ఏపీలో మార్కెట్‌ యార్డుల్లోనూ రైతు బజార్లు  | Coronavirus: Rythu Bazaars at Market Yards In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో మార్కెట్‌ యార్డుల్లోనూ రైతు బజార్లు 

Published Sat, Apr 25 2020 11:31 AM | Last Updated on Sat, Apr 25 2020 1:25 PM

Coronavirus: Rythu Bazaars at Market Yards In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మార్కెట్‌ యార్డుల్లో శనివారం నుంచి రైతుబజార్లు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు యార్కెట్‌ యార్డుల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసింది. మార్కెట్‌ యార్డులోని గోడౌన్లు, ప్లాట్‌ఫారాలపై కూరగాయలు, పండ్లు విక్రయించేందుకు చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని 216 మార్కెట్‌ కమిటీల్లో  150 మార్కెట్‌ యార్డ్‌లు ఉండగా, ప్రస్తుతం ఈ యార్డుల్లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. వ్యవసాయ యార్డ్‌కు నిత్యం 200మంది వరకూ వస్తున్నట్లు అంచనా. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలకు అనువుగా ఉండేలా ఇక్కడే కొత్త రైతుబజార్లు ఏర్పాటు చేశారు. అలాగే కూరగాయలు, పండ్లను తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. (జనతా బజార్లలో ఆక్వా ఉత్పత్తులు)

అలాగే గోడౌన్లు లేని యార్డుల్లో తాత్కాలికంగా షెడ్లు వేసి అమ్మకాలు ప్రారంభించాలని మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది. అలాగే తాత్కాలిక రైతు బజార్ల సంఖ్యను 417కు పెంచింది. అంతేకాకుండా మొబైల్‌ రైతుబజార్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. అవసరం అయిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో కూడా రైతు బజార్లు నిర్వహిస్తోంది. (కేసులు ఎక్కువున్న చోట కఠినంగా..)

వంద యార్డుల గుర్తింపు 

  • రాష్ట్రంలోని 216 మార్కెట్‌ కమిటీల పరిధిలో 150 మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. సౌకర్యాలున్న 100 యార్డులను అధికారులు గుర్తించారు.  
  • వాటిలో ఇవాళ్టి నుంచి అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ఈ యార్డుల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి.  
  • వీటికి రైతులు, హమాలీలు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది కలిపి రోజుకు సగటున 200 మంది వరకు వస్తున్నట్లు అంచనా. వీరితోపాటు పరిసర ప్రాంతాల వినియోగదారులకు ఇవి ఉపయోగపడతాయి.  
  • కరోనా వైరస్‌ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే.. ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు 
  • మార్కెట్‌ కమిటీల పరిధిలో ఉండే మేజర్‌ పంచాయతీల్లోనూ అక్కడి పరిస్థితులను బట్టి రైతు బజార్లు ఏర్పాటు కానున్నాయి.   అందుబాటులోకి మొబైల్‌ బజార్లు 
  • కరోనా వైరస్‌కు ముందు రాష్ట్రంలో 100  రైతు బజార్లు ఉండేవి. తర్వాత తాత్కాలిక రైతు బజార్ల ఏర్పాటు ద్వారా వాటి సంఖ్యను 417కు పెంచారు.  
  • వీటికి అధిక సంఖ్యలో కొనుగోలుదారులు వ స్తుండటంతో మొబైల్‌ రైతు బజార్ల విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం 451 మొబైల్‌ రైతు బజార్లు పని చేస్తున్నాయి. ఇందు కు ఆర్టీసీ బస్సులను కూడా వాడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement