల వద్ద బారులు తీరారు. మరోవైపు బాధితుల అవసరాలను పలువురు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. నిత్యావసరాలను బ్లాక్ చేసి, అధిక ధరలకు విక్రయించి అడ్డగోలుగా సొమ్ము చేసుకున్నారు. విజయనగరంలో ఇంకా విద్యుత్ పునరుద్ధరణ కాలేదు. కేవలం 25 శాతమే విద్యుత్‌ను పునరుద్ధరించారు. దాంతో చాలా గ్రామాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. ఇక తుఫాను విధ్వంసం ముగిసి ఏడు రోజులు గడుస్తున్నా బాధితులకు మాత్రం సాయం అంతంత మాత్రంగానే ఉంది. తుపాను బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కనీసం బియ్యం కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయలేకపోతోంది. మొదట్లో 5 లక్షల బాధిత కుటుంబాలకు నిర్ణయించిన మేరకు సరుకులన్నీ ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించినా ఆ మేరకే సేకరణ చేయలేదు. ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందించ కపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.