అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దివంగతించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. పదవీకాలంలో జయ వినియోగించిన కాన్వాయ్ వెంటరాగా.. ప్రత్యేక అంబులెన్స్‌లో జయ పార్థివదేహాన్ని మొదట ఆమె అధికార నివాసం పోయెస్ గార్డెన్‌కు తరలించారు. జయ వారసుడిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన పన్నీర్ సెల్వం, ఇతర మంత్రులు, ఏఐడీఎంకే పార్టీ ముఖ్యనేతలు ఆ కాన్వాయ్ ని అనుసరించారు. జయ పార్థివదేహం పక్కనే ఆమె నెచ్చెలి శశికళ ఉన్నారు. చెన్నై మెరీనా బీచ్ వద్ద బుధవారం సాయంత్రం జయలలిత అంత్యక్రియలు నిర్వహిస్తారు.