కెయిర్న్ ఇండియాకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అదనపు చమురు వెలికితీసేందుకు కెయిర్న్ ఇండియాకు పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది. రాజస్థాన్ బ్లాక్ లో అదనంగా 50 శాతం చమురు వెలికితీసేందుకు అనుమతినిచ్చింది. కెయిర్న్ ఇండియా రోజుకు 3 లక్షల బారెల్స్ ముడి చమురు బయటకు తీయనుంది.
గ్యాస్ వెలికి తీసేందుకు కూడా కెయిర్న్ ఇండియాకు పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. దీంతో రాజస్థాన్ బ్లాక్ లో రోజుకు 165 మిలియన్ క్యూబిక్ ఘనపుటడుగుల గ్యాస్ ఉత్పత్తి చేయనుంది. వివిధ రకాల ప్రాజెక్టులకు వేగంగా అనుమతలు మంజూరు చేయడం ద్వారా దేశాభివృద్ధికి బాటలు వేయాలన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగానే కెయిర్న్ ఇండియాకు పచ్చ జెండా ఊపింది.