Rajasthan govt
-
ప్రజా సొమ్ము వృథా కూడా అవినీతే!
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్లోని జైపూర్లో శనివారం జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ప్రభుత్వం నిధులను భారీగా ఖర్చు చేయడం ఎంత మేరకు భావ్యమని విజ్ఞులు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. భారీ ఎత్తున సభకు తరలి వచ్చిన ప్రజల రవాణా సౌకర్యాల కోసం 7.23 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. సభకు వచ్చిన ప్రజల అన్న పానీయాల కోసం, ముందస్తుగా వచ్చిన వారి వసతి కోసం మరిన్ని కోట్ల రూపాయలను రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రధాని మాట్లాడిందీ రాజకీయ సభలోకాదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన ప్రభుత్వ స్కీముల గురించి ప్రజలకు తెలియజేయడం కోసం ప్రభుత్వమే ఏర్పాటు చేసిన సభని ఎవరైన వాదించవచ్చు. సభలో ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాలే ఎక్కువ మాట్లాడారని సభకు హాజరైన ఎవరినడిగినా చెబుతారు. కాంగ్రెస్ను ‘బెయిల్ బండి’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను ఎవరు మరచిపోలేరు. అయినా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే వాటిని సక్రమంగా అమలు చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టాలిగానీ ఇలా సభల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడం ఏమిటన విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ భారీ సభను ఏర్పాటు చేశారని వారు విమర్శిస్తున్నారు. కేంద్ర, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలను వాణిజ్య ప్రకటనల రూపంలో ఖర్చు పెట్టారు. ఇప్పుడు సభల కోసం భారీగా నిధులు ఖర్చు చేయడం వల్ల ప్రజా జీవితాల్లో మార్పులు వస్తాయా, వారి జీవణ ప్రమాణాలు పెరుగుతాయా? డబ్బును ఇలా వృథా చేయడానికి బదులు ప్రజల అభ్యున్నతి కోసం ఖర్చు చేస్తే వారి జీవన ప్రమాణాలు మెరగుపడవా? అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాల అవినీతి గురించి ప్రస్తావించే మోదీకి ఇలా ప్రజా సొమ్మును వృథా చేయడం కూడా ఓ రకమైన అవినీతేనని అనిపించలేదా? అంటూ విజ్ఞులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. -
మనిషి ప్రాణానికి రూ.26, ఆవు ప్రాణానికి రూ.70
న్యూఢిల్లీ: సాంస్కృతికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతున్న భారత దేశంలో మనిషి ప్రాణాలు ఎక్కువ విలువైనవా? ఆవు ప్రాణాలు ఎక్కువ విలువైనవా? అని ఎవరైనాఅడిగితే గతంలోనైతే ఏమాత్రం ఆలోచించకుండా మనిషి ప్రాణాలే ఎక్కువ విలువైనవని చెప్పేవారు. గోమాంసం పేరిట మనుషులను గొడ్డులాబాది ప్రాణాలను తీస్తున్న ప్రస్తుతం పరిస్థితుల్లో మనిషి ప్రాణం కన్నా ఆవు ప్రాణమే కచ్చితంగా విలువైనదని చెప్పవచ్చు! అందుకే రాజస్థాన్లోని వసుంధర రాజే ప్రభుత్వం కూడా పేదలకిచ్చే విలువకన్నా ఆవులకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద ప్రజలను ఆదుకునేందుకు వసుంధర రాజె ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద ప్రతి వ్యక్తిపై రోజుకు 26.65 రూపాయలను ఖర్చు చేస్తోంది. అదే ప్రతి ఆవు సంరక్షణకు రోజుకు 70 రూపాయలను ఖర్చు పెడుతున్నది. అదే దూడలపై 35 రూపాయల చొప్పున ఖర్చు చేస్తోంది. ఇది కేవలం వాటి దాణా కోసం వెచ్చిస్తున్న సొమ్ము మాత్రమే. ఈ మొత్తాన్ని కూడా ప్రజల నుంచే రాబట్టేందుకు 33 రకాల ప్రజల లావాదేవీలపై పది శాతం ఆవు సెస్సును విధిస్తోంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై కూడా ఎన్నడూ శ్రద్ధ పెట్టని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గోసంరక్షణ శాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. జైపూర్లోని హింగోనియా గోసంరక్షణ శాలలో వేలాది ఆవులు మరణించడమే అందుకు కారణం కావచ్చు. అధునాతన హంగులతో రాష్ట్రంలో పలు గోసంరక్షణ శాలలను నిర్మించాలని, వేళకు వాటికి దాణా అందుతుందో, లేదో తెలుసుకోవడానికి సీసీటీవీ కెమేరాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎంతోకాలంపాటు గోవుల ఆలనా, పాలనా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి నెలలో గోసంరక్షణ కోసం ఓ ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఆ కమిటీ సమావేశమై ఆవుల మేత కోసం ఒక్కో ఆవుపై రోజుకు 32 రూపాయలను, ప్రతి దూడపై 16 రూపాయలను ఖర్చు పెట్టాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మూడు నెలలపాటు అమలు చేయాలని నిర్ణయించి, అమలు చేసింది కూడా. మళ్లీ ఏప్రిల్ మాసంలో ఈ కమిటీ రాజస్థాన్లోని 13 జిల్లాల మున్సిపల్ అధికారులతో సమావేశమై ఒక్కో అవుపై ఖర్చుపెట్టే మొత్తాన్ని 70 రూపాయలకు, దూడపై పెట్టే ఖర్చుపెట్టే మొత్తాన్ని 35 రూపాయలకు పెంచాలని తీర్మానించింది. పెరిగిన ఈ అదనపు భారాన్ని ప్రజల నుంచి ఏ రూపంలో వసూలు చేయాలని ఇప్పుడు మున్సిపాలిటీలు కసరత్తు చేస్తున్నాయి. రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాకు చెందిన రషీద్ దారిద్య్ర రేఖకు దిగువున జీవిస్తున్నాడు. ఆయన రోజు రిక్షా తొక్కడం ద్వారా రోజుకు 60 నుంచి 70 రూపాయలు సంపాదిస్తున్నాడు. అందులో తన ఖర్చులుపోనూ ఉంటున్న గుడెశెకు అద్దె చెల్లించాలి. భార్యా, ఇద్దరు పిల్లలను పోషించాలి. రాజస్థాన్లో దాదాపు 30 శాతం మంది రషీద్ లాంటి వారు ఉన్నారు. వారి బతుకులు అలా తెల్లారిపోవాల్సిందేనా!. -
రాబర్ట్ వాద్రాకు చుక్కలు చూపిస్తున్న రాజస్థాన్ ప్రభుత్వం!
జైపూర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు రాజస్థాన్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ లిమిటెడ్ కంపెనీ బికనీర్లో కొనుగోలు చేసిన భూములకు యాజమాన్య హక్కులు కల్పించే ఒప్పందాన్ని రద్దు చేసింది. మొత్తం 360 హెక్టార్ల భూమికి ఇది వర్తిస్తుంది. ఈ భూములను రైతుల నుంచి అక్రమంగా రాబట్టుకున్నారని వాద్రా సంస్థపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్లోని వసుంధరా రాజే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.