ఆ వార్తలో నిజం లేదు!
తెలుగులో తాను ఓ చిత్రాన్ని అంగీకరించినట్లు వస్తున్న వార్తలో నిజం లేదని కమల్‌హాసన్ స్పష్టం చేశారు. కొందరు తెలుగు దర్శకులతో చర్చలు జరుపుతున్న మాట నిజమే కానీ, ఏదీ ఖరారు కాలేదని ఆయన చెప్పారు. సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్‌లోనే తన తెలుగు సినిమా ఉంటుందని కమల్ తెలిపారు.