హరితహారం కోసం..
- సైక్లింగ్ చేస్తూ సంగారెడ్డికి వచ్చిన రాజీవ్ త్రివేది
సంగారెడ్డి రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో పాల్గొనేందుకు హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది ఆదివారం సైకిల్ యాత్ర చేశారు. 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డికి వచ్చారు. హైదరాబాద్ నుంచి సైకిల్‌పై బయలుదేరి సంగారెడ్డిలోని పోలీస్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. పోలీసు పరేడ్ గ్రౌండ్, కంది సమీపంలోని జిల్లా జైలు ఆవరణలో మొక్కలు నాటారు.