Rajaji hall
-
కిటికీ ఎక్కి.. ఫెన్సింగ్ దూకి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ సీఎం, దివంగత కరుణానిధి అంతిమయాత్రలో అగ్రనేతలు నానా అవస్థలు పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ సైతం కరుణ అంత్యక్రియల సమయంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తొలుత కరుణ భౌతికకాయానికి అంజలి ఘటించేందుకు రాజాజీ హాల్ వద్దకు రాహుల్ చేరుకున్న సమయంలో అక్కడ వీఐపీల మార్గం కిక్కిరిసి ఉంది. దీంతో ముందుకు వెళ్లేదారిలేక రాహుల్ అక్కడే ఆగిపోయారు. ఇంతలో కొందరు సెక్యూరిటీ గార్డులు రాహుల్‌కు కుర్చీ ఏర్పాటుచేసి దారి క్లియర్ చేసేందుకు వెళ్లారు. ఇలా వెళ్లినవారు ఎంతకూ తిరిగి రాకపోవడంతో రాహుల్ అక్కడే తచ్చాడారు. ఇలా దాదాపు 30 నిమిషాలు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రాహుల్ ఒక్కరే ఉన్నారని కేంద్ర హోంశాఖకు సమాచారం అందింది. కర్రల కింద నుంచి దూరి.. కరుణ అంత్యక్రియలు జరిగిన మెరీనా బీచ్‌కు చేరుకోవడానికీ రాహుల్ చాలా అవస్థలు పడ్డారు. అశేషజనవాహని మధ్య టీఎన్‌సీసీ చీఫ్ తిరునావుక్కరసర్, మాజీ ఎంపీ విశ్వనాథన్ తదితరులు రాహుల్ చుట్టూ వలయంగా ఏర్పడి ఆయన్ను అంత్యక్రియల వేదిక వద్దకు తీసుకెళ్లారు. అయినా జనం తాకిడితో రాహుల్ ఇబ్బంది పడ్డారు. కరుణ అంత్యక్రియలు ముగిశాక అక్కడ్నుంచి తిరిగివెళ్లడం రాహుల్‌కు మరో సవాలుగా మారింది. సమీపంలోని అన్నా స్మారక మందిరం పక్కనే ఉన్న పెయింట్ డబ్బాలపైకి ఎక్కి కిటీకి ఊచలు పట్టుకుని అవతలకు దూకారు. అక్కడ చిందరవందరగా ఉన్న పాత తుక్కు సామానుపైనే నడుచుకుంటూ ముందుకెళ్లారు. అనంతరం అడ్డుగా కట్టిన కర్రల కింద నుంచి దూరి సమీపంలోని కారు వద్దకు చేరుకుని బతుకుజీవుడా.. అంటూ బయటపడ్డారు. కాగా, రాహుల్ భద్రత విషయంలో చోటుచేసుకున్న నిర్లక్ష్యంపై చెన్నై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కర్ణాటక సీఎం కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్, మాజీ సీఎం సిద్దరామయ్య, కేరళ సీఎం విజయన్, కేరళ గవర్నర్ తదితరులు జనసందోహంలో చిక్కుకుపోయారు. చివరికి భద్రతా సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. -
రాజాజీ హాల్లో తొక్కిసలాట.. ఇద్దరి మృతి
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధిని కడసారి చూసేందుకు డీఎంకే కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రాజాజీ హాల్‌కు చేరుకుంటున్నారు. భారీగా తరలివస్తున్న అభిమానులను నియంత్రించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. జనం రద్దీ పెరగడం, అభిమానులు బారికేడ్లను తోసుకొని రావడంతో రాజాజీ హాల్లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందగా, 40 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ సందర్భంగా డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మాట్లాడుతూ.. కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అంతిమయాత్ర సజావుగా సాగేలా కార్యకర్తలు సహకరించాలని కోరారు. సీఎం పళనిస్వామిని కలసి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో నిర్వహిస్తామంటే సహకరించలేదని తెలిపారు. కోర్టు ద్వారా అనుమతులు సాధించామని పేర్కొన్న ఆయన దీనిని తమిళ ప్రజల విజయంగా అభివర్ణించారు. 4 గంటలకు ప్రారంభంకానున్న అంతిమయాత్ర సాయంత్రం 4 గంటలకు రాజాజీ హాల్ నుంచి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా గంటన్నరపాటు అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాగంణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి. మెరీనా బీచ్‌లో ఆర్మీ బలగాలు.. కరుణానిధి అంత్యక్రియలు జరగనున్న మెరీనా బీచ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటుండటంతో అక్కడ భారీగా సైనిక బలగాలను మొహరించారు. మరోవైపు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. -
కరుణానిధికి ప్రధాని మోదీ నివాళి
-
ఈ రోజు సాయంత్రం జయ అంత్యక్రియలు
-
ఎంజీఆర్ సమాధి పక్కనే అమ్మ సమాధికి ఏర్పాట్లు
-
రాజాజి హాల్‌కు జయలలిత పార్థివదేహం
-
ఈ రోజు సాయంత్రం జయ అంత్యక్రియలు
చెన్నై: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన జయలలిత పార్థివదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో మొదట ఆమె అధికార నివాసం పోయెస్ గార్డెన్‌కు తరలించారు. జయ వారసుడిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన పన్నీర్ సెల్వం, ఇతర మంత్రులు, ఏఐడీఎంకే పార్టీ ముఖ్యనేతలు ఆ కాన్వాయ్ ని అనుసరించారు. జయ పార్థివదేహం పక్కనే ఆమె నెచ్చెలి శశికళ ఉన్నారు. చెన్నై మెరీనా బీచ్ వద్ద గురువు ఎంజీఆర్ సమాధి పక్కన మంగళవారం సాయంత్రం 5-6 గంటల మధ్య జయలలిత అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ మేరకు దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెల్లవారుజామున వెల్లడించాయి. కొద్దిసేపు పోయెస్ గార్డెన్లో ఉంచిన అనంతరం జయ పార్థివదేహాన్ని ప్రఖ్యాన రాజాజీ పబ్లిక్ హాల్‌కు తరలింంచారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశంలోని ఇతర పార్టీల నాయకులు, ప్రజలు.. రాజాజీ హాలులోనే జయ పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు. చెన్నై నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. వారం రోజులు సంతాపదినాలు ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే కన్నుమూసిన జయలలిత మృతికి సంతాపంగా తమిళనాడులో ఏడు రోజులు సంతాపదినాలు పాటించనున్నారు. మూడు రోజుల పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం తెల్లవారుజామున ఒక ప్రకటన విడుదల చేశారు.