in rajahmundry
-
5 నుంచి సిటీబస్సుల సందడి
మొదటి రెండు రోజులూ ఉచితం ∙ ఎంపీ మురళీమోహ¯ŒS రాజమహేంద్రవరం సిటీ : ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ఆర్టీసీ సిటీ బస్సులు నడిపేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్టు ఎంపీ మురళీమోహ¯ŒS పేర్కొన్నారు. ఆదివారం కార్పొరేష¯ŒS కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఎంపీ మాట్లాడుతూ రెండు రోజుల పాటు ఉచితంగా నడిపేందుకు ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు. మొదటి విడతగా 10 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఈ ఏడాది చివరకు దఫదఫాలుగా 50 బస్సులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉదయం 7.30 గంటలకు మొదలయ్యే ఈ బస్సులను నగర వాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ బస్సులు నడిచేందుకు వీలుగా రహదారి ఆక్రమణలు తక్షణమే తొలగించే చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను కోరారు. బస్సులు ఆగేందుకు స్టాండ్లు ఏర్పాటు చేస్తామన్నారు. టిక్కెట్ ధర రూ.7 నుంచి రూ.18Sవరకూ నిర్ణయించారన్నారు. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలో పబ్లిక్ ట్రా¯Œ్సపోర్ట్ పెరగాలన్నారు. ప్రస్తుతం అధికారుల నిర్ణయించిన మూడు రూట్లలో కాకుండా ప్రయాణీకులకు అనువుగా ఉండే విధంగా బస్సులు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. కమినషర్ విజయరామరాజు, ఆర్టీసీ అధికారులు ఆర్వీఎస్ నాగేశ్వర్రావు, పెద్దిరాజు కుమార్ పాల్గొన్నారు. -
పుష్కర విచారణ ముగిసేదెప్పుడు ?
రేపటితో ముగియనున్న గడువు నేడు మరోసారి విచారణ ఇప్పటికి మూడుసార్లు గడువు పెంపు ఆధారాలు సమర్పించని ప్రభుత్వ శాఖలు సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి మహా పుష్కరాల తొలి రోజున జరిగిన తొక్కిసలాటపై విచారణ కొనసా.....గుతూనే ఉంది. ఏకసభ్య కమిష¯ŒSకు ప్రభుత్వ శాఖలు ఏడాదిన్నరగా ఆధారాలు సమర్పిస్తూనే... ఉన్నాయి. ఇప్పటికి కూడా కొన్ని ప్రభుత్వ శాఖలు ఇంకా ఆధారాలు సమర్పించాల్సి ఉంది. దీనిపై కమిష¯ŒS ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వ శాఖల స్పందన అంతంత మాత్రంగానే ఉంది. 2015 జూలై 14న గోదావరి మహా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరిగి పుణ్య స్నానాలకు వచ్చిన 29 మంది దుర్మరణంపాలయ్యారు. మరో 51 మంది గాయపడ్డారు. గాయపడిన వారిపై కూడా పోలీసు, రెవెన్యూ శాఖల లెక్కలు భిన్నంగా ఉన్నాయి. వీవీఐపీలు పుష్కరఘాట్లకు రావడం, గంటల కొద్దీ ప్రజలను బారికేడ్ల ద్వారా నిలువరించి ఒక్కసారిగా వదలడంతో తోపులాట జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అనంతరం ప్రభుత్వం ఘటనపై సమగ్ర విచారణ కోసమంటూ జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలో ఏకసభ్య కమిష¯ŒS వేసింది.ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని గడువు విధించింది. అయితే సీఎం చంద్రబాబు కుటుంబం పుష్కర ఘాట్‌లో స్నానమాచరించడం, డాక్యుమెంటరీ కోసం ప్రజలను నిలిపివేయడం వల్లనే ప్రమాదం జరిగిందని రాజకీయ పార్టీల నేతలు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు బలంగా ఆరోపించాయి. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా కమిష¯ŒSకు సమర్పించాయి. విచారణ పూర్తయితే సీఎం చంద్రబాబు, సాధారణ భక్తులు స్నానం చేసే పుష్కర ఘాట్‌లోకి వీవీఐపీలను అనుమతించిన అధికారులు దోషులుగా తేలే అవకాశం ఉందని ప్రభుత్వ శాఖలు విచారణ సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. తమ వద్ద ఉన్న ఆధారాలను ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయి. కమిష¯ŒS అడిగినా కూడా అరకొరగా ఇస్తూ కాలం వెళ్లదీస్తున్నాయి. దీనిపై కమిష¯ŒS కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా ప్రభుత్వ శాఖలకు చీమ కుట్టినట్లుగా లేదు. జియోగ్రాఫికల్ చానెల్ చిత్రీకరించిన డాక్యుమెంటరీని కూడా ఎడిట్ చేసి ఇచ్చారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేసిన వారు పేర్కొంటున్నారు. మూడోసారి కూడా రిక్త హస్తమేనా? ప్రభుత్వ శాఖలు ఆధారాలు సమర్పించకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన ఆరు నెలల గడువులోపు ఏకసభ్య కమిష¯ŒS విచారణ పూర్తి చేయలేకపోయింది. దీంతో కలెక్టర్ వినతి మేరకు ప్రభుత్వం ఇప్పటి వరకు మూడుసార్లు గడువు పొడిగించింది. కమిష¯ŒSకు ఇచ్చిన గడువు ఆరు నెలలు గత ఏడాది మార్చి 29తో ముగియగా జూ¯ŒS 29 వరకు మరో మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు నెల తరువాత జారీ చేసింది. ఆ సమయంలో కూడా విచారణ పూర్తి కాకపోవడంతో రెండోసారి సెప్టెంబర్ 29 వరకు మరో మూడు నెలలు గడువు ఇస్తూ రెండో దఫా గడువు పెంచారు. ఈసారి కూడా దాదాపు 24 రోజుల అనంతరం పెంచిన గడువుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు కూడా ప్రభుత్వ శాఖలు సహకరించకపోవడంతో విచారణ పూర్తి కాలేదు. దీంతో మూడోదఫా ఈ ఏడాది జనవరి 29 వరకు నాలుగు నెలలపాటు గడువు పెంచుతూ నెల తరువాత ప్రభుత్వం జారీ చేసింది.మూడుసార్లు గడువు పెంచిన ప్రభుత్వం వాటికి సంబంధించిన జీవోలు మాత్రం ప్రతిసారీ దాదాపు నెల రోజుల తరువాత జారీ చేయడం విచారణను సాగ దీయడమేనని అఫిడవిట్ దాఖలు చేసిన వారు ఆరోపిస్తున్నారు. పెంచిన గడువు 29తో ముగుస్తోంది. శనివారం మరోసారి కమిష¯ŒS విచారణ చేపడుతోంది. ఈ సారైనా విచారణ ఎంత వరకు వచ్చిందన్న దానిపై కమిష¯ŒS ఒక స్పష్టత ఇస్తుందని అఫిడవిట్ దాఖలు చేసిన వారు ఆశిస్తున్నారు. ఆధారాలు సమర్పించడంలో అధికారుల నిర్లక్ష్యం... విచారణ ప్రారంభమై ఏడాదిన్నర గడుస్తోంది. ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అధికారులు వాస్తవాలను కమిష¯ŒS ముందు పెట్టకపోవడంతోనే ఈ జాప్యం జరుగుతోంది. కమిష¯ŒS అడిగినా సరైన స్పందన లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకు ఉదాహరణ నేషనల్ జియోగ్రఫీ చానల్ ఫుటేజీని ఎడిట్చేసి ఇవ్వడమే. విచారణ పూర్తికి అవసరమైన సమాచారం కాకుండా అనవసరమైన వివరాలు కమిష¯ŒSకు ఇస్తున్నారు. పోలీసు విచారణ కూడా ఇప్పటి వరకూ పూర్తి కాలేదంటున్నారు. – ముప్పాళ్ల సుబ్బారావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, రాజమహేంద్రవరం. ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారు ఏడాదిన్నరవుతున్నా ఇప్పటికీ విచారణ పూర్తి కాలేదు. చంద్రబాబు దోషిగా తేలుతాడన్న భయంతోనే విచారణను నాన్చుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ శాఖలను తన ఇష్టానుసారం ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ శాఖలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. అధికారులు స్వేచ్ఛగా తమ పని చేయలేకపోతున్నారు. అందుకు నిదర్శనమే ఇప్పటి వరకు ఆధారాలు సమర్పించకపోవడం. విచారణ పొడిగిస్తూ ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారు. – జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు. చంద్రబాబే బాధ్యుడు కాబట్టి... పుష్కరాలు తానే నిర్వహించానని సీఎం చంద్రబాబు పదే పదే చెప్పారు. ఇదే విషయం కమిష¯ŒS ముందు ఆధారాలతో నేను సమర్పించాను. అధికారులు నిజాలు చెప్పాలి. కమిష¯ŒS వాటినే ప్రభుత్వానికి సమర్పిస్తుంది. కానీ అధికారులు నిజాలు చెప్పేందుకు ముందుకు రావడంలేదు. డాక్యుమెంటరీ చిత్రీకరణ వల్లే తొక్కిసలాట జరిగింది. ఈ అఘాయిత్యానికి కారణం చంద్రబాబే. ఇది అందరికీ తెలుసు. ఈ ఘటనలో చంద్రబాబే ముద్దాయి అవుతాడు. పొరపాటు జరిగిందని చంద్రబాబు ఒప్పుకుంటే సరిపోతుంది. కానీ మానవ ప్రమేయం లేదని వాదిస్తాడు. విచారణ కోసం మళ్లీ గడువు ఇస్తారు. చివరికి అధికారులు సహకరించడం లేదని కమిష¯ŒS ప్రభుత్వానికి చెప్పే అవకాశం ఉంది. – ఉండవల్లి అరుణ్‌కుమార్, పార్లమెంట్ మాజీ సభ్యుడు -
పగలు కన్నేసి.. రాత్రికి కన్నం..
ఐదేళ్లలో రెండు జిల్లాల్లో 33 చోరీలు రూ.36.86లక్షలు విలువైన నగలు స్వాధీనం రాజమహేంద్రవరం క్రైం : పగలు ఇనుప వ్యాపారం, రాత్రిళ్లు చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఇక్కడి పోలీస్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బి. రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామానికి చెందిన కొలుసు శ్రీను వ్యవసాయ కూలీగా, పాత ఇనుప వ్యాపారం కొని అమ్మేవాడని తెలిపారు. పగటి పూట ఇనుప వ్యాపారం చేస్తూనే తాళం వేసి ఉన్న ఇళ్లను కనిపెట్టి రాత్రిళ్లు చోరీలకు పాల్పడేవాడు. 2006 లో ఇలా పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చాడని, మళ్లీ 2012 నుంచి ఇప్పటి వరకూ జగ్గంపేట, రంగంపేట, రాజానగరం, గోకవరం, కామరాజుపేట, కోరుకొండ, సీతానగరం, తదితర మండలలోని గ్రామాల్లో 33 చోరీలకు పాల్పడ్డాడన్నారు. 1 కేజీ 328 గ్రాముల (1.66 కాసులు) బంగారు నగలు, 1 కేజీ 250 గ్రాముల వెండి వస్తువులు, రూ 1.15లక్ష ల నగదు చోరీ చేసి, నగలు దగ్గర బందువులకు అమ్ముతూ ఇప్పటివరకూ తప్పించుకున్నాడన్నారు. ఈ మధ్య కాలంలో శ్రీను విలాసాలకు అలవాటు పడి కోడిపందాలు, తాగుడు, వ్యభిచారాలకు ఖర్చు పెట్టాడన్నారు. చోరీ చేసిన వస్తువులు విక్రయిస్తుండగా రాజమహేంద్రవరం క్రైం డీఎస్పీ ఎ.త్రినాథరావుకు వచ్చిన సమాచారం మేరకు వారి సిబ్బంది కోరుకొండ సీఐ ఎ¯ŒS.మధుసూదనరావు, సీఐ సాయి రమేష్, కానిస్టేబుళ్లు బి. శ్రీనివాసరావు, పెద్ద సురేష్, చిన్న సురేష్ నిందితుడిని అరెస్ట్ చేశారన్నారు. పెద్ద సురేష్ కు నగదు రివార్డును అందజేశారు. పోలీసులు రికవరీ చేసిన సొమ్ము బంగారు నగలు 1.66 కాసులు, వెండి 1.250 గ్రాముల వెండి వస్తువులు, నగదు రూ1.4 లక్షలు. వీటి విలువ రూ.36.86 లక్షలు. రాజమహేంద్రవరంలో జరిగిన చోరీల్లో బంగారం 96.06 గ్రాములు, వెండి 250 గ్రాములు, నగదు రూ. 1.15 లక్షలు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా పరిధిలో 19 కేసులు, తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 13 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో (పోలవరంలో) ఒక కేసు నమోదైంది. విలేకరుల సమావేశంలో అడిషినల్ ఎస్పీ ఆర్.గంగాధర్, డీఎస్పీలు కులశేఖర్, శ్రీనివాసరావు, త్రినాథరావు, సీఐ శ్రీరామ కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.