- ఐదేళ్లలో రెండు జిల్లాల్లో 33 చోరీలు
- రూ.36.86లక్షలు విలువైన నగలు స్వాధీనం
పగలు కన్నేసి.. రాత్రికి కన్నం..
Published Sat, Dec 31 2016 10:43 PM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM
రాజమహేంద్రవరం క్రైం :
పగలు ఇనుప వ్యాపారం, రాత్రిళ్లు చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఇక్కడి పోలీస్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బి. రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామానికి చెందిన కొలుసు శ్రీను వ్యవసాయ కూలీగా, పాత ఇనుప వ్యాపారం కొని అమ్మేవాడని తెలిపారు. పగటి పూట ఇనుప వ్యాపారం చేస్తూనే తాళం వేసి ఉన్న ఇళ్లను కనిపెట్టి రాత్రిళ్లు చోరీలకు పాల్పడేవాడు. 2006 లో ఇలా పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చాడని, మళ్లీ 2012 నుంచి ఇప్పటి వరకూ జగ్గంపేట, రంగంపేట, రాజానగరం, గోకవరం, కామరాజుపేట, కోరుకొండ, సీతానగరం, తదితర మండలలోని గ్రామాల్లో 33 చోరీలకు పాల్పడ్డాడన్నారు. 1 కేజీ 328 గ్రాముల (1.66 కాసులు) బంగారు నగలు, 1 కేజీ 250 గ్రాముల వెండి వస్తువులు, రూ 1.15లక్ష ల నగదు చోరీ చేసి, నగలు దగ్గర బందువులకు అమ్ముతూ ఇప్పటివరకూ తప్పించుకున్నాడన్నారు. ఈ మధ్య కాలంలో శ్రీను విలాసాలకు అలవాటు పడి కోడిపందాలు, తాగుడు, వ్యభిచారాలకు ఖర్చు పెట్టాడన్నారు. చోరీ చేసిన వస్తువులు విక్రయిస్తుండగా రాజమహేంద్రవరం క్రైం డీఎస్పీ ఎ.త్రినాథరావుకు వచ్చిన సమాచారం మేరకు వారి సిబ్బంది కోరుకొండ సీఐ ఎ¯ŒS.మధుసూదనరావు, సీఐ సాయి రమేష్, కానిస్టేబుళ్లు బి. శ్రీనివాసరావు, పెద్ద సురేష్, చిన్న సురేష్ నిందితుడిని అరెస్ట్ చేశారన్నారు. పెద్ద సురేష్ కు నగదు రివార్డును అందజేశారు.
పోలీసులు రికవరీ చేసిన సొమ్ము బంగారు నగలు 1.66 కాసులు, వెండి 1.250 గ్రాముల వెండి వస్తువులు, నగదు రూ1.4 లక్షలు. వీటి విలువ రూ.36.86 లక్షలు. రాజమహేంద్రవరంలో జరిగిన చోరీల్లో బంగారం 96.06 గ్రాములు, వెండి 250 గ్రాములు, నగదు రూ. 1.15 లక్షలు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా పరిధిలో 19 కేసులు, తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 13 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో (పోలవరంలో) ఒక కేసు నమోదైంది. విలేకరుల సమావేశంలో అడిషినల్ ఎస్పీ ఆర్.గంగాధర్, డీఎస్పీలు కులశేఖర్, శ్రీనివాసరావు, త్రినాథరావు, సీఐ శ్రీరామ కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement