raithu yatra
-
‘చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ చేశారా’
సాక్షి, అమరావతి: 2014లో టీడీపీ కోసం పని చేసిన జనసేన, అప్పటి టీడీపీ హయాంలో రైతుల పట్ల వ్యవహరించిన తీరు ఎలా ఉందో చెప్పాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో రైతులను నట్టేట ముంచారని, ఆ విషయాన్ని పవన్ మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. రైతులను దగా చేసిన ఘనత చంద్రబాబు, పవన్‌కే దక్కుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రైతు రుణమాఫీ చేస్తామని అప్పట్లో హామి ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు. మేము 12500 రైతు భరోసా ఇస్తామని 13500 ఇస్తున్నాం.. ఇచ్చిన మాట కన్నా ఎక్కువ ఇచ్చి అంకితభావంతో పనిచేస్తున్నామని, నిజమైన రైతు ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమని కొనియాడారు. -
‘చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే పవన్ రైతు యాత్రలు’
సాక్షి, అమరావతి: పవన్ కల్యాణ్ ఏపీకీ గెస్ట్ ఆర్టిస్ట్ అని.. పొలిటీషియన్‌గా ఎవరూ అనుకోవటం లేదని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల క్రితం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని వేరే రాష్ట్రం వెళ్లిపోయిన పవన్, మళ్లీ ఇప్పుడు వచ్చి రైతు భరోసా యాత్ర అంటున్నాడని మండిపడ్డారు. చివరికి ఆ కార్యక్రమం పేరును కూడా మా పార్టీ నుంచి కాపీ కొట్టాడని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడని అందరికీ తెలుసు, ఇప్పుడు కూడా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే రైతు యాత్రలు చేస్తానంటున్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతున్న పవన్.. ఇంకా బీజేపీతో ఎందుకు ప్రయాణం చేస్తున్నాడో చెప్పాలని ప్రశ్నించారు. పవన్‌కు అంత చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీజేపీ నుంచి బయటకు రావాలని వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. -
‘రియల్ ఎస్టేట్ సభ’
సాక్షి, అమరావతి: తిరుపతిలో అమరావతి రైతుల పేరుతో టీడీపీ రాజకీయ సభ నిర్వహిస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అది రైతుల సభ కానే కాదని, ముమ్మాటికీ టీడీపీ నిర్వహిస్తున్న రాజకీయ సభే అని స్పష్టం చేశారు. ఇంకా దోబూచులాట, దొంగాట ఎందుకు? టీడీపీ అజెండాతోనే సభ నిర్వహిస్తున్న విషయాన్ని చంద్రబాబు బహిరంగంగా చెప్పాలని సూచించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, ఓ సామాజికవర్గ దోపిడీ కోసమే సభ తలపెట్టారని చెప్పారు. సాగు నీటి ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన వేలాది మంది రైతులది త్యాగమా? లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇచ్చిన వారిది త్యాగమా? అని ప్రశ్నించారు. ఓ సామాజికవర్గం దోపిడీ కోసం చేస్తున్నది త్యాగమా?.. చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక్క రైతైనా వచ్చారా? రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాలు మినహా మిగిలిన 13 జిల్లాలతో తమకు సంబంధం లేదని తిరుపతి సభలో చంద్రబాబు ప్రకటించగలరా? అని బొత్స ప్రశ్నించారు. ‘పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు మినహా స్వచ్ఛందంగా ఏ ఒక్క రైతైనా వచ్చారా? టీడీపీ అజెండాతో, చంద్రబాబు అజెండాతో సభ నిర్వహిస్తున్నట్లు అచ్చెన్నాయుడు అంగీకరిస్తే బాగుండేది. సభను అడ్డుకునేందుకు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు కుట్రలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించడం హాస్యాస్పదం. పరిపాలనా రాజధానిగా విశాఖ వద్దని ఉత్తరాంధ్రవాసులు ఎవరు చెప్పారో వెల్లడించాలి. అల్లర్లు సృష్టించాల్సిన అవసరం ఎవరికి ఉందో ప్రజలు గమనించాలి. వారే అల్లర్లు సృష్టించి ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది’ అని బొత్స పేర్కొన్నారు. ప్రధాని ఏమన్నారో గుర్తుందా? న్యాయస్థానం టూ దేవస్థానం అని పేరు పెట్టుకుని స్వీయ అభివృద్ధి కోసం పాదయాత్ర చేశారని బొత్స చెప్పారు. అమరావతి గురించి బీజేపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల ముందు సాక్షాత్తూ ప్రధానే అమరావతి ఒక అవినీతి కూపం అని, పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ మేనిఫెస్టోలో చెప్పిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని, రాష్ట్రపతి పాలన విధిస్తామనే హక్కు న్యాయస్థానాలకు ఎవరిచ్చారు? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బొత్స పేర్కొన్నారు. రాయలసీమ పరిరక్షణ సమితి చేస్తున్న ఉద్యమంతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. పవన్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని చెప్పారు. 13 జిల్లాల అభివృద్ధే తమ పార్టీ, ప్రభుత్వం విధానమన్నారు. -
రుణమాఫీ చేయకుండా రైతుయాత్రలా!
-
రుణమాఫీ చేయకుండా రైతుయాత్రలా!
రైతులకు రుణమాఫీ చేయకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు యాత్రలు ఎలా చేస్తారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా డ్వాక్రా యాత్రలు కూడా చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. మ్యానిఫెస్టో అంతా కూడా అమలు చేసేశామని యాత్రలు చేసేట్టున్నారన్నారు. ఓటుకు కోట్ల కేసుకు భయపడి గతంలో కేబినెట్ సమావేశాన్ని విజయవాడలో పెట్టారని, ఇప్పుడు మళ్లీ విజయవాడలో పెడితే రైతులు అడ్డుకుంటారని హైదరాబాద్‌లో పెట్టారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పగటిపూట నిరంతరం 12 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పారని, అధికారంలోకి రాగానే 7 గంటలు ఇస్తామని మాట మార్చారని, కానీ ఇప్పుడు 7 గంటలు ఇచ్చేది కూడా అనుమానమేనని అన్నారు. ఇక రాజధాని నగర నిర్మాణంలో సింగపూర్ పాత్రపై తమకు అనుమానాలున్నాయని పార్థసారథి చెప్పారు. చంద్రబాబు తన ఆస్తులు కాపాడుకోడానికి సింగపూర్ ప్రభుత్వానికి ఇక్కడి రాజధాని పనులు అప్పగించారని ఆరోపించారు. బందరు పోర్టుకు అన్నివేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. గతంలో వైఎస్ ఎప్పుడూ బహుళ పంటలు పండే భూములు ఇవ్వలేదని, ఇప్పుడు మాత్రం ప్రభుత్వం బందరు పోర్టుకు వేలాది ఎకరాలు ఎందుకు ఇస్తోందని నిలదీశారు.