'విశాఖ ఎయిర్‌పోర్టులో నిఘా పటిష్టం'
విశాఖ: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో నిఘాను మరింత పటిష్టం చేశామని కస్టమ్స్ కమిషనర్ రాజేంద్రన్ పేర్కొన్నారు. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిటేక్టర్లు, లగేజ్ స్కానర్లను ఉపయోగిస్తున్నామని ఆయన అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు.
ఎయిర్ కనక్టవిటీ పెరిగిన తర్వాత గోల్డ్ స్మగ్లింగ్ వంటి సమస్యలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి కంటైనర్లుపై కూడా నిఘా పెట్టామని రాజేంద్రన్ తెలిపారు.