పుణ్యస్నానమాచరించిన గవర్నర్ దంపతులు
రాజమండ్రి : గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం రాజమండ్రిలోని సరస్వతి పుష్కర ఘాట్ లో పుణ్యస్నానం చేశారు. సోమవారం ఉదయం గవర్నర్ దంపతులు హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్నారు. అధికారులు ఈ సందర్భంగా వారికి ఘనస్వాగతం పలికారు. సరస్వతీ ఘాట్లో పుష్కర స్నానమాచరించారు. అర్చకులు గోదావరి పుష్కర ప్రాశస్త్యాన్ని గవర్నర్ దంపతులకు వివరించారు. గవర్నర్ రాక సందర్భంగా రాజమండ్రిలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. రాజమండ్రి నుంచి గవర్నర్ భద్రాచలం బయలుదేరి వెళతారు. అక్కడ పవిత్ర స్నానం చేసి సీతారామస్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కు వస్తారు.